ఆరాధన

worship

దేవుడు ఏమైయున్నాడో అందునుబట్టి ఆయనను ఆరాధించండి

కొన్ని విధాలుగా ఆరాధన అనేది ప్రార్థన లాంటిది-కొంచెం అంతుచిక్కనిది, సంక్షిప్తంగా నిర్వచించడం లేదా ఒక ఆకృతిని కేటాయించడం కష్టం. అది నిజమైన భావోద్రేకము నుండి ప్రవహించినప్పుడు, దాన్ని గుర్తించి అందులో పాల్గొనడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు. ఒక విషయం రూఢి అవుతుంది: నిజమైన ఆరాధన ఎల్లప్పుడూ దేవుడు ఏమైయున్నాడో దాని మీదనే దృష్టి పెడుతుంది.

నిజమైన ఆరాధన యొక్క ఇతర సంకేతాలు ఏమిటి? దీన్ని ఎలా అలవరుస్తారు? ఏది దానిని అరికడుతుంది లేదా నాశనం చేస్తుంది? ఎలాంటి సంగీతం దీనికి శక్తిని ఇస్తుంది? ప్రజలు బిడియము మరియు పరధ్యానం లేకుండా ఆరాధించడానికి ఉత్తమమైన వాతావరణాన్ని పాస్టర్లు మరియు సంగీతాన్ని నడిపించేవారు ఎలా అందించగలరు? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు మారుతున్న సంగీత శైలులు సంఘములో ఆరాధనను ఎలా ప్రభావితం చేస్తాయి?

ఈ సూచించిన వనరులు నిజమైన ఆరాధన యొక్క ముఖ్యమైన అంశాలను స్పష్టం చేయడంలో సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. మీరు దేవునితో ఈ కీలకమైన సంభాషణలో పాల్గొన్నప్పుడు, మీ చింతలు మరియు ప్రతికూల ఆలోచనలు ఎంత త్వరగా ఆవిరైపోతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి