నాతో కాలచక్రంలోకి అడుగు పెట్టండి మరియు మనం కలిసి ప్రయాణం చేసి ఊజుకు తిరిగి వెళ్దాం (ఊజు యొక్క మాంత్రికుని లాగా కాదు, కానీ దేశము లాగా). ఎక్కడ ఉన్నా, ఊజు ప్రతి ఒక్కరినీ గౌరవించే పౌరుడిని కలిగి ఉన్నది. ఎందుకంటే అతను నిర్దోషి, నీతిపరుడు, దేవునికి భయపడేవాడు మరియు పవిత్రమైన జీవనం కలిగి ఉన్నాడు. అతనికి 10 మంది పిల్లలు, చాలా పశుసంపద, పుష్కలంగా భూమి, ఇంటినిండా పనివారు, మరియు గణనీయమైన నగదు ఉన్నాయి. అతను “తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను” (యోబు 1:3). దీనిని ఎవరూ ఖండించరు, ఎందుకంటే అతను చాలా సంవత్సరాల కృషి మరియు ఇతరులతో నిజాయితీగా వ్యవహరించడం ద్వారా ఆ ఖ్యాతిని సంపాదించాడు. అతని పేరు యోబు, నీతి మరియు దైవభక్తికి పర్యాయపదం.
అతను షేక్స్పియర్ యొక్క కామెడీ ఆఫ్ ఎర్రర్స్ నుండి ఒక పంక్తిని కొన్ని గంటల్లోనే చెప్పవలసియున్నది:
ఒక దౌర్భాగ్యమైన ప్రాణము, ప్రతికూలతతో గాయపడింది.1
ప్రకటన లేకుండా, కక్కులుగల శిలల యొక్క హిమపాతం వంటి ప్రతికూలత యోబుపై పడింది. అతను తన పశువులను, పంటలను, భూమిని, పనివారిని-మీరు నమ్మగలరో లేదోగాని-మొత్తం 10 మంది పిల్లలను కూడా పోగొట్టుకున్నాడు. జీవనం సంపాదించుకోవటానికి అతని చివరి మానవ ఆశయైన తన ఆరోగ్యాన్ని అతను వెనువెంటనే కోల్పోయాడు. చదవడం ఆపి, 60 సెకన్ల పాటు కళ్ళు మూసుకుని, ప్రతికూల బరువు కింద నలిగిన ఆ మంచి వ్యక్తితోపాటు గుర్తింపు కలిగియుండమని నేను మీతో వేడుకుంటున్నాను.
అతని పేరును కలిగి ఉన్న పుస్తకం, రాళ్ళు పడటం ఆగిపోయిన వెంటనే యోబు తన దినచర్య పుస్తకములో ఎక్కించినదానిని నమోదు చేస్తుంది. వణుకుతున్న చేతితో అతను ఇలా వ్రాశాడు:
“నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని,
దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను;
యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను,
యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.” (1:21)
ఈ నమ్మశక్యంకాని ప్రకటన తరువాత, దేవుడు ఇలా అన్నాడు:
ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. (1:22)
ప్రస్తుతం, నేను తల ఊచుచున్నాను. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, “ప్రపంచంలో అతను ఇంత ప్రశాంతంగా శోకాన్ని కలిపిన పరీక్షల శ్రేణిని ఎలా ఎదుర్కోగలుగుతున్నాడు?” పరిణామాల గురించి ఆలోచించండి: దివాలా, బాధ, 10 తాజా సమాధులు . . . మరియు ఆ ఖాళీ గదుల ఒంటరితనం. అయినప్పటికీ అతను దేవుణ్ణి ఆరాధించాడని మనం చదువుతాము; అతను పాపం చేయలేదు, తన సృష్టికర్తను నిందించలేదు.
తార్కిక ప్రశ్నలు ఏమిటంటే: అతను ఎందుకు ఆ పని చేయలేదు? అతను దాని నుండి ఎలా దూరంగా ఉండగలిగాడు? కటుత్వము లేదా ఆత్మహత్య ఆలోచనల నుండి కూడా అతన్ని నిలువరించినది ఏమిటి? పరిస్థితిని తేలికగా తీసుకొని తెగించి, అతని పేరును కలిగి ఉన్న పుస్తకాన్ని శోధించడం ద్వారా నేను కనుగొన్న మూడు ప్రాథమిక సమాధానాలను సూచిస్తున్నాను.
మొదటిది, యోబు దేవుని ప్రేమ సార్వభౌమత్వాన్ని ప్రకటించాడు. తనకు ఇచ్చిన ప్రభువునకు తీసుకునే హక్కు కూడా ఉందని అతను నమ్మాడు. తన మాటల్లోనే అతను ఇలా అన్నాడు:
“మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” (2:10)
అతను తన జీవితాన్ని పరిపాలించే తన ప్రభువు హక్కును పేర్కొంటూ పైకి చూసాడు. మన మట్టికి ఇసుకను లేదా మన పాత్రకు గుర్తులను లేదా ఆయన పనితనానికి అగ్నిని కలపడానికి దేవునికి హక్కు లేదని చెప్పిన మూర్ఖుడు ఎవరు? తన మట్టి పిడికిలిని పరలోకం వైపుకు ఎత్తి కుమ్మరివాని ప్రణాళికను ప్రశ్నించడానికి ఎవరు ధైర్యం చేశారు? యోబు చెయ్యలేదు! అతని దృష్టిలో, దేవుని సార్వభౌమాధికారం ఆయన ప్రేమతో ముడిపడి ఉంది.
రెండవది, పునరుత్థానం యొక్క దేవుని వాగ్దానాన్ని యోబు నమ్ముకొనియున్నాడు. అతని శాశ్వతమైన మాటలు మీకు గుర్తున్నాయా:
“అయితే నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును,
తరువాత . . .
. . . నేను దేవుని చూచెదను.” (యోబు 19:25–26)
అతడు ముందుకు చూసాడు, ఈ జీవితం అవతల అన్ని విషయాలు ప్రకాశవంతంగా మరియు అందంగా చేస్తానని తన ప్రభువు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. ఆ సమయంలో బాధ, మరణం, దుఃఖం, కన్నీళ్లు మరియు కష్టాలన్నీ తొలగిపోతాయని అతనికి తెలుసు. “నిరీక్షణ సిగ్గుపరచదు” (రోమా 5:5) అని తెలిసి, రేపటి దినమునుగూర్చి ఊహించుకోవటం ద్వారా ఈ రోజును సహించాడు.
మూడవది, యోబు తన సొంత అవగాహన లేమిని ఒప్పుకున్నాడు. ఇది ఎంత ఉపశమనం కలిగిస్తుంది! ఎందుకో వివరించడానికి తాను బద్ధుడనని అనుకోలేదు. అతని నిజాయితీగల ఒప్పుకోలును వినండి:
“నీవు సమస్తక్రియలను చేయగలవనియు
నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. . .
ఆలాగున వివేచనలేనివాడనైన నేను
ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. . . .
‘ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియజెప్పుము.'” (యోబు 42:2–4)
అతను నిర్మించడానికి తన అసమర్థతను అంగీకరిస్తూ లోపలికి చూశాడు. అతను తన ప్రతికూలతను దేవుని యొద్ద విశ్రాంతినిచ్చాడు, ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి బలవంతం పెట్టబడినట్లు భావించలేదు.
బహుశా రాళ్ళు పడటం ద్వారా మీరు గాయపడటం ఆరంభమైంది. . . బహుశా మంచుగడ్డలు పడిపోయాయేమో. . . లేక పడలేదేమో. ఎక్కడో మూలన ఉన్న ఊజు దేశము వలె . . . ప్రతికూలత 10,000 మైళ్ళ దూరంలో ఉందని అనిపించవచ్చు. ఇవన్నీ కోల్పోయే కొద్ది నిమిషాల ముందు యోబుకు అదే విధంగా అనిపించింది.
మిత్రమా, ఈ రాత్రి మీరు లైట్లు ఆర్పినప్పుడు ఈ ఆలోచనలను సమీక్షించండి . . . ఒకవేళ కుదిరితే. కొన్ని మట్టి పాత్రలు రోజుల తరబడి ఎండలో ఉండటం వలన పెళుసుగా తయారవుతాయి.
- William Shakespeare, The Comedy of Errors, 2.1.34, in William Shakespeare: The Complete Works (New York: Dorset Press, 1988), 169.
Copyright © 2010 by Charles R. Swindoll, Inc.