గత కొన్ని నెలలుగా, ప్రకృతి వైపరీత్యాలు ఉత్తర అమెరికాను అతలాకుతలం చేశాయి. ఉత్తర మరియు దక్షిణ కాలిఫోర్నియా మరియు పసిఫిక్ వాయువ్య ప్రాంతాలను కార్చిచ్చు ధ్వంసం చేసింది. మెక్సికోలో భూమి కంపించడంతో మరణం మరియు విధ్వంసం అధికంగా జరిగాయి. హరికేన్ తర్వాత హరికేన్ దక్షిణ టెక్సాస్ మరియు ఫ్లోరిడా, ప్యూర్టో రికో మరియు వర్జిన్ దీవులతో సహా ఉత్తర అమెరికాలోని ఇతర ప్రాంతాలను విచ్ఛిన్నము చేసింది. ఒకప్పుడు పిల్లలు ఆడుకునే, తల్లులు తమ పిల్లలతో విహరించే పరిసరాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లన్నీ బురద, బూజు పట్టిన శిథిలాల కొండలుగా మారిపోయాయి.
శిథిలాల గుండా తవ్వుచుండగా, ఇప్పటికీ తమ నిత్యవసర వస్తువులు లేని స్థితిలో కుటుంబాలు ఉన్నాయి. వారు కొన్ని నెలలు . . . బహుశా సంవత్సరాలు తరబడి శుభ్రం చేస్తూనే ఉంటారు.
ఒకప్పుడు మన జీవిత సంపదగా ఉన్న శిథిలాలను మనం ఒకరోజు జల్లెడ పట్టాల్సి వస్తుందో లేదో మనలో ఎవరికీ తెలియదు. మనము ఆ నిర్దిష్ట వినాశనాన్ని ప్రత్యక్షంగా భరించవచ్చు లేదా భరించకపోవచ్చు. కానీ మనకు ఇది తెలుసు: మనమందరం మన జీవితమంతా ఏదో ఒక రకమైన కష్టాలను భరించవలసి ఉంటుంది.
మనం బాగా ఇష్టపడిన వ్యక్తి యొక్క ఆకస్మిక మరణం, ఉద్యోగం కోల్పోవడం, సన్నిహిత మిత్రునిచే ద్రోహం, దివాలా, తీవ్రమైన అనారోగ్యం, విడాకులు-ఈ సుడిగుండాలు ఏవీ కూడా రావడానికి ముందు కనుచూపుమేరలో ఎక్కడా కనిపించవు. పరిస్థితులను చక్కదిద్దే భయపెట్టు పనిని ఇవి మనకే వదిలేస్తాయి. అటువంటి తుఫానుల తర్వాత పునర్నిర్మించడానికి మనకు ఏది సహాయపడుతుంది? గజిబిజిని శుభ్రం చేయడానికి మరియు ముందుకు సాగడానికి ఖచ్చితంగా ఏది అవసరం?
దృష్టి–దేవుని సన్నిధిని చూడగల సామర్థ్యం, దేవుని శక్తిని గ్రహించడం మరియు అడ్డంకులు ఉన్నప్పటికీ దేవుని ప్రణాళికపై దృష్టి పెట్టడం. చురుకైన దృష్టిగల ప్రవక్తయైన నహూము తుఫానులో దేవుని సన్నిధిని ఊహించాడు:
యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు;
మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.
(నహూము 1:3)
మీ తుఫానులో దేవుని సార్వభౌమత్వాన్ని మీరు చూడగలరా? మీ దృష్టి కన్నీళ్లతో అస్పష్టంగా ఉంటే, అది చాలా కష్టంగా ఉండవచ్చు. నాకు తెలుసు. మరి ముఖ్యంగా, దేవునికి ఇంకా బాగా తెలుసు. మీ ముందు ఉన్న శిధిలాల కొండ దాటి చూడటం కష్టం. “దృష్టి యొక్క మూలాలు” అని నేను పిలుచుకుంటున్నది మీ అభిప్రాయాన్ని పదును పెట్టడంలో సహాయపడవచ్చు:
మీ తుఫానులో దేవుని సార్వభౌమత్వాన్ని మీరు చూడగలరా? మీ దృష్టి కన్నీళ్లతో అస్పష్టంగా ఉంటే, అది చాలా కష్టంగా ఉండవచ్చు. నాకు తెలుసు. మరి ముఖ్యంగా, దేవునికి ఇంకా బాగా తెలుసు. మీ ముందు ఉన్న శిధిలాల కొండ దాటి చూడటం కష్టం. “దృష్టి యొక్క మూలాలు” అని నేను పిలుచుకుంటున్నది మీ అభిప్రాయాన్ని పదును పెట్టడంలో సహాయపడవచ్చు:
వైఖరి. సానుకూలంగా ఉండండి. భయాందోళనలకు బదులు, లోతైన చిత్తశుద్ధితో ప్రార్థించండి: “ప్రభువా, ఇది మీ సమయం. ఇక్కడే మీరు బాధ్యత తీసుకుంటారు. ఈ రోజు మరియు రాబోయే రోజుల్లో నేను మిమ్మల్ని విశ్వసిస్తాను.”
నమ్మకం. దేవుడు మిమ్మల్ని దీని గుండా దాటిస్తాడని నమ్మండి. ఆయన వాక్యమునందు విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు, తన కృపలో, మీరు ముందుకు సాగడానికి మరియు అవసరమైన దానిని చేయడానికి మిమ్మల్ని సమర్థులనుగా చేస్తాడు.
సామర్థ్యము. పరీక్షింపబడటానికి సిద్ధంగా ఉండండి. పరీక్ష! కష్టాల్లో, మీరు ఎప్పుడైనా సాధ్యం అనుకున్నదానికంటే ఎక్కువ సాధించడానికి దేవుడు మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
దృఢ నిశ్చయం. వెళ్లడం కష్టంగా ఉన్నప్పుడు గట్టిగా ఉండండి. అన్నింటినీ మళ్లీ కొత్తగా చేయడానికి మంత్రదండం అందుబాటులో లేదు. దృఢ నిశ్చయం దేవుని దృష్టిపై మీ దృష్టిని నిలుపుకోవడానికి మీకు సహాయం చేస్తుంది, కాబట్టి సాధించండి!
ది అబ్స్టాకిల్ ఈజ్ ది వే లో, థామస్ ఎడిసన్ యొక్క పరిశోధనా సదుపాయాన్ని నాశనం చేసిన అగ్ని గురించి ర్యాన్ హాలిడే ఇలా చెప్పారు:
వివిధ భవనాల్లోని వింత రసాయనాల వల్ల ఆజ్యం పోసిన ఆకుపచ్చ మరియు పసుపు జ్వాలలు ఆరు మరియు ఏడు అంతస్తులకు ఎగసిపడ్డాయి, ఎడిసన్ తన జీవితాన్ని ధారబోసి నిర్మించిన సామ్రాజ్యాన్ని నాశనం చేస్తామని బెదిరించాయి.
ఎడిసన్ ప్రశాంతంగా కానీ త్వరగా అగ్ని దగ్గరకు వెళ్ళాడు . . . తన కుమారుని కోసం వెతుకుతున్నాడు. “వెళ్ళి నీ తల్లిని మరియు ఆమె స్నేహితులందరిని తీసుకురా” అని అతను తన కొడుకుతో చిన్నపిల్లల ఉత్సాహంతో చెప్పాడు. “వారు ఇలాంటి అగ్నిని మళ్లీ చూడలేరు.”1Ryan Holiday, The Obstacle Is the Way: The Timeless Art of Turning Trials into Triumph (Penguin Group, New York, 2014), 150.
ఎడిసన్ సానుకూల స్పందన మీకు నచ్చలేదూ? అతనిని విచ్ఛిన్నం చేయడానికి బదులుగా, విపత్తు అతనిని ఉత్తేజపరిచింది!
అతను మరుసటి రోజు ఒక విలేఖరితో చెప్పినట్లు, తాను క్రొత్తగా ప్రారంభించటానికి వయస్సేమీ అయిపోలేదు. “నేను ఇలాంటి అనేక విషయాలను ఎదుర్కొన్నాను. ఇది మనిషిని ఎన్నూయితో బాధించకుండా నిరోధిస్తుంది.”2Holiday, 151.
ఎడిసన్ చెప్పింది నిజమే. ఎన్నూయి—సాహసం చేయకపోవడం వల్ల ఏర్పడే ఆ నిరుత్సాహం, వట్టి సోమరితనము—మీ వయస్సు పెరిగే కొద్దీ జాగ్రత్త వహించాల్సిన శ్రమ . . . అలాగే గుర్తుంచుకోండి: క్రొత్తగా ప్రారంభించేందుకు మీరు ఎప్పటికీ వయస్సు మీరినవారు కాదు!
అగ్ని అతని ప్రయోగశాలను నాశనం చేసినప్పుడు ఎడిసన్ వయస్సు అరవై ఏడు సంవత్సరాలు. “యెహోవా నాకు తోడైయుండినయెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి [శత్రువుల] దేశమును స్వాధీనపరచుకొందును,” అని వెల్లడించినప్పుడు పాత నిబంధనలోని కాలేబుకు ఎనభై అయిదు సంవత్సరాలు (యెహోషువ 14:12). కాలేబు తన కొరకు దేవుని దర్శనంపై తన దృష్టిని నిలిపి, ప్రభువు వాగ్దానం చేసిన కొండను తీసుకున్నాడు!
ప్రస్తుతం, మీరు బాధపడుతున్నారు. దుఃఖించడానికే మీకు సమయం అవసరమై ఉండవచ్చు. అయితే, చివరికి, మీరు పునర్నిర్మించుకోవలసి ఉంటుంది మరియు తుఫానులో దేవుని సన్నిధిని మరియు తుఫాను ద్వారా ఆయన ప్రణాళికను చూడటం ద్వారా ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆయన మిమ్మును విడిచిపెట్టలేదు! ఆయనే మీకు ఆదరణ. మీరు కోరుకునే సమాధానము ఆయనే. మీరు క్రొత్తగా ప్రారంభించడానికి కావలసిన బలం ఆయనే.
దేవుడు మీ కోసం దాచి ఉంచిన దాని గురించి మీరు కళ్ళు తెరచి చూడరా? తుఫాను తరువాత . . . పునర్నిర్మించండి!