ప్రత్యేక అవసరాలు

special needs

వ్యక్తులను ప్రోత్సహించడం, కుటుంబాలను సన్నద్ధం చేయడం

జీవితంలో మార్పు చాలా కష్టంగా ఉండవచ్చు. మార్పు మనలను సవాలు చేస్తుంది. ఎందుకంటే ఇది మన జీవితాల అల్లికలో మనం కోరుకున్నదానితో, లేదా ప్రణాళిక వేసుకున్న దానితో విభేదిస్తుంది. కొన్ని మార్పులు మనం చిన్న రీతుల్లో అనుకూలింపజేయడానికి లేదా సర్దుబాటు చేయడానికి కారణమవుతాయి; ఇంకొన్ని మన మిగిలిన రోజుల గమనాన్ని మార్చివేస్తాయి. మనోవ్యాధి. క్యాన్సర్. దీర్ఘకాలిక నిరాశ లేదా బాధ. మానసిక మరియు భావావేశపూరిత వైకల్యాలు. అవయవము కోల్పోవడం లేదా పక్షవాతం రావడం. వృద్ధాప్య అవసరాలు. సంరక్షించవలసిన అవసరాలు. వీటిలో ప్రతి ఒక్కటీ-యింకా అనేకమైనవి కుటుంబంలోని ప్రతి ఒక్కరి సామాజిక, మానసిక, శారీరక మరియు ఆత్మీయ స్థితిని ప్రభావితం చేస్తాయి. దుఃఖము అనన్వేషణీయమైనది, నష్టాలు కొలువ శక్యముకానివి, అలాగే ఒత్తిడి మరియు ఒంటరితనం తెలియ శక్యము కానిది.

కానీ నిరీక్షణ ఉంది.

తోటి క్రైస్తవులచే ఆదరింపబడుచున్నప్పుడు శ్రమల మార్గం తరచుగా ప్రజల ఆత్మలను రూపాంతర మొందిస్తుంది. యేసు బాధపడుతున్నవారిని ముట్టాడు, కురూపులకు మరియు విస్మరింపబడినవారికి పరిచర్య చేశాడు, తృణీకరింపబడినవారిపట్ల లక్ష్యముంచాడు మరియు భిన్నమైన వారిని అంగీకరించాడు. క్రీస్తు అనుచరులుగా, మనం ఆయనను పోలి నడవాలని కోరుకుంటున్నాము.

ఇన్సైట్ ఫర్ లివింగ్ స్పెషల్ నీడ్స్ మినిస్ట్రీస్ నిజంగా జీవితాలు తలక్రిందులుగా చేయబడిన వారికి నిరీక్షణను కలిగించడమే ఉద్దేశ్యం. అశక్తికలుగజేయు పరిస్థితులను గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రత్యేక అవసరాలున్నవారికి సేవ చేయడానికి పాస్టర్లను, సంఘములను మరియు కుటుంబాలను సాధనాలతో సన్నద్ధం చేయాలని మరియు అవసరమైన వారికి ప్రోత్సాహం మరియు సాధికారతను అందించాలని మేము కోరుకుంటున్నాము.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి