ఆనందం-మీ రహస్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపడేలా యిది చేస్తుంది. అయితే విశ్వసించు క్రైస్తవునికి ఆనందం రహస్యమేమీ కాదు. మనం దేవునితో సన్నిహితంగా ఎదగడానికి ఎంచుకున్నప్పుడు, ఆయన స్వభావం మరియు ఏర్పాటులో నెమ్మది కలిగియుంటే, ఆనందం మన జీవితాల్లోకి పొంగిపొర్లుతుంది. ఇతరులు దాన్ని గమనిస్తూ నిస్సహాయులుగా ఉండటం తప్ప ఏమీ చేయలేరు.
మీరు ఆనందపడే వ్యక్తిలా ఉండాలనుకుంటున్నారా? వెర్రి ప్రశ్నలా ఉంది, కాదంటారా?మన పరిస్థితులను అధిగమించి జీవించడానికి మనం ఇష్టపడతాము. లేదా గొప్ప వైఖరిని కలిగి ఉంటాము. లేదా బాగా నవ్వుతాము. కానీ ఆనందం వీటన్నిటికీ మించినది. ఆనందం యొక్క మనోహరమైన కోణాలను దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుందాం:
1. ఆనందం దేవుని ఆత్మఫలము. గొప్ప వైఖరి లేదా అణగని ఆత్మను మించి, ఆనందం దేవుని నుండి వస్తుంది (గలతీయులకు 5:22). క్రీస్తుతో మన సాన్నిహిత్యం పెరిగే కొద్దీ మన ఆనందం కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుంది. కాని పాపమెప్పుడైతే ఆ సంబంధం నుండి మనలను దూరం చేస్తుందో, అది మన ఆనందాన్ని కూడా దోచుకుంటుంది (కీర్తన 51:8, 12).
2. ఆనందం పరిస్థితులపై ఆధారపడి ఉండదు. పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికను-తరచూ యిది “ఆనందపు పుస్తకం” అని పిలువబడింది-జైలు గది నుండి వ్రాసాడు. ఆయన విమర్శింపబడ్డాడు, అలసిపోయాడు మరియు అపార్థం చేసుకోబడ్డాడు. తన భయంకరమైన పరిస్థితులు దేవుని వాక్యాన్ని మరియు దేవుని ఆత్మను అణచివేయడానికి అనుమతించే బదులు (మార్కు 4:19 అవి తరచూ చేయగలవని వివరించినట్లు), పౌలు క్రీస్తును తెలుసుకున్న ఆనందంపై దృష్టి పెట్టాలని కోరుకున్నాడు (ఫిలిప్పీయులకు 2:17). ఈసారి మీరు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక చదివినప్పుడు, పౌలు జైలు గదిని . . . మరియు ఆయన ముఖాన్ని ఊహించుకోండి.
3. ఆనందం ఒక ప్రాధాన్యత. “నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి” (యాకోబు 1:2). వాస్తవికత ఇక్కడ ఉంది-జాగ్రత్తగా చదవండి. జీవితం యొక్క బాధాకరమైన పరీక్షలు వాటంతట అవే ఆనందకరమైనవి కావు, కానీ మనం వాటి గుండా నడిచినప్పుడు, మనం ఆనందంతో నిండి ఉండాలి. ఎందుకు? ఎందుకంటే దేవుడు మనలో మరియు పరిస్థితిలో మంచి అభివృద్ధిని కలుగజేస్తున్నాడు గనుక. మన మనస్సులను మరియు హృదయాలను దేవుని గురించిన సత్యంతో నింపుకున్నప్పుడు భయంకరమైన తుఫానులో ఉన్నప్పుడు మనం నిజమైన ఆనందాన్ని తెలుసుకోవచ్చు.
ఆనందం మీకు మరియు దేవునికి మధ్య ఒక వ్యవహారంలా మారిపోతుంది, ఇతరులు దాన్ని గమనిస్తూ నిస్సహాయులుగా ఉండటం తప్ప ఏమీ చేయలేరు. ఇతరుల జీవితాల్లోను మరియు మీ జీవితం యొక్క అంచులమట్టుకు నిండి పొర్లే దేవుని జీవం యిది. మీ జీవితం యొక్క వివరముల విషయమై మీరు క్రీస్తును విశ్వసించినప్పుడు, మీరు ఆయన జీవాన్ని అద్భుతంగా అధికంగా అనుభవిస్తారు. అలాగే చిరునవ్వుకు కారణం ఇవ్వటం తప్ప అది యింకేమీ చేయలేదు.