హెన్రీ డ్రమ్మండ్ యొక్క వ్యాఖ్య నన్ను కొన్నిసార్లు వెంటాడుతుంది:
. . . లోపల ఉన్నట్లు చెప్పుకునే వారి ప్రేమలేని లక్షణం ద్వారా ఎంతమంది తప్పిపోయినవారు దేవుని రాజ్యం నుండి దూరముగా ఉంచబడ్డారు?1
మీతో ఈ రహస్య సంభాషణలో, క్రైస్తవ వర్గాలలో తరచుగా కనిపించే ఒక “ప్రేమలేని లక్షణం” ఎంచుకొని . . . ఆపై దానిని సానుకూల దృక్పథం నుండి అభివృద్ధి చేసేలా మీరు నన్ను అనుమతిస్తారా? నేను మన సంబంధాలలో ఆదరణ లేకపోవడం గురించి ఆలోచిస్తున్నాను. ఈ విషయాన్ని విశదపరచుటకు మీరు చివరిసారిగా ఎప్పుడు వేరొకరిని ఆదరించారు? నిజాయితీగా ఉండండి: చివరిసారి మీరు వేరొకరిని ఆదరించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఏదైనా చెప్పటంగాని లేదా ఏదైనా ఇవ్వటంగాని లేదా ఏదైనా రాయటంగాని లేదా ఏదైనా చేయటంగాని చేసారు? అణగారిన, నిరుపేద, నిరుత్సాహపడిన, ప్రశంసించబడని, లేదా మరచిపోబడిన వారి పట్ల కరుణతో నిండినప్పుడే ఒక వ్యక్తి క్రీస్తును పోలి జీవిస్తున్నాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. “ఆదరణ పరిచర్య” ఎంత అవసరం!
చాలా మంది క్రైస్తవులకు అపరిచితుడైన మనిషి యొక్క నిశ్శబ్దమైన మరియు రంగురంగుల జీవితం అపొస్తలుల కార్యముల గ్రంథములో అల్లబడియున్నది. బర్నబా కుప్ర ద్వీపం నుండి వచ్చి, “ఆదరణ పరిచారకుడు” అని యెవరికి తెలియని పాత్రకు ఉద్దేశించబడ్డాడు. వాస్తవానికి, బర్నబా అనే పేరు వాస్తవానికి అతని మారుపేరు, అంటే “హెచ్చరిక పుత్రుడు” (అపొస్తలుల కార్యములు 4:36). ఈ పుస్తకంలోని పేతురు, పౌలు, సీల, యాకోబు మరియు అపొల్లో వంటి ప్రకాశవంతమైన వెలుగులతో పోలిస్తే-బర్నబా వాస్తవికముగా ప్రస్తావించబడలేదు. . . కానీ, అయ్యో, అతను ఎంత అవసరమో!
అపొస్తలుల కార్యములు 4 గుండా కలిసి తిరుగుదాం. యెరూషలేములో నూతన, హింసించబడిన విశ్వాసులు “గొప్ప ఒత్తిడి” లో ఉన్నారు. ఎప్పుడైనా వారికి ప్రోత్సాహం అవసరమైతే, అది అప్పుడే అవసరం. వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, మానసికంగా గాయాల పాలయ్యారు, మరియు ఆర్థికంగా విరిగిపోయారు. చాలామంది ఒత్తిడి చేయబడ్డారు; వారి అవసరాలు తీరనివి. బర్నబా కుప్ర నుండి వచ్చినప్పుడు, అతను తన వద్ద ఉన్నదంతా ఇచ్చివేసాడు. అతను ఇతరుల కోసం జీవిస్తున్నాడని నిరూపిస్తూ, కొంత ఆస్తిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఈ విశ్వాసుల బృందము దగ్గరకు తీసుకువచ్చాడు (4: 32–37). దీనిని ఆర్థిక ఆదరణ అని పిలుద్దాం.
అతను కనిపించిన తదుపరిసారి, బర్నబా మళ్ళీ అదే పనిలో ఉన్నాడు! అపొస్తలుల కార్యములు 11 లో, క్రీస్తు శరీరం పెరుగుతోంది, మరియు వాక్యం అగ్నివలె వ్యాపించింది. ఒక నాయకుడు ఒంటరిగా దానిని నిర్వహించడం చాలా కష్టం. బర్నబా ఏమి చేశాడు? అతను వెతకగా తార్సునకు చెందిన సౌలు (11:25) అనే అద్భుతమైన బోధకుని కనుగొన్నాడు, ఆ సమయంలో అతని పూర్వ జీవితం కారణంగా వెలివేయబడినవానిగా ఉన్నాడు. ప్రజల దృష్టిలో అనుమానం ఉన్న క్రొత్త క్రైస్తవుడి కోసం తెగించి అతని పక్షాన నిలబడటానికి భయపడని బర్నబా సౌలును అంతియొకయకు తీసుకువచ్చి బర్నబా గొప్ప ఆశీర్వాదం అనుభవిస్తున్న ప్రదేశంలోనే (11: 22-23, 26) . . . అతనికి తోడ్పడ్డాడు. ఏమాత్రం అసూయపడకుండా, తరువాత అతను సౌలు నాయకత్వాన్ని చేపట్టడానికి అనుమతించాడు మరియు మొదటి మిషనరీ ప్రయాణాన్ని ముందుండి నడిపించాడు (అపొస్తలుల కార్యములు 13). వెంటనే వారి పేర్లు “బర్నబా . . . మరియు సౌలు” (13: 1) నుండి “పౌలు మరియు బర్నబా” (13:42) గా మారడం ఆసక్తికరం.
ఇది ముఖ్యమైన పరీక్ష. వేరొకరికి (ముఖ్యంగా చిన్నవారికి) దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాలు ఉన్నాయని గుర్తించడానికి, అలాగే మీ పూర్తి మద్దతుతో మీ కంటే ముందు వెళ్ళడానికి అతన్ని లేదా ఆమెను ప్రోత్సహించడానికి గొప్ప వ్యక్తి అయి ఉండాలి. దీనిని మనము సహవాసము మరియు వెంబడించడం యొక్క ఆదరణ అని పిలువవచ్చు.
15 వ అధ్యాయంలో బర్నబా జీవితంపై తెర పడింది. రెండవ మిషనరీ ప్రయాణం ప్రారంభం కానుంది. మొదటి ప్రయాణంలో వారిని విడిచిపెట్టిన మార్కు అను మారుపేరుగల యోహాను అనే యువకుడిని తీసుకునే అవకాశాన్ని ఆయన మరియు పౌలు చర్చించారు (13: 13). ఆ కారణంగా, మార్కును ఆహ్వానించవద్దని పౌలు పట్టుబట్టాడు, మార్కు విడిచిపెట్టేవాడేనని, మళ్ళీ విఫలమవుతాడని అనుకున్నాడు. బర్నబా ఆ రకమైన ఆలోచనను నిరాకరించాడు. ఇంతకు ముందు ఏమి జరిగినప్పటికీ, మార్కు మీద నమ్మకంతో అతను రాజీపడకుండా నిలబడ్డాడు. ఫలితం మీకు తెలుసు (15: 36–39). విఫలమైనప్పటికీ ఆదరణను చూపించాడు బర్నబా.
ఆదరణ చాలా ముఖ్యం! ఆర్థిక ఆదరణ అవసరం ఉన్నవారి గురించి మీకు తెలుసా? పాఠశాలకు వెళ్లకుండా ఉన్న ఒక విద్యార్థి . . . యిబ్బందికర పరిస్థితుల్లోనున్న ఒక యువ జంట. . . విడాకులు తీసుకున్న వ్యక్తి స్వీయ అంగీకారం పొందటానికి కష్టపడటం. . . ఒంటరి మరియు కష్టమైన పరిచర్యలో శ్రమించే మరచిపోబడిన దేవుని సేవకుడు? ముందుకు రండి! ఉదారంగా ఆదరించండి!
ఎక్కువ ఉపయోగకరమైన ప్రదేశానికి పదోన్నతి పొందటానికి అర్హత ఉన్నవారి గురించి మీకు తెలుసా? ప్రస్తుతం మీ సహవాసం మరియు మానసిక ఆదరణ అవసరం. ఆ వ్యక్తి ప్రక్కన నిలబడండి! అతనికి లేదా ఆమెకు మీ సహవాసం అవసరం. మీ కంటే మంచి అర్హత ఉన్న వ్యక్తియైతే ఎలా ఉంటుంది? మీరు అతనిని లేదా ఆమెను వెంబడిస్తూ వెనుక ఉండి ధైర్యపరిస్తే దేవుడు మీపై కుమ్మరించే ఆశీర్వాదాలకు మీరు ఆశ్చర్యపోతారు.
అలాగే రెండవ అవకాశం అవసరమైనవారు . . . వైఫల్యాలను మరచిపోవద్దు. లోతులు, సమ్సోనులు, యోనాలు, దేమాలు, మార్కులు, పేతురులు. అవును, వీరు విఫలమయ్యారు . . . వారు ఘోరమైన తప్పులు చేశారు. మీరు ఆదరణను అందించడానికి మరియు నిజమైన ప్రేమను చూపించడానికి పెద్ద మనస్సు ఉన్నదా? విఫలమైన వ్యక్తిని ఆదరణతో పైకి ఎత్తండి! అది మంచి ఫలితాలనిస్తుంది! ఇది మార్కు విషయంలో జరిగింది. తరువాత అతను తన పేరును కలిగి ఉన్న సువార్తను వ్రాసాడు. వాస్తవానికి, మార్కు తరువాత పౌలు పరిచర్యకు చాలా ఉపయోగకరంగా మారాడు (2 తిమోతికి 4: 11).
హెన్రీ డ్రమ్మండ్ యొక్క నేరారోపణకు, నేను ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నాను. ఇది ఒక క్రొత్త సిద్ధాంతము: ఆదరణ!
- Henry Drummond, “The Greatest Thing in the World,” in Addresses (Philadelphia: Henry Altemus, 1891), 42. (Accessed on Google Books, May 15, 2013.)
Copyright © 2013 by Charles R. Swindoll, Inc.