బైబిల్ ఆధారిత ప్రోత్సాహము

మనం చూడాలని నేను కోరుకునే లేఖనము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఈ పత్రిక అంతటా దృష్టి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తుపై ఉంది. ఆయన మనకొరకు తండ్రి యొద్దకు చేరుకునే క్రొత్త మరియు సజీవమైన మార్గాన్ని తెరిచాడు. మనము ఎటువంటి క్రియలు చేయవలసిన అవసరం లేదు. మనకొరకు మన పక్షమున ఇతర వ్యక్తుల ద్వారా మనం ఆయన యొద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. మనము దేవుని సన్నిధికి వెళ్లాలంటే ఆయనను మెప్పించాలని, అప్పుడే ఆయన మనలను లక్ష్యపెట్టి మన విజ్ఞాపనలను ఆలకిస్తాడని నిరీక్షించవలసిన అవసరం లేదు. ఇదంతా కాదు. చివరగా, ముగింపు:

సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను. (వ. 19-21)

అతని ఉద్దేశ్యం ఇది: ప్రభువు సన్నిధిలోకి ప్రవేశించాలనే విశ్వాసం మనకు ఉన్నది గనుక మరియు మనకు క్రీస్తు “గొప్ప యాజకునిగా” ఉన్నాడు గనుక, ఈ క్రింది మూడు ఆజ్ఞలను అమలు చేద్దాం.

మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. (వ. 22)

ఇది ప్రతీకాత్మక భాష. దీనర్థం ఏమిటంటే: మనం మన దేవుని సన్నిధికి స్వచ్ఛంగా మరియు పవిత్రంగా చేరదాం. మన అవసరాలతో సింహాసనాన్ని ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, లంగరువలె మనపై భారంగా వ్రేలాడుతున్న పాపం ఏదీ ఉండనివ్వకూడదు. మనం ఆయన సన్నిధానమునకు చేరుదము!

తదుపరి ఆజ్ఞ:

వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. (వ. 23)

రెండవ ఆజ్ఞ బలమైనది, మొదటిదానిపై సిరా ఆరిపోయేలోపే వ్రాయబడింది. “సన్నిధానమునకు చేరుదము.” ఆమేన్! “మనం నిశ్చలముగా పట్టుకొందము.” ఆమేన్! ఇంకొకటి కూడా ఉన్నది:

ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. (వ. 24)

ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉందని మీకు ఎప్పుడైనా తెలుసా? దేవుని కుటుంబంలోని మన సహోదర సహోదరీలను ఎలా ఉత్తేజపరచవచ్చో మనం శ్రద్ధ వహిద్దాం. “ఓహ్, అది సరేగానీ, మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు, కొంచెం ప్రోత్సాహాన్ని అందిస్తే చూడటానికి బాగుండవచ్చు,” అని అకస్మాత్తుగా చెప్పిన సాధారణ ఆదర్శం వంటి సూచన మాత్రమే కాదు.

కానీ అతని ఆలోచన పూర్తి కాలేదు.

కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు. (వ. 25)

మనం వారి దగ్గర లేకుంటే మరొకరిని ప్రేమించడానికి మరియు మంచి పనులు చేయడానికి ప్రేరేపించడం అసాధ్యం. ప్రోత్సాహం అనేది ముఖాముఖిగా జరిగేది. కాబట్టి, వాస్తవానికి, అతను ఇలా అంటున్నాడు:

ప్రత్యేకించి ఇప్పుడు ఆయన తిరిగి వచ్చే రోజు దగ్గరపడుచున్నందున, కొందరు నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుకుందాం. (వ. 25, NLT నుండి తర్జుమ చేయబడింది)

ఈ వాక్యముల గుండా అల్లుకున్న రెండు ఆలోచనలను నేను చూస్తున్నాను.

1. ప్రోత్సాహం అనేది ప్రతిభావంతులైన కొద్దిమంది బాధ్యత కాదు, కానీ దేవుని కుటుంబం యొక్క బాధ్యత. సహజంగానే, పాస్టర్ యొక్క అధికారిక పాత్ర కొంతమంది బాధ్యతే. మరియు పెద్ద లేదా డీకన్ పాత్ర కొంతమందికి ఇవ్వబడిన మరొక బాధ్యత. బహుశా ఒక అధికారి లేదా బోధకుడు సంఘములోని కొంతమంది వ్యక్తుల బాధ్యత కావచ్చు. కానీ ఈ వాక్యభాగం కుటుంబంలోని అందరినీ కాకుండా నిర్దిష్టమైన, ప్రతిభావంతులైన వ్యక్తిని ఉద్దేశించినట్లు నాకు కనిపించలేదు. అంటే నీకు కూడా బాధ్యత ఇవ్వబడింది.

2. ప్రోత్సాహం అనేది శరీరంలో తక్కువ అవసరం కాదు, ఎక్కువ అవసరం ఉంది. “ఆ దినము [క్రీస్తు రెండవ రాకడ] సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు” అని రచయిత సూచించడాన్ని మీరు గమనించవచ్చు. ఎందుకో మీకు తెలుసా? “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును” (2 తిమోతికి 3:1).

పౌలు ఉపయోగించిన ఆసక్తికరమైన పదం “అపాయకరమైన” అని అనువదించబడింది. “సంకటప్రదమైన” అనేది కొందరు ఉపయోగించే వివరణ. అలాగే క్రూరమైన అనే అర్థం కూడా వస్తుంది. “అంత్యదినములలో క్రూరమైన కాలములు వచ్చును.” మనం జీవించే రోజులు అవే.

ఇప్పుడు నేను దానిని ఎందుకు నొక్కి చెబుతున్నాను? ఎందుకంటే మనకు మరింత ప్రోత్సాహం అవసరమవటానికి కారణం ఇదే గనుక. మనం దేవుని కుటుంబం యొక్క ప్రేమపూర్వక సహవాసం నుండి బయటికి వచ్చినప్పుడు, మనం “క్రూరమైన ప్రాంతానికి” వెళ్తాము. ఆ రాజ్యంలో మనం సులభంగా భయపెట్టబడవచ్చు. ఆ వాస్తవ వెలుగులో, దేవుని ప్రజలు ప్రోత్సాహాన్ని ప్రారంభించాలి! దేవుని కుటుంబం నోటిమాటతో అణచివేతకు, వ్యంగ్యమైన మాటలతో పొడుచుటకు, విమర్శనాత్మక వ్యాఖ్యానాలకు మరియు కఠినమైన తీర్పులకు స్థలం కాదు. ఇవన్నీ ప్రపంచం నుండి మనకు తగినంత లభిస్తున్నాయి. ఇది ప్రోత్సహించబడే ఉద్దేశ్యంతో మనం కూడుకోవలసిన స్థలం . . . అలాగే మనం మనంగా స్వేచ్చగా ఉండగలుగుతాము.

Adapted from Charles R. Swindoll, “The Biblical Basis for Encouragement,” Insights (May 1998): 1. Copyright © 1998 by Insight for Living. All rights reserved worldwide.

Posted in Church-Telugu, Friendship-Telugu, Love-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.