సంగీతం కంటే లోతుగా మానవ హృదయాన్ని తాకేది మరొకటి ఉండదు. క్రైస్తవుల సమూహం తమ ప్రభువుకు హృదయపూర్వకంగా పాడినప్పుడు ఇది నిజంగా హృదయాన్ని తాకుతుంది. ఆ పాత మధుర కీర్తనలు కామవికార చేష్టలు ఉన్న వీధుల్లో అలాగే అక్రమము జరిగే సందుల్లో సువార్త సంఘము నుండి ఆలపించబడుచున్నప్పుడు, ఆ భయంకర ప్రాంతములో ఉన్నటువంటి అనేక కఠిన హృదయాలు కరిగిపోయాయి. సమాజములు రాజును స్తుతించేటప్పుడు, దెయ్యాల దండులు కూడా శ్రద్ధ వహిస్తాయి. “చీకటి శక్తులు ఈ మధురమైన కీర్తన విన్నప్పుడు భయపడతాయి, యేసుక్రీస్తు స్తుతింపబడుగాక!”
ఇటువంటి హృదయాన్ని కదిలించే శ్రావ్యాలు అపరిచితులకు ఆత్మీయ స్వాగతమును, విరిగినవారికి ఓదార్పును, ఒంటరివారికి విశ్రాంతిని, మరియు నిరుత్సాహపడినవారికి ధైర్యాన్ని ఇస్తాయి. దేవుని ప్రజల నుండి గొప్ప సంగీతం బోధిస్తుంది మరియు ఖండిస్తుంది, ఆశీర్వదిస్తుంది మరియు ఉపశమనాన్ని ఇస్తుంది.
“Prone to wander, Lord, I feel it, Prone to leave the God I love” అనే చరణాన్ని పాడేటప్పుడు ఆ మాటలను ఎవరు ఒప్పుకోకుండా ఉండి ఉంటారు? “And Can It Be?” లేదా “Am I a Soldier of the Cross?” లేదా “మాకర్త గట్టి దుర్గము?” మొదలగు కీర్తనలను పాడిన తర్వాత ఎవరు నిలబడకుండా, ధైర్యము పొందుకోకుండా ఉండి ఉంటారు? “My Hope Is in the Lord” అని ప్రకటిస్తున్నప్పుడు ఆశ్చర్యము, ప్రేమ మరియు స్తుతిలో ఎవరు నిమగ్నమైయుండకుండా ఉండివుంటారు? లేదా “It Is Well with My Soul” పాడేటప్పుడు ఎవరు నూతన బలాన్ని పొందుకోకుండా ఉండివుంటారు?
చార్లెస్ వెస్లీ, చరిత్రలో నిలిచిపోయే గొప్ప పాటల రచయిత, “నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ” అని రాసినప్పుడు సమాజముగా కూడి గానం చేయటం యొక్క విలువను గ్రహించాడు. ఆ శబ్దంతో పోల్చదగినది ఏదీ లేదు. ఏదీలేదు.
కానీ మన పాటలలో మాధుర్యాన్ని కోల్పోవటం మీరు గమనించారా? ఇది అందం లేదా సామరస్యం లేకపోవడం కాదు, లేక అది తగినంత వాల్యూమ్ లేదా తీవ్రత లోపించడం కాదు. ఇది సాదాసీదాగా ఉన్నది. పదాలు ఉన్నాయి గాని అర్థాన్ని గ్రహించకుండా పాడుచున్నాము. మనము బాగా పాడుచున్నాము, కాని దాని వెనుక దాగి ఉన్న సందేశాన్ని పట్టించుకోలేకపోతున్నాము.
ఆగి ఆలోచించండి. “నాదు ప్రాణ మోప్రభో, నేను నీ కర్పింతును” లో ఒక పంక్తి ఉంది. ఈ పదాలు నా గొంతులోనికి వచ్చినప్పుడు అవి నన్ను ఆపివేస్తాయి: “నాదు సొమ్ము సొత్తులు, పుచ్చుకొమ్ము సర్వము.” ఊహించండి! “సర్వము”! మనమందరము ఈ పాటను యెంతో నిమ్మళంగా పాడతాము, కాని ఏదో ఒకదాన్ని బిగబట్టుకొని ఉండేవారు నాకు తెలుసు. నాతో కలిపి.
మరి దీని గురించి ఏమంటారు?
నీ చిత్తంబేను-నీ చిత్తంబే
నేను మట్టిని-ఓ కుమ్మరీ!
వీ కోర్కెదీర-నన్ దీర్చుమా
నీకు లొంగెదన్-ఓ ప్రభువా.
నిజంగా? నిజంగా లొంగామా? యథార్థముగా? ఆయన కోరిక తీరునట్లుగా మనం మలచబడుటకు సిద్ధంగా ఉన్నామా?
గత ఆదివారం ఆరాధన తర్వాత మా సంఘస్తులు “I Give All My Witness to You” అనే పాట పాడారు. . . ఆ తర్వాత మేమందరం వెళ్ళిపోయాము. మేమందరం మా కార్లలోకి ఎక్కాము, తోలాము మరియు మాలో చాలా మంది ఒకరినొకరు అప్పటినుండి చూసుకోలేదు. ఏమి జరుగుతోంది? ఆయనను గూర్చి మన సాక్ష్యం ఉందా? గడిచిన రోజులు రెండు వారాల ముందు కంటే చాలా భిన్నంగా ఉన్నాయా? ఒక నెల? ఆ ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయి.
ప్రతి పాట లేదా కీర్తనను దేవునికి ఇచ్చే వాగ్దానముగా, మీ సమర్పణకు సంబంధించిన ప్రకటనగా ఆలోచించండి. ఈ సమర్పణ యొక్క ఫలితాలను మీరు ఉత్సాహంతో పాడేటప్పుడు కళ్ళ ముందు కదలాడనివ్వండి. అప్పుడు, పాట ముగిసిన తర్వాత, అదే ఉత్సాహంతో అన్వయించుకోండి.
దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించటమేగాక, చిత్తశుద్ధిగల గాయకుడిని ఘనపరుస్తాడు.
Excerpted from Charles R. Swindoll, “Mean What You Sing,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word Publishing, 1994), 486–87. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.