అసాధారణమైన ఆనందాన్ని అనుభవించండి
చక్ స్విన్డాల్ అడుగుచున్నారు,
హాస్యానికి స్పందించే మీ గుణం ఎలా ఉంది? మనము నివసించే సమయాలు మీ వైఖరి, మీ ముఖం, మీ దృక్పథంలో ప్రతిబింబించటం ప్రారంభించాయా? సొలొమోను . . . మన హాస్యానికి స్పందించే గుణం కోల్పోయినప్పుడు మూడు విషయాలు జరుగుతాయని చెప్పాడు: నలిగిపోయిన ఆత్మ, అంతర్గత స్వస్థత లేకపోవడం మరియు ఎండిపోయిన ఎముకలు [సామెతలు 15:13, 15; 17:22]. ఎంత శూన్యమైన చిత్రం! . . . హాస్యం పాపం కాదు. ఇది తప్పించుకోవటానికి దేవుడు చూపిన దారి . . . సురక్షితమైన ద్వారము. జీవితాన్ని తేలికగా తీసుకునే దిశగా దృష్టి పెట్టడం అరుదైన, ప్రాణాధారమైన గుణము.1
హాస్యం యొక్క సేదతీర్చు భావన ఎన్నడూ అసహ్యకరమైనది కాదు, సమయస్ఫూర్తిలేనిది కాదు లేదా వ్యూహరహితమైనది కాదు. బదులుగా, ఇది మన ఆత్మలను వెలిగిస్తుంది మరియు మన ఆలోచనలకు శక్తినిస్తుంది. ఈ నిలకడలేని జీవితాన్ని చాలా తీవ్రంగా తీసుకోకుండా ఆలోచించి అడుగు వేయటానికి ఇది మనకు సహాయపడుతుంది.
“మంచి హాస్యం యొక్క మూడు పరీక్షలు: మీ స్వంత తప్పులను చూసి మీరు నవ్వగలరా? ఇది తగినది కానప్పుడు మీరు నిరోధించగలరా? దీన్ని ఒంటరిగా ఆస్వాదించగలరా?”2 ఈ ప్రశ్నలకు మీరు ఇంకా అవును అని సమాధానం ఇవ్వలేకపోతే, ఈ వనరులను ఆస్వాదించడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మంచి పాత-కాలపు నవ్వుచేత మీ సమస్యాత్మక ఆలోచనలు వెంబడించబడటంతో ఒత్తిడికి గురైన మీ కండరాలు సేదతీరినట్లుగా మీకు అనిపించవచ్చు.
- Charles R. Swindoll, The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 220.
- Charles R. Swindoll, Swindoll’s Ultimate Book of Illustrations & Quotes (Nashville: Thomas Nelson, 1998), 283.
సంబంధిత వ్యాసాలు
- ఆనందమును అలవరచుకొనుటకు ఏడు మార్గములుInsight for Living
- ఈ సంవత్సరం మీ సమయాన్ని ఎలా వృథా చేసుకోవాలిPastor Chuck Swindoll
- చిరునవ్వుకు ఒక కారణంInsight for Living
- మనోహరమైన సాక్ష్యంPastor Chuck Swindoll
- వినోదభరితమైన సత్యముPastor Chuck Swindoll