దేవుని వ్రేలును కనుగొనండి
భూమిమీద యేసు జీవితం యొక్క చివరి రాత్రిలో, మొదటి శతాబ్దం నుండి నేటి వరకు సంఘ జీవితంలో సహించిన ఒక సూత్రాన్ని ఆయన స్థాపించాడు-ఆయనను హింసించిన లోకం తన అనుచరులను కూడా హింసిస్తుంది (యోహాను 15:20). కాబట్టి ఆలాగుననే జరిగింది; విశ్వసించిన స్త్రీపురుషులు యేసుక్రీస్తు కొరకు శ్రమలను అనుభవించారు, అలాగే తమ జీవితాలను యిచ్చారు. ఇది ఒక సంఘముగా మన చరిత్ర, వివాదం, సంఘర్షణ మరియు హింసతో కూడిన చరిత్ర. అయితే ఇది విజయము, విశ్వాసము మరియు సమాజము యొక్క చరిత్ర కూడా. మనది 2000 సంవత్సరాల పురాతన చరిత్ర, సాంప్రదాయం మరియు సిద్ధాంతములో ఎంతో గొప్పది. అలాగే ఆసక్తికరమైన పాత్రలతో నిండి ఉంది-పరిశుద్ధులు మరియు పాపులు-వారు సంఘము యొక్క కథను రాశారు.
క్రీస్తు సంఘము యొక్క కథను అధ్యయనం చేయడం అంటే మానవ చరిత్ర యొక్క కాలక్రమంలో దేవుని వ్రేలును కనుగొనడమే.
సంబంధిత వ్యాసాలు
- అతను నిలబడిన చోట నేను నడిచానుPastor Chuck Swindoll
- దేవుడు గొప్ప ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు!Pastor Chuck Swindoll
- బలమైన దుర్గము: నిన్న, నేడు, మరియు రేపుPastor Chuck Swindoll
- సంస్కరణ ఎందుకు ముఖ్యమైనది?Insight for Living