ఇశ్రాయేలు

israel

బైబిల్ యొక్క భూమిని గూర్చి నేర్చుకోండి

వాగ్దాన దేశము. పాలు మరియు తేనె యొక్క దేశము. పరిశుద్ధ భూమి. ఈ రియల్ ఎస్టేట్ భూభాగం చాలా పేర్లతో పిలువబడుతుంది. ఇది న్యూజెర్సీ రాష్ట్రం కంటే కొంచెం పెద్దది అయినప్పటికీ, ఈ భౌగోళిక ప్రాంతంలో ఏదోయొక క్రొత్త వార్తావిశేషం జరగకుండా ఒక్కరోజు కూడా గడవదు.

యేసు ఈ దేశాన్ని తన భూసంబంధమైన మాతృభూమిగా చేసుకోవడం ద్వారా ఎప్పటికీ ప్రాధాన్యత కలిగియుండే ముద్ర వేశాడు. ఆయన దాని విషయమై కన్నీళ్లు విడిచాడు, దాని నివాసులలో చాలా మందిని స్వస్థపరిచాడు, దాని స్వభావాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు మరియు దాని భవిష్యత్తు గురించి ప్రవచనాలు చేశాడు. నేడు, ఆయన అనుచరులు వేలాది మంది ప్రతి సంవత్సరం ఆయన అడుగుజాడలను గుర్తుపడుచున్నారు మరియు దాని ఫలితంగా వారి జీవితాలు మారిపోవుచున్నవి.

ఇశ్రాయేలు యొక్క ఏర్పాటు మరియు వ్యత్యాసాల గురించి తెలుసుకోవడం మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ కీలకమైన చారిత్రక సంఘటనలు సంభవించిన భౌగోళికతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు బైబిల్ సంఘటనలపై మీ అవగాహన ఎలా పదునెక్కుతుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవునిచే రూపించబడిన మరియు ఎన్నుకోబడిన దేశము యొక్క గొప్ప చరిత్రను మీరు గ్రహించినప్పుడు ఈ వనరులు మిమ్మల్ని దృశ్యాలలోకి ప్రవేశించడానికి సహాయపడతాయి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి