మనలో చాలా మందికి, సహాయం కోరడం కష్టంగా ఉంటుంది. నేను నిజంగా దానిని ఇష్టపడను; మీలో కూడా కొందరు ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ, మనకు సహాయం అవసరమని దేవుడు మనకు పదే పదే తెలియజేస్తున్నాడు. అందుకే, ఆయన మనల్ని చాలా తరచుగా గొర్రెలుగా ఉదాహరించాడు-భూమిపై ఉన్న అన్ని పశువుల కంటే వీటిని పెంచడం చాలా కష్టం మరియు శ్రద్ధగా చూసుకోవాలి. అవసరాన్ని అంగీకరించడం అనేది నిజంగా గర్వాన్ని అధిగమించడం, మన బలాన్ని కోల్పోవడం కాదు . . . అయ్యో!
సహాయం కోసం నా దేవునిపై ఆధారపడటం నేర్చుకున్నప్పుడు నాకు ఆదరణ ఇచ్చిన కొన్ని వాక్యభాగాలు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు మీ అవసరాలు ఏమైనప్పటికీ, దేవుని నుండి మరియు ఆయన వాక్యం నుండి ఆదరణ పొందుకోండి.
భయపడినప్పుడు | యెహోషువా 1; యెషయా 41 |
కలవరపడినప్పుడు | యెషయా 55:8-9 |
ఒంటరితనం | కీర్తన 13 |
ఎటువెళ్లాలో తెలియనప్పుడు | కీర్తన 19; 37; 119 |
శ్రమల్లో | యాకోబు 1; 1 పేతురు 1; 5; 2 కొరింథీయులకు 1 |
దేవుని నుండి వాగ్దానం అవసరమైనప్పుడు | కీర్తన 40 |
బలహీనతలో | కీర్తన 18; 46 |
కఠినమైన త్రోవలో | కీర్తన 121 |
సందేహం కలిగినప్పుడు | విలాపవాక్యములు 3 |
జ్ఞానాన్ని వెదకడం | సామెతలు (రోజుకు ఒక అధ్యాయం) |
యథార్థమైన జీవితం | యాకోబు |
ప్రియమైన మిత్రమా, మీరు కోరుకున్న స్వాతంత్య్రాన్ని విడనాడండి, గర్వం యొక్క గొలుసులను ఛేదించండి మరియు మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా దేవుని సత్యాన్ని శోధించండి.