స్నేహం

Friendship

సహవాసిగా మంచిగా నడవండి

మనమందరం మన జీవితమంతా వివిధ పరిచయాలను ఏర్పరుచుకుంటాము. కొంతమంది వ్యక్తులు మనతో కొంతకాలం ఉంటారు, ఆ తరువాత ముందుకు సాగి వెళ్లిపోతారు. కొంతమంది వెళ్లిపోవడానికి మనం అంగీకరిస్తాము. కానీ యింకొంతమందితో మనం అలా చేయలేము. ఒక పరిచయం నిజమైన స్నేహంగా మారిన తర్వాత, మనము ఆ స్నేహితుణ్ణి లేక స్నేహితురాలిని మరింత గట్టిగా పట్టుకుంటాము. ఒక స్నేహితుడు “ఆదరించబడ్డ సహవాసి,” వీరి పట్ల మనకు “ఆప్యాయత లేదా గౌరవం”1 కలుగుతుంది. స్నేహితుడు ఎందుకు ఆదరించబడతాడు? చాలా మటుకు, మనము అతనితో లేదా ఆమెతో ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుందో దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒక మిత్రుడు మనల్ని మనగా అంగీకరిస్తాడు మరియు మన తప్పుల విషయమై సహనంతో ఉంటాడు. ఒక మిత్రుడు మన బలాన్ని ఎత్తి చూపిస్తాడు మరియు మన విజయాలను చూసి ఆనందిస్తాడు. స్నేహితుడి ఉనికి మరియు వినగలిగే చెవి మనలో శూన్యతను తీసివేస్తుంది, అలాగే మన జీవితాలకు ధృవీకరణను మరియు ఎంతో సావధానతను ఇస్తుంది.

మీకు అలాంటి స్నేహితుడు ఉన్నారా? ఆ స్నేహితుడిగా ఎలా ఉండాలో తెలుసా? ఈ పేజీలోని వనరులు స్నేహం యొక్క అవసరాన్ని గుర్తించడంలో మీకు సహాయపడతాయి మరియు ఇతరులకు మిమ్మల్ని విలువైన స్నేహితునిగా చేసే లక్షణాలను అభివృద్ధి చేస్తాయి.

నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును
దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. (సామెతలు 17:17)

  1. Merriam-Webster’s Collegiate Dictionary, 11th ed. (Springfield, Mass.: Merriam-Webster, 2007), see “friend.”

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి