ఇద్దరు పర్వతారోహకులు వీపున సామాను సంచిని తగిలించుకొని మోసుకుంటూ వెళుతున్నట్లు ఊహించుకోండి.
ఎడమ వైపున ఒక పిల్లవాడు మోయగలిగేంత తేలికైన సంచి ఉంది. పాపం కుడివైపున ఉన్న ప్రాణం చాలా బరువును మోసుకెళుతుంది, ఎంతంటే మనకు ఆ వ్యక్తి యొక్క తల, శరీరము ఏదీ చూడలేము . . . అతను మోస్తున్న భారం క్రింద వణుకుతున్న రెండు కాళ్ళను మాత్రమే చూడగలము.
జీవితం తరచు ఎలా ఉంటుందో కుడివైపున ఉన్న పర్వతారోహకుడు వివరిస్తున్నాడు–ఒక వ్యక్తికి చాలా బరువుగా ఉన్న సంచితో అంతులేని నడకతో పర్వతంపైకి భారంగా నడవటం.
జీవిత భారాలు మనలను క్రుంగదీస్తాయి, మనం ముందుకు సాగలేమని భావిస్తాము మరియు ఎవరైనా . . . ముఖ్యంగా దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తారని మనము ఆశ్చర్యపోతాము? మనం ఎడమవైపు చూసినప్పుడు ఆ ఆలోచన ఇంకా ఘోరంగా ఉంటుంది. మన సంచులు మనల్ని కట్టిపడేసినట్లు అనిపిస్తాయి, అయితే అవతలి వ్యక్తి యొక్క సంచి వాస్తవంగా లేనట్లే అనిపిస్తుంది.
పోలిక ప్రాణాంతకమైనది! మీరు క్రుంగిపోయినప్పుడు-నా ఉద్దేశ్యం ప్రకారం లేవలేనంతగా క్రుంగిపోయినప్పుడు-ఇతరులు ఆ సంచిని ఎంత తేలికగా కలిగి ఉన్నారనే దానిపై మీరు దృష్టి కేంద్రీకరిస్తే, స్వీయ-జాలి అనేది మీరు రోజును పూర్తి చేయడానికి అవసరమైన ప్రేరణ యొక్క చివరి బొట్టును లాక్కుంటుంది.
పోలిక ప్రతిసారీ (అవును, ప్రతిసారీ) మనం ఇష్టంలేని పని చేయటానికే అవకాశం ఇస్తుంది. మనం ఉన్నతస్థానంలో ఉంటే అమిత గర్వము మరియు పొగరుబోత్తనముతో ఉండటం ప్రారంభిస్తాము లేదా అవతలి వ్యక్తి మెరుగ్గా కనిపించడం లేదా బాగా చదువబడటం లేదా ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా మంచి బట్టలు ధరించడం లేదా మంచి కారు కలిగి ఉండటం వల్ల లేదా . . . లేదా . . . మనం నిరాశ మరియు నిరుత్సాహానికి గురవుతాము.
మనం అలాంటి ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు, మన ఆలోచనను ఒకే ఒక్కటి సరిదిద్దగలదు: దేవుని వాక్యం. ఇది ప్రతిసారీ పనిచేస్తుంది (అవును, ప్రతిసారీ). నాకు పని చేసేది ఇక్కడ ఉంది. నేను క్రొత్త నిబంధనలోని “ఒకరినొకరు” ఆజ్ఞలను ధ్యానించడం ద్వారా ప్రారంభిస్తాను. ఇక్కడ అనేకం ఉన్నాయి:
- “సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారైయుండుడి” (రోమా 12:10).
- “కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము…మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి” (రోమా 15:7).
- “ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి” (1 థెస్సలొనీకయులకు 5:13).
ప్రత్యేక ప్రాధాన్యత కోసం నేను ఉద్దేశపూర్వకంగా నాకు ఇష్టమైనదాన్ని భద్రపరచుకున్నాను:
“ఒకని భారముల నొకడు భరించి . . .” (గలతీయులకు 6:2).
లేఖనము నా మనస్సును నింపినప్పుడు, నా హృదయంలో ఏదో మార్పు వస్తుంది. నేను నా భారంపై దృష్టి పెట్టడం మానేస్తాను, నేను పోల్చడం మానేస్తాను మరియు మరొకరు మోస్తున్న భారాన్ని నేను పరిగణించడం ప్రారంభిస్తాను. భారములు భరించుకోవడానికి ఉద్దేశించినవేనని నాకు గుర్తొస్తుంది. దేవుని కృప అటువంటి క్షణాల కోసం సిద్ధం చేయబడింది!
ఇప్పుడు, మన కథకు తిరిగి వెళదాం. ఆ అధిక భారము భరించుచున్న పర్వతారోహకుడు తన సంచిలో ఏమి లాగుతున్నాడో ఊహించండి. బహుశా దీర్ఘకాల పగ అతని మనస్సును విషపూరితం చేస్తోంది. బహుశా అతని భార్యతో తెగతెంపులు లేదా అతని ఎదిగిన పిల్లలలో ఒకరితో కొనసాగుతున్న వాదన. గడువు మించిపోయిన, చెల్లించని బిల్లుల కట్ట, మరింత బరువు మరియు ఆందోళనను కలిగిస్తుంది.
ప్రశ్న ఏమిటంటే: అతని భారాన్ని మరొకరు భరించులాగున . . . అతను దించుటకు ఎక్కడికి వెళ్ళగలడు?
ఆదివారం తర్వాత ఆదివారం, ఇతర వ్యక్తులతో కలిసి తనంతట తానే కూర్చునే ఒక పెద్ద ఆడిటోరియానికి? అరుదుగా. అతనికి సన్నిహితంగా మరియు వ్యక్తిగతంగా శ్రద్ధ వహించడం, ప్రామాణికమైన భాగస్వామ్యం కోసం అవకాశం అవసరం. ప్రజలు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని చెప్పుకునేది కాదు; ఒకరి భారాన్ని ఒకరు భరించుకోవడం ద్వారా దానిని చూపించే సంఘము అతనికి అవసరం. అటువంటి సమాజం మనం భారమును దించడానికి మరియు తాజా శక్తిని పొందుకోవడానికి అనుమతిస్తుంది.
ఆరోగ్యకరమైన సంఘములలో, ప్రజలు క్రీస్తును ప్రేమిస్తారు మరియు ఒకరి భారాలను మరొకరు భరించడం ద్వారా ఒకరినొకరు ప్రేమిస్తారు. ఒంటరిగా చాలా పెద్ద సంచులు మోస్తున్నవారికి వీరి చేతులు తెరిచి ఉంటాయి. వారు అవమానం మరియు నిందలు వేయరు లేదా బోధించరు లేదా పోల్చరు. అలాంటి ప్రేమలేని ప్రతిస్పందనలు అణగద్రొక్కు భారాన్ని పెంచడం మాత్రమే చేస్తాయి. ప్రేమ అంటే హృదయం నుండి ఆశను మరియు చేయుతను అందించడమే. జీవిత భారములతో మూర్ఛపోతున్న వ్యక్తిని పట్టుకోవడమని అర్థం.
ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్‌లో, దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా తమ భారాలను తగ్గించుకున్నట్లు భావించే రోజువారీ, ప్రత్యక్షమైన మార్గాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల నుండి మేము క్రమం తప్పకుండా వింటూ ఉంటాము. దానికి నేను చాలా కృతజ్ఞుడను! మీరు కాదా?
నేను కూడా మీకు కృతజ్ఞుడను! మీరు మాతో భాగస్వాములైతే, పాపభారముతో హృదయాలు పగిలిపోయి, భావోద్వేగాలతో మూలుగుతున్న వ్యక్తులకు మీరు క్రీస్తు ప్రేమను అందించినవారవుతారు. మీ ఆర్థిక పెట్టుబడి కారణంగా క్రీస్తుపై తమ భారాన్ని దించమని మేము ఇటువంటివారిని ఆహ్వానిస్తూనే ఉంటాము మరియు వారి జీవిత భారం తీవ్రమవుతున్నప్పుడు వారి సంచులను భరించడంలో సహాయపడటానికి వారి ప్రయాణంలో వారితో కలిసి ప్రయాణిస్తాము.
ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమ మరియు సత్యాన్ని ప్రకటించే సంతోషకరమైన భారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఎక్కుతూనే ఉందాం . . . కలిసికట్టుగా!