చిక్కుకుపోవడం ఒక అప్రియమైన పరిస్థితి. ఒక్క క్షణం, కొన్ని “చిక్కులను” జాబితా చేద్దాం:
- ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం
- పరీక్షలో చిక్కుకుపోవడం
- ప్రాజెక్ట్‌లో చిక్కుకుపోవడం
- ఏదో పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చిక్కుకుపోవడం
- బురదలో చిక్కుకుపోవడం
- వృత్తిలో ఎదుగుదలలేక చిక్కుకుపోవడం
- జీవితంలో చిక్కుకుపోవడం
మన మనస్సులు కూడా ఎంతోకాలంగా ఒకే విధమైన ఆలోచనలో కూరుకుపోవచ్చు-క్లిష్ట పరిస్థితి నుండి మనం ఎలా బయటపడాలో ఆలోచించలేకపోవడం లేదా గందరగోళం మరియు దిగ్భ్రాంతి యొక్క మానసిక పొగమంచులో చిక్కుకోవడం.
సంక్షోభం ఒక పెద్ద సింక్ హోల్ లాంటిది . . . అకస్మాత్తుగా, భూమి మెత్తబడి క్రుంగిపోతుంది మరియు మన జీవితాలు “దిక్కుతోచని స్థితి” లో పడిపోతాయి మరియు మనం చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. మనము ఇరుక్కున్నాము, గుంట నుండి బయటపడాలని ఆరాటపడుతున్నాము, కాని దేవుడు దానికి అనుమతించడంలేదు. మునిగిపోతే కంపుకొడుతుంది, కానీ మీరు గుంటలో చిక్కుకున్నప్పుడు, వీటిని గుర్తుంచుకోండి:
- పిచ్చిగా, కోపంగా ఉన్నా ఫర్వాలేదు.
- మీరు అలసిపోయినప్పుడు నిద్రపోవడం మంచిదే.
- సమాధానం తెలియక పోయినా ఫర్వాలేదు.
- తప్పిపోయినట్లు అనిపించినా ఫర్వాలేదు.
- భయంగా అనిపించినా ఫర్వాలేదు.
- ఏడ్చినా ఫర్వాలేదు.
- మీ నమ్మకాలను మరియు దృఢవిశ్వాసాలను అనుమానించినా ఫర్వాలేదు.
- కొన్నింటిని జరవిడుచుకున్నా లేదా మరచిపోయినా ఫర్వాలేదు.
- భారీ భావోద్వేగ మార్పులను కలిగి ఉన్నా ఫర్వాలేదు.
- “ఇది నాకు ఇప్పుడు ఇష్టం లేకపోయినా, దేవుడు నా ప్రక్కన కూర్చున్నాడని నేను నమ్ముతాను, కాబట్టి నేను ఆయనతో అన్ని విషయాల గురించి మాట్లాడవచ్చు” అని చెప్పినా ఫర్వాలేదు.
సింక్‌హోల్స్ శాశ్వతంగా ఉండవు. సింక్‌హోల్స్ స్థలాలు మార్చుకొని, మనల్ని కదిలించి, మనల్ని క్రిందకు లాగడానికి ప్రయత్నించినప్పటికీ, అవి జీవితాన్ని పరిశీలించమని మనలను బలవంతం చేస్తున్నాయి. మీరు జీవితాన్ని పరిశీలించుకోవాలని, ఆత్మీయ మార్గదర్శకుల నుండి జ్ఞానాన్ని పొందాలని, సురక్షితమైన స్నేహితుల నుండి మద్దతు కావాలని మరియు మీ హృదయ లోతుల్లో లేఖనాన్ని దాచుకోవాలని అనుకుంటే; మీరు లోతైన విశ్వాసం, అచంచల నమ్మకాలు, మరింత సమతుల్యత, గొప్ప నిరీక్షణ, మృదువైన వినయం మరియు సమృద్ధిగల కృపను పెంపొందించుకుంటారు.