దేవుడు తన హస్తమును ఈ యువకునిపై ఉంచాడు. ఇతని సంగీతం అంధకారములో మునిగిపోయి వ్యాకులపడుచున్న రాజు హృదయాన్ని నింపడమే కాక, ఏదో ఒక రోజు దేవుని యొక్క లిఖితపూర్వక వాక్యాన్ని నింపుతుంది. ఆ విధంగా, దావీదు తన ప్రాచీన తీగ వాద్యముతో సౌలు నివసిస్తున్న ఆ చీకటి ప్రదేశంలోనికి ధైర్యముగా వెళ్లాడు.
సౌలు ఏ ప్రయత్నం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. “ఒక మనిషిని సిద్ధపరచండి” అని అతను చెప్పాడు. “అతనెవరో నేను పట్టించుకోను. అతన్ని నా దగ్గరకు తీసుకురండి.”
ఏదో ఒకవిధంగా దావీదు యొక్క సంగీతం ఈ వేధింపులకు గురైన మనిషి లోపల చిక్కుకొనియున్న భావాలను విప్పింది మరియు అతని లోపల ఉన్న క్రూరమైన మృగాన్ని ఓదార్చింది. దావీదు అతన్ని విడిచి వెళ్లేసరికి, సౌలు ఉపశమనం పొందాడు. చెడు యొక్క ఉనికి వదిలిపోయింది.
దావీదును రాజు గదిలో ఉంచడానికి దేవుడు సంగీతమనే కృపావరాన్ని ఉపయోగించాడు. మరియు రాజు తన అంతర్గత హింసల నుండి ఉపశమనం పొందడమే కాదు, యువ గొర్రెల కాపరియైన బాలుడి పట్ల తన హృదయంలో ప్రేమను కనుగొన్నాడు, అతని సంగీతం ఇతని ఆత్మను స్పృశించింది.
ఆత్మతో నిండిన పరిశుద్ధుడు పాటతో నిండిన పరిశుద్ధుడు. మరియు మీ శ్రావ్యత సరాసరి పరలోకరాజ్యములో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అక్కడ దేవుని యొక్క సంకేత గ్రాహకం మీ శ్రావ్యతను ఎల్లప్పుడూ స్వీకరిస్తుంది. అక్కడ మీ పాట యొక్క ఉపశమనపు రాగాలు ఎల్లప్పుడూ మెచ్చుకొనబడుచున్నాయి.
మీ నాదము ఎంత అందంగా లేదా ఎంత దయనీయంగా అనిపించినా పర్వాలేదు. సాధారణంగా శ్రద్ధ కోసం కేకలు వేసే ఓటమి ఆలోచనలను ముంచివేసేంత బిగ్గరగా పాడండి. ఆత్మావలోకన అయిష్టత యొక్క బంధకం నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోండి. పాడండి! పాడండి! మీరు సంఘ గాయక బృందానికి స్వరపరీక్ష చేయట్లేదు; మీరు మీ దేవుడైన యెహోవాకు మీ హృదయంతో శ్రావ్యత చేస్తున్నారు! మీరు పాడుచున్నప్పుడు మీరు నిశితంగా పరిశీలిస్తే, పరలోక సమూహము ఆనందముతో సమాధానమివ్వటం మీరు వినవచ్చు.
కఠినమైన హృదయానికి మృదువైన సంగీతం, అదే దావీదు సౌలు కొరకు అందించాడు. రక్షకుడైన క్రీస్తు అందించు ఆత్మ సంగీతం అదే, మరియు మనమందరం ప్రారంభించవలసిన ప్రదేశం అదే. ఆయన మనకొరకు మృతిపొందాడు. మానవ నిరాశ మరియు నిస్పృహ నుండి విముక్తినిచ్చే నిశ్చయమైన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించుటకు మనకు ఇచ్ఛను మరియు శక్తిని ఇవ్వడానికి ఆయన మృతులలోనుండి లేచాడు. ఆయన మన గొర్రెల కాపరి, మరియు మనము ఆయన గొర్రెలము, ఆయన స్వరములోని సంగీతం మనకు అవసరమైయున్నది. మనమందరము కలిసి దేవునిలో సంతోషించి ఆనందించవచ్చు. అది ఎక్కువగా చేద్దాం!
Excerpted from Charles R. Swindoll, Great Days with the Great Lives (Nashville: W Publishing Group, 2005). Copyright © 2005 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.