Wమీరు శోధన గుండా వెళుతున్న వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు, మీరు ఇలా ఆలోచిస్తున్నారా: నేను నిజంగా కష్టపడుతున్న ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ వారికి ఎక్కువగా ఏమి కావాలి? మానవులుగా, మన కష్ట సమయాల్లో మనకు సహాయం చేయడానికి మన జీవితంలో ఈ క్రింది లక్షణాలు మనందరికీ అవసరం.
నమ్మకం: మన ప్రవర్తనలు, భావాలు, ప్రతిచర్యలు, భావోద్వేగాల ప్రదర్శనలు మరియు పనితీరులో కొరత వంటి వాటిపై ఒక అభిప్రాయానికి వచ్చేయకుండా ఇతరుల నుండి అంగీకారం మరియు విలువను మనం గ్రహించాలి; ఇది సంక్షోభం ద్వారా నమ్మదగిన మరియు స్థిరమైన సంరక్షణను కలిగి ఉంటుంది.
భద్రత: మన రోజువారీ బాధ్యతల నిర్వహణలో మనకు విచక్షణారహిత మద్దతు మరియు నమ్మదగిన, స్థిరమైన సహాయం అవసరం.
సంబంధ బాంధవ్యాల ఆదరణ: నిశ్శబ్దంగా ఉండటం ఇష్టపడే, మన అవసరాల గురించి తెలుసుకునే స్థిరమైన మరియు ఆధారపడదగిన వ్యక్తుల ఉనికి మనకు అవసరం.
నిరీక్షణ: ఇతర వ్యక్తుల నుండి ప్రోత్సాహం; వనరులను గుర్తించడంలో వారి సహాయం; మరియు మన కోసం ప్రార్థించడంలో వారి నిబద్ధత మనకు అవసరం. మన సందేహాలు, మన పరిస్థితులను అధిగమించడానికి కావలసిన మెళకువలు, మన మనస్సిత్థి ఊగిసలాటలు, నియంత్రణ లేకపోవడం మరియు మన కుటుంబ డిమాండ్ల మధ్య వారి ఆధారపడదగిన మరియు ప్రశాంతమైన ఉనికి మనకు అవసరం. మనం నిరీక్షణ యొక్క కిరణాన్ని, క్లిష్ట పరిస్థితులు అంతమవటాన్ని చూడాలి.
మార్గదర్శకత్వం: క్రొత్త నైపుణ్యాలు, పరిస్థితులను అధిగమించడానికి ఆరోగ్యకరమైన వ్యూహాలు, స్వీయ-అవగాహన, సమస్య-పరిష్కార నైపుణ్యాలు, ఒత్తిడి-నిర్వహణ పద్ధతులు మరియు సంబంధ బాంధవ్యాల వైరుధ్యాలను చక్కగా ఎదుర్కోగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో మనకు సహాయం కావాలి.
బలమును నిశ్చయపరచడం: మన వ్యక్తిగత అభివృద్ధి మరియు స్వభావ నిర్మాణం పట్ల ఇతరులు సానుకూలమైన గౌరవం కలిగియుండటం అవసరం.
సమయం: ఏడవడానికి, పిచ్చిగా ఉండటానికి, జాలిగా ఉండటానికి, కోరికలు మరియు కలలను వదులుకోవడానికి, కష్టాలను మరియు బాధలను వ్యక్తీకరించడానికి మరియు మన శోధనలకు సర్దుకోవడానికి మనకు సమయం కావాలి.
జీవితంలో అర్థాన్ని మరియు ఉద్దేశ్యాన్ని ఆవిష్కరించడం: మన సంక్షోభానికి ముందు ఉన్నట్లే జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి, మరలా అమర్చుకోవడానికి, క్రొత్త ప్రణాళికలు చేసుకోవడానికి మరియు విడుదల చేయడానికి మనకు అవకాశం అవసరం, తద్వారా మనం ఇప్పుడు ఉన్నట్లుగా జీవితాన్ని గడపవచ్చు.
Next time you encounter someone who is struggling, ask God how He might use you to create a supportive environment where healing can happen.