ఇన్సైట్ ఫర్ లివింగ్ యొక్క పవిత్ర భూమి పర్యటనలలో, చక్ స్విన్డాల్ యెరూషలేములోని తోట సమాధి వద్ద బల్లారాధన నడిపించాడు.. ఆ చిరస్మరణీయ ఉదయమున చక్ యొక్క బోధన నుండి కొన్ని సారాంశాలు ఇక్కడ ఉన్నాయి.
“శిష్యులు అనుకున్నదానికంటే ఇది చాలా భిన్నంగా ఉంది. మూడున్నర సంవత్సరాల క్రితం, సముద్రం వద్ద నిశ్శబ్ద తీరమున తమ వలలను లాక్కొంటూ పడవ ప్రక్కన నిలబడి ఉన్నవారు తమ యజమాని ముఖంలోకి చూసే బదులు . . . వారు ఇప్పుడు నోరు తెరిచి కపాలస్థలమనబడిన గొల్గొతా వద్ద ఒక బలములేని శవమును చూస్తున్నారు.”
“మనలోని ప్రతిదీ మరణం మరియు పాతిపెట్టబడటం యొక్క హింసించే దృశ్యం దాటి వెళ్ళమని అలాగే క్రీస్తు పునరుత్థానం మరియు నిత్యజీవంపై దృష్టి సారించి విజయం ప్రకటించిన ఈ సమాధి యొద్దకు త్వరగా వెళ్ళమని మనల్ని కోరుతుంది. కానీ ప్రభువు దానిని మరొక విధంగా కోరుకున్నాడు. ఆయన ఒక జ్ఞాపకార్థ చిహ్నాన్ని స్థాపించాడు-ప్రభువు భోజనం – అది మనలను సిలువ యొద్దకు మరలా, మరలా, మరలా తిరిగి రావాలని బలవంతం చేస్తుంది.”
“జీవితపు విపరీతమైన వేగం ఆగిపోయే సందర్భాలు ఉన్నాయి మరియు మన రక్షకుడి త్యాగం గురించి మనం ఉద్దేశపూర్వకంగా నిలబడటం లేదా కూర్చోవడం లేదా మోకరిల్లడం చేస్తాము. మరియు సిలువలో ఆయన మన కోసం చెల్లించిన ధర, మన తరపున చేసిన భయంకరమైన త్యాగం పునఃపరిశీలించుకుంటాము.”
యాత్రికుని ప్రయాణంలో జాన్ బన్యన్ ఇలా వ్రాశాడు:
“ఇంతవరకు నేను నా పాపంతో బరువెక్కి వచ్చాను;
నేను ఉన్న దుఃఖాన్ని తగ్గించుకోలేను,
నేను ఇక్కడకు వచ్చే వరకు: ఏమిటి ఈ ప్రదేశము!
ఇది నా ఆనందానికి నాంది అవుతుందా?
ఇక్కడ నా వెనుక నుండి బరువు పడిపోతుందా?
నా బంధకాలు ఇక్కడ తెగిపోతాయా?
ఆశీర్వదింపబడిన సిలువ! ఆశీర్వదింపబడిన సమాధి! నాకు బదులుగా అక్కడ
అవమానపరచబడిన ఆ మానవుడు ఆశీర్వదింపబడునుగాక!”1
“మా తండ్రీ, యెరూషలేములోని ఈ చల్లని ఉదయమున, మేము నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామో . . . మరియు మా కోసం తనను తాను అప్పగించుకొనిన మీ కుమారునికి మేము ఎంత కృతజ్ఞత కలిగియున్నామో మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఆయన శరీరాన్ని కొట్టబడటానికి మరియు గాయపరచబడటానికి ఇవ్వటంలో, ఆయన జీవితాన్ని మరణమునకు అప్పగించటంలో, ఆయన మనసులో మేము ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మా పాపములన్నిటినీ కడిగివేసే అద్భుతమైన సబ్బు, ప్రోక్షణ రక్తానికి కృతజ్ఞతలు . . . ఆయన యొక్క మహోన్నతమైన నామములో మేము ఇప్పుడు ఆయనను ఆరాధిస్తాము.”
- John Bunyan, The Pilgrim’s Progress (Uhrichsville, Ohio: Barbour and Company, 1985), 36.
Adapted from “Lest I Forget,” Insights (March 2007): 2. Copyright © 2007 by Insight for Living. All rights reserved worldwide.