ఆనందమును అలవరచుకొనుటకు ఏడు మార్గములు

మీ రోజులో మీకు మరింత ఆనందం కావాలా? అలవరచుకోండి! రోజులో జరిగే సంఘటనలను నిత్యత్వము యొక్క దృక్పథముతో చూచినప్పుడు ఆనందం పుడుతుంది. ఈ ఉద్దేశపూర్వక దృష్టితో, మీ జీవితంలో దేవుడు పని చేస్తున్నాడని మరింత ఆనందం మరియు నమ్మకంతో మీరు ఈ రోజును భిన్నంగా చూడటం ఖాయం.

1. మీరు ఆయనను విశ్వసించడానికిగల కారణాలను దేవునితో తిరిగి చెప్పండి. ఆయన లక్షణాలలో ఏది మీకు ఇష్టమైనదో ఆయనకు ఇప్పుడే చెప్పండి. 103 వ కీర్తనతో ప్రారంభించి లేఖనము యొక్క స్తుతులను ఆయనకు తిరిగి చదవండి. మరొక విశ్వాసితో చేరి కృతజ్ఞతా ప్రార్థన చేయండి మరియు మీలో మీరు ఆయన స్వభావమునందు ఆనందించుడి.

2. “ఆనంద దినచర్య పుస్తకమును” ఆచరించండి. మీరు ఆనందించటానికిగల కారణాలను మరియు మీ దైనందిన జీవితంలో మీరు ఎదుర్కొనే దేవుని విశ్వాస్యత యొక్క జ్ఞాపికలను నమోదు చేయండి. అదనంగా, మీ ప్రార్థన నడకల నుండి ఒక ఆకును దాని పేజీలలోకి ఎందుకు నొక్కకూడదు లేదా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారీ మీకు ఆనందం కలిగించే వ్యక్తి యొక్క ఫోటోను ఎందుకు చేర్చకూడదు? పెద్దగా ఆలోచించండి- మీరు తెరిచిన ప్రతిసారీ ఆనందపు వరదలను తెచ్చు మీ దినచర్య పుస్తకమును “ఆనంద పెట్టె” లేదా “ఆనంద మేజాబల్ల” గా వ్యాపింపజేయండి.

3. ఆనందకరమైన వ్యక్తులతో మిమ్మల్ని మీరు ఆవరించుకోండి. ఆనందం అంటురోగము వంటిది-కాబట్టి తమ జీవితాలను దేవునిలో ధైర్యాన్ని కనబరచే స్నేహితులతో సంబంధాలను పెంచుకోండి. క్రీస్తులో మీ ఆనందం పెరుగునట్లుగా ఒకరికొకరు ప్రార్థించుకోండి.

4. జీవిత సవాళ్లను మరియు ప్రయత్నాలను విడుదల దిశగా సమీపించండి. దేవుడు మీ జీవితంలోని క్లిష్ట పరిస్థితులను వృథా చేయడు, కానీ మీలో తన స్వభావమును అభివృద్ధి చేయడానికి వాటిని ఉపయోగిస్తాడు. ఒత్తిడిని ఫలకరముగా జరిగించడంలో సహాయం కోసం రోమా 5 మరియు యాకోబు 1 ని సమీక్షించండి. మీ కష్టతరమైన పాఠాలను దేవుని బహుమతులుగా చూసినప్పుడు ఆనందం మీపైకి చొచ్చుకువస్తుంది.

5. స్తుతి మరియు కృతజ్ఞతలను ఒక అలవాటుగా చేసుకోండి. దేవుడు ఒక అవసరాన్ని తీర్చాడా? ఆయనను స్తుతించండి! మీ సవాళ్లు ఆయన క్రియను చూడటానికి మీకు ఎక్కువ అవకాశాలు ఇచ్చాయా? ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి! కృతజ్ఞత మరియు ప్రతిస్పందించే హృదయం నుండి ఆనందం ప్రవహిస్తుంది. మీరు రాత్రిలోనికి వెళ్లకముందు, మీ “ఆనంద దినచర్య పుస్తకము” లో మూడు నుండి ఐదు ఆశీర్వాదాలను రాయండి. దీన్ని ఒక అలవాటుగా చేసుకోండి మరియు మీ ఆనందకరమైన వైఖరి వృద్ధిచెందటం గమనించండి.

6. మీ మనస్సును సంగీతముతో నింపండి. మీ హృదయాన్ని దేవునికి మరియు ఆయన వాక్యానికి దగ్గర చేసే సంగీతాన్ని వినండి, పాడండి మరియు ధ్యానం చేయండి.

7. దూరదృష్టిని అవలంబించండి. పెట్టుబడిదారులు తమ ఖాతాదారులకు స్టాక్ మార్కెట్ యొక్క రోజువారీ హెచ్చు తగ్గుదల గురించి ఆందోళన చెందవద్దని సలహా ఇస్తున్నారు-దూరదృష్టి ముఖ్యమైనది. నమ్మశక్యం కాని సవాళ్లను జీవితం ఈ రోజు మీముందుంచిందా? మీ నిల్వలు తక్కువగా ఉన్నాయా లేదా మీరు సంతుష్టి పీఠభూమిని అనుభవించుచున్నారా? నేటి సంఘటనలతో సంబంధం లేకుండా, దూరదృష్టిని అవలంబించండి. దేవుడు మీ దినములపైన అధికారం కలిగియున్నాడనియు, మీలో తన స్వభావమును నమ్మకంగా అభివృద్ధి చేస్తాడనియు గుర్తుంచుకోండి.

గుర్తుంచుకోండి, రోజులో జరిగే సంఘటనలను నిత్యత్వము యొక్క దృక్పథముతో చూచినప్పుడు ఆనందం పుడుతుంది. దేవుడు మీ జీవిత విషయములను నియంత్రిస్తున్నాడని (రోమా 8:28), ఆయన మీ ప్రతి విన్నపమును వింటాడనియు (కీర్తన 116:1), మరియు ఆయనయందు ఆనందించుటయే మీ బలం అవుతుందనియు (నెహెమ్యా 8:10) విశ్వసించండి.

Adapted from “Seven Ways to Cultivate Joy,” Insights (March 2001): 2. Copyright © 2001 by Insight for Living. All rights reserved worldwide.

Posted in Christian Living-Telugu, Fruit of the Spirit-Telugu, Humour-Telugu, Worship-Telugu.

Insight for Living Ministries is committed to excellence in communicating the truths of Scripture and the person of Jesus Christ in an accurate, clear, and practical manner so that people will come to an understanding of God’s plan for their lives, as well as their significant role as authentic Christians in a needy, hostile, and desperate world.

లేఖనములోని సత్యాలను మరియు యేసుక్రీస్తు అను వ్యక్తిని గూర్చి ఖచ్చితమైన, స్పష్టమైన మరియు ఆచరణాత్మక పద్ధతిలో తెలియపరచడంలోను, తద్వారా ప్రజలు తమ జీవితాల కోసం దేవుని ప్రణాళికను, అలాగే లేమిలోవున్న, ప్రతికూలమైన మరియు నిరాశతో కూడిన ప్రపంచంలో ప్రామాణికమైన క్రైస్తవులుగా తమ ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకోవటానికి ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ఎంతో ఉత్కృష్టతతో రాణించటానికి కట్టుబడి ఉంది.