నా పిల్లల ఎదుగుతున్న సంవత్సరాల గురించి ఇటీవల నేను ప్రతిబింబిస్తున్నాను. నేను “పరిపూర్ణ” తల్లిగా ఎలా ఉండాలనుకున్నానో అని ఆలోచించాను, అది చివరికి ఒక భ్రమ అని నేను నేర్చుకున్నాను. నేను నా పిల్లలను హాని నుండి కాపాడటానికి ప్రయత్నించాను, కానీ వారు గాయపడ్డారు. వారు జీవితాన్ని ఆనందముగా గడుపుతారని నేను ఆశించాను, కానీ వారు బాధపడ్డారు. నేను వారి “గాయముల” ను ముద్దుపెట్టుకోవాలనుకున్నాను, పిల్లలు ఆడుకోవడం చూడాలని మరియు జీవితం గొప్పదని వారు చెప్పడం వినాలని నేను కోరుకున్నాను. ఒక తల్లిగా, నేను వారిని నిజ జీవితం యొక్క బాధ నుండి రక్షించడానికి ప్రయత్నించాను.
కానీ ప్రామాణికమైన నిజం ఏమిటంటే, జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం-వాస్తవికతను స్వీకరించడం-మనం జీవితాన్ని ఎలా అనుభవిస్తాము అనేదానికి పునాదిగా ఉంది. వాస్తవికత తేలికైనదని నేను చెప్పలేదని గమనించండి. ఒక్కోసారి చాలా బాధగా ఉంటుంది. అయితే, మీరు సత్యాన్ని ఎదుర్కొనేందుకు మరియు దానిని స్వీకరించడానికి ఎంచుకున్నప్పుడు, మీ ఆత్మ కోరుచున్న దానిని దేవుడు మీకు తిరిగి ఇస్తాడు: స్వాతంత్ర్యము, జ్ఞానం, విజ్ఞానం, సమాధానము, వివేచన మరియు నిరీక్షణ. మళ్ళీ చెబుతున్నాను, ఇది చాలా కష్టమైన పని. వ్యసనాలు, తిరస్కరణ, ఆదర్శవాదం మరియు దుఃఖం నుండి పారిపోవాలని నిర్ణయించుకున్న ఒక రచయిత యొక్క మాటలు ఇక్కడ ఉన్నాయి. చివరకు ఆమె జీవితాన్ని యథాతథంగా అంగీకరించింది. ఆమె ఇలా రాసింది:
బాధ దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి మీరు ఏది ఉపయోగించినా అది మీకు దుఃఖం ఇచ్చే శ్రేష్ఠమైన అనుభవాలను దోచుకుంటుంది. సరిదిద్దితే అంతా బాగున్నట్లుగా అనిపిస్తుంది మరియు మీ జీవితం పతనమవ్వకుండా ఉందనే భ్రమను మీకు అందిస్తుంది. కానీ మీ జీవితం నిజంగానే పతనమై ఉండవచ్చు కాబట్టి, భ్రమ శాశ్వతంగా ఉండదు, మరియు మీరు . . . ధైర్యవంతులైతే, మీరు భ్రమలను భరించడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఏడవడం మరియు మెలికలు తిరగడం మరియు కేకలు వేయడం ప్రారంభిస్తారు మరియు ఏడుస్తూనే ఉంటారు; ఆపై, చివరకు, దుఃఖం మీకు రెండు ఉత్తమమైన విషయాలను ఇస్తుంది: మృదుత్వం మరియు ప్రకాశము.1
మీ అనుభవాలు నా అనుభవాల మాదిరిగానే ఉన్నాయని నేను ఊహిస్తున్నాను: కష్టాలు మరియు ఆనందాల మిశ్రమ వాతావరణం, బాధింపబడటం మరియు స్వస్థత పొందడం, అలక్ష్యం మరియు అంగీకారం, నిరాశ మరియు నిరీక్షణ, నిరుత్సాహం మరియు స్వాతంత్ర్యము యొక్క మిశ్రమ వాతావరణం మరియు మరెన్నో ఉండి ఉంటాయి. వాస్తవాన్ని అంగీకరించడం మరియు మన దుఃఖాన్ని అనుభవించడం వల్ల మృదుత్వం మరియు ప్రకాశం లభిస్తాయని పై ఉల్లేఖనంలో గమనించండి. నేను మృదుత్వాన్ని సమాధానముతో ఉన్న వినయపూర్వకమైన ఆత్మ అని మరియు ప్రకాశమును బలం మరియు ఉద్దేశ్యం యొక్క స్పష్టత అని అర్ధం. నిజమైన బాధ మరియు నిజమైన స్వస్థత నుండి పుట్టిన ఆ రెండు లక్షణాలు అమూల్యమైనవి.
అయితే బాధ మరియు దుఃఖం కలిగిన సమయాల్లో రెండు స్వభావ లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి: గర్వము మరియు స్వార్థం. క్రింది వచనాలు క్రీస్తు యెదుట మన దీన స్థితిని మరియు మనలో ఆయన జరిగించు పునరుద్ధరణ క్రియను సూచిస్తున్నాయి.
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిప్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి . . . తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును. (1 పేతురు 5:6, 10)
- Anne Lamott, Traveling Mercies: Some Thoughts on Faith (New York: Pantheon, 1999), 72–73.