సంఘము

Church

క్రీస్తు శరీరముతో పాలుపొందండి

ఇశ్రాయేలు యొక్క ఉత్తర నగరమైన కైసరయ ఫిలిప్పీలో, గ్రీకు దేవుడు పాన్‌కు అంకితం చేయబడిన ఒక ఆరాధన కేంద్రం శిథిలాలలో ఉన్నది. అక్కడ ఒక గుహ ఉంది. అది నరక లోకానికి ప్రవేశ ద్వారం అని అక్కడ పూజించేవారు చాలాకాలంగా నమ్ముచుండేవారు. నరకానికి ప్రవేశ ద్వారమైన ఈ గుహ సమీపములో, యేసు వాగ్దానం చేశాడు: “ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను” (మత్తయి 16: 18).

మొదటి శతాబ్దంలో పెంతెకొస్తు నుండి నేటి వరకు, సాతాను క్రీస్తు సంఘమును నాశనం చేయడానికి ప్రయత్నించాడు-అయినప్పటికీ అది నిలిచియున్నది. రెండు వేల సంవత్సరాల క్రితం, యెరూషలేములో వేరే ప్రాంతవాసులైన యూదు వ్యక్తుల యొక్క ఒక చిన్న సమూహం ద్వారా క్రీస్తు తన సంఘమును ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోవడానికి నిర్మించాడు. వివాదాలు, యుద్ధాలు మరియు తెగల చీలికలు ఉన్నప్పటికీ, తన కుమారుడైన యేసుక్రీస్తను వ్యక్తిలో వెలుగు మరియు జీవం వచ్చాయని దేవుడు చీకటి మరియు మరణిస్తున్న ప్రపంచానికి ప్రకటించడానికి సాధనంగా సంఘము కొనసాగుతోంది.

ఇవి మరియు మరెన్నో కారణాల వల్ల సంఘము అను క్రీస్తు శరీరమును గూర్చి తెలుసుకున్నాము, అలాగే అభినందిస్తున్నాము.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి