నెమ్మది నాకు స్నేహితురాలైంది. కానీ అది అంతకుముందు ఎప్పుడూ అలా లేదు.
మీరు గమనించనట్లయితే, ఒత్తిడి పెద్ద మొత్తంలో శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. చిందింపబడుచున్న దుఃఖాన్ని మీ చేతులతో ఆపడానికి ప్రయత్నించడమనేది రుమాలుతో గర్జించే జలపాతాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది-దానిని ఇంకిపోజేయడానికి సరిపోయేది ఏదీ ఉండదు, కానీ నేను ప్రయత్నించినప్పుడు నా హృదయం కలవరపడింది. నేను నిశ్శబ్ద ఉపశమనం కోసం పుస్తకాలు మరియు వనరులను వెతుకుతున్నప్పుడు నా మనస్సు ప్రతిధ్వనించింది. నేను నిశ్చలంగా కూర్చోవడానికి ప్రయత్నించినా లేదా బిజీగా ఉండడానికి ప్రయత్నించినా అది గలగల ధ్వని చేస్తూనే ఉంది. మరియు దుఃఖము యొక్క ఇనుప బంతి ఎంత బిగ్గరగా మోగిందంటే, అది పొరుగువారిని మేల్కొల్పగలదు. ఈ రోజు వరకు, నా గుండె ఒత్తిడితో ఎంత గట్టిగా కొట్టుకుంటుందంటే, నా చెవులు గింగురుమంటాయి. అయితే, దేవుని కరుణ మరియు ఆయన కృప ఆ శబ్దాన్ని నిమ్మళపరుస్తూనే ఉన్నాయి.
ఇది ఒక అందమైన, నిశ్శబ్దమైన సాయంత్రం కారులో పయనించేటప్పుడు నాకు జరిగింది. రోడ్డు పొడవుగా, చీకటిగా మరియు నిశ్శబ్దంగా ఉన్నందున, నేను రేడియోను ఆన్ చేసాను. మరియు ఒక పాట యొక్క సాహిత్యం నా ఆత్మతో గుసగుసలాడింది.
ఎక్కడో ఒక చోట
ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి
ఎక్కడో ఒక చోట
మనం ఇప్పుడు చూడలేకపోయినా
మరియు ఎక్కడో ఒక చోట
మీ కోసం చాపబడిన బలమైన హస్తములను మీరు కనుగొంటారు
మరియు ప్రయాణం ముగింపులో అవి సమాధానాలను కలిగి ఉంటాయి.1
నేను సమాధానాల కోసం ఎన్నిసార్లు వెతికానో. తన ప్రణాళికను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయాలని నేను ప్రభువుని ఎంతగా కోరుకున్నానో.
పాట వస్తూనే ఉంది: “ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక చోట . . . .”
నేను ఇలా అనుకున్నాను, నేను అంతా అయిపోయేంత వరకు వేచి ఉండటానికి ఇష్టపడుచున్నానా? నేను నా స్వంత మార్గాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానా, ఒకవేళ . . . పాట పూర్తిగా వ్యక్తపరచినా సరే . . .
చాలా నొప్పి కాని ఎందుకు వచ్చిందో సరైన కారణం లేదు
కన్నీళ్లు ఆరిపోయే వరకు మీరు ఏడ్చారు
ఇక్కడ ఏదీ మీకు అర్థమయ్యేట్లు చేయలేదు
మీరు ఎంతో ప్రేమగా ఎంచినది
మీ చేతుల్లోంచి జారిపోతోంది
మరి మీరంటారు
ఎందుకు, ఎందుకు, ఎందుకు
ఇది ఇలాగే జరుగుతుందా
మరియు ఎందుకు, ఎందుకు, ఎందుకు
అయితే నేను చెప్పగలిగేది ఏమిటంటే
ఎక్కడో ఒక చోట . . .
మనం ఇప్పుడు చూడలేకపోయినా
ఎక్కడో ఒక చోట
మీ కోసం చాపబడిన బలమైన హస్తములను మీరు కనుగొంటారు
మరియు ప్రయాణం ముగింపులో అవి సమాధానాలను కలిగి ఉంటాయి
నిన్న నేను అన్నీ చూశానని అనుకున్నాను
నేను ఎత్తైన గోడ ఎక్కేశానని అనుకున్నాను . . . .
మరియు నాకు తెలిసిందల్లా నడవడం మాత్రమే
పిచ్చిగా చెప్పడమే . . .2
మీరు నిశ్శబ్దంగా ఉన్నా లేదా ఘోషిస్తున్నా, ఎక్కడో ఒక చోట మీకు సమాధానాలు దొరుకుతాయి–అలాగే, మీరు అక్కడికి చేరుకున్నప్పుడు, లోబడటం కంటే ఉపశమనాన్ని కనుగొనడం గురించే మీ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని మీరు తెలుసుకుంటారు. ప్రతి మార్గమున శక్తివంతమైన హస్తములు ఉన్నాయి, మీరు వాటిల్లో పడునట్లుగా చాపబడిన సర్వశక్తిమంతుడైన దేవుని హస్తములు ఉన్నాయి. పడండి. అవును, ఆయన చేతుల్లో పడండి అలాగే మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మరియు మీ ఆత్మకు శాంతినివ్వడానికి ఆయనను అనుమతించండి.
- “Somewhere Down the Road” by Amy Grant and Wayne Kirkpatrick. Copyright © 1997 by Warner-Tamerlane Music Publishing. All rights reserved worldwide. Lyrics presented for educational and commentary purposes only.
- Grant and Kirkpatrick, “Somewhere Down the Road.”