అశ్లీలత

అశ్లీల వాడకం అంటువ్యాధికి సమాంతరముగా చేరుకుంది. ఒకప్పుడు పట్టణం యొక్క “అసహ్యకరమైన” ప్రాంతమును ఆక్రమించిన “రెడ్ లైట్ జిల్లా” ఇంటర్నెట్ ద్వారా మన ఇళ్లలోకి ఒక రాజమార్గం ఏర్పాటు చేసుకున్నది. మనము నివసించే లేదా ఆరాధించే ప్రదేశం నుండి ఒక వయోజన పుస్తక దుకాణం వీధి అవతల నిర్మిస్తుంటే, వెంటనే పోరాడటానికి మనము ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటాము. అయినప్పటికీ అశ్లీల రచయితలు ప్రజలు ఎక్కడైనా వెబ్‌కు సంబంధం కలిగియుండి కంప్యూటర్లు లేదా చేతి పరికరాలను ఉపయోగించే మన ఇళ్ళు, పాఠశాలలు మరియు కార్యాలయాల లోపలే దుకాణాన్ని ఏర్పాటు చేశారు.

మన కుటుంబాలను రక్షించుకోవడానికి మనం ఏమి చేయగలం? కామం యొక్క ఉచ్చులో చిక్కుకోకుండా మన హృదయాలను కాపాడుకోవడానికి మనం ఏమి చేయగలం? అలాగే మనం పోరాడుతుంటే, మనం ఎలా విడుదల పొందగలం?

ఈ పేజీలోని వనరులు స్వాతంత్ర్యమును పొందాలనుకునే ఎవరికైనా నిరీక్షణను ఇస్తాయి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వెబ్‌ను సురక్షితంగా సర్ఫింగ్ చేయడానికి సమాచార కథనాలు, సహాయక కార్యాచరణ ప్రణాళికలు మరియు సాధనాల జాబితాను మీరు కనుగొంటారు.

“Shield Your Eyes” బైబిల్ స్టడీని ప్రారంభించండి

అశ్లీల చిత్రాలలో చిక్కుకున్న వారు స్వాతంత్ర్యమును కనుగొనులాగున వారికి సహాయపడటానికి, “Shield Your Eyes, Guard Your Heart” అనే నాలుగు పాఠాల ఉచిత బైబిలు అధ్యయనాన్ని సృష్టించాము.

ఈ PDF వనరు జవాబుదారీతనం ఉన్న భాగస్వామితో ఉపయోగించటానికి రూపొందించబడింది మరియు డౌన్‌లోడ్ చేసికోవటానికి అందుబాటులో ఉంది.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి