నిజమైన జట్టుకృషి: అవసరమైన నైపుణ్యము మరియు వ్యక్తిత్వము

యు.ఎస్. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ యొక్క జీవితకాల ఆరాధకుడిగా, నేను ఆయన గురించి ఎన్నో జీవిత చరిత్రలను మ్రింగివేసాను. డోరిస్ కియర్స్ గుడ్‌విన్ రాసిన టీం ఆఫ్ రైవల్స్ వాటిల్లో అత్యుత్తమమైనది. ఈ పుస్తకంలో తనకు వ్యతిరేకంగా పోటీచేసిన వారిని లింకన్ తన మంత్రివర్గంలోకి చేర్చుకునే అద్భుతమైన రాజకీయ చర్యను కనబరచాడు. పదమూడవ సవరణ యొక్క సాధ్యతను విశ్వసించని ఒక బృందం తన చుట్టూ ఉన్ననూ మరియు యుద్ధాన్ని త్వరగా ముగించడానికి దక్షిణాదితో రాజీ పడమని తన సొంత పార్టీలోని పురుషులు ఒత్తిడి చేస్తున్ననూ, చేతులు కట్టుకొని కూర్చోవడానికి లింకన్ నిరాకరించాడు. తమ సందేహాలను అధిగమించాలని తన తోటివారిని, అమెరికాలో బానిసత్వాన్ని అంతం చేయాలన్న వారి భాగస్వామ్య లక్ష్యం మీద పనిచేయాలని మరియు వ్యతిరేకతను తట్టుకొని ముందుకు వెళ్లాలని సవాలు చేశాడు. చివరికి, లింకన్ యొక్క నమ్మకాలే గెలిచాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగియుండి, బానిసత్వం యొక్క ఓటమిని సాధించడానికి అతను ఈ ప్రత్యర్థుల బృందానికి నాయకత్వం వహించాడు.

టెక్సాస్‌లోని డల్లాస్‌లోని ప్రసిద్ధ వ్యాపారవేత్త జాన్ స్టెమ్మన్స్ ను, మంచి జట్టును అభివృద్ధి చేయడానికి పునాదిగా అతను దేనిని భావించాడో దానిపై క్లుప్త ప్రకటన చేయమని కోరారు. అతని సమాధానం సంక్షిప్తంగా మరియు స్పష్టంగా ఉంది: “తమ సొంత రంగంలో విజేతలుగా అవతరించే వారిని, పైకి ఎదుగుచున్న కొంతమంది వ్యక్తులను . . . మరియు మీరు విశ్వసించగల వ్యక్తులను కనుగొనండి. అప్పుడు మిగిలిన జీవితమంతా కలిసి ప్రయాణించండి.”1

బిల్లీ గ్రాహం ఎవాంజెలిస్టిక్ బృందం-ఇందులోని ఆంతరంగిక ప్రజల పేరులు ఇప్పుడు కీర్తినార్జించినవి గనుక మంచి జట్టును గూర్చిన ఉత్తమ దృష్టాంతాలలో యిది ఒకటి. ఊరకూరకే ఉద్యోగాలు మారుతూ, ఎవరి సలహా తీసుకోకుండా తన పని తాను చేసుకుపోయే మనస్తత్వం ఉన్న రోజుల్లో, యిటువంటి బలమైన సంబంధాలు కలిగియున్న సమర్థులైన మరియు ప్రతిభావంతులైన వ్యక్తులు, ప్రతి ఒక్కరూ భిన్నమైన మరియు ప్రత్యేకమైనవారుగా ఉంటూ, కలిసి ముందుకు కొనసాగుతూ చాలా దృఢమైన జట్టుగా ఉండటాన్ని గుర్తుచేసుకోవటం ఎంతో ఊరట నిస్తుంది.

అపార్థం చేసుకోకండి. సన్నిహితస్నేహమనేది గుడ్డి విధేయత లేదా అసమర్థతను కలిగి ఉండటం కాదు. మన చిన్న సమూహం తప్ప మిగతా అందరూ తప్పు అనే ఆలోచనను తెలియజేసే ఆశ్రిత పక్షపాతం కూడా కాదు. ఎవరికీ ప్రవేశం లేకుండా రహస్యంగా కనిపించేంత కఠినంగా మరియు గర్వంగా ఉండదు. బదులుగా, ఉండటానికి, అభివృద్ధి చేయడానికి, ఆవిష్కరించడానికి, తప్పులు చేయడానికి, వాటి నుండి నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఉంది. . . అదే సమయంలో ప్రేమించబడుచూ, పడిపోకుండా నిలబెట్టబడుచూ, మరియు ధృవీకరించబడుచూ ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇటువంటి సందర్భాన్ని “స్నేహం ద్వారా నిర్వహణ” అని పిలుస్తారు. అనుమానం మరియు అణచివేతకు బదులుగా, జట్టులో పరస్పర గౌరవభావం మరియు విశ్వాసమును నిర్మించే నమ్మకం ఉంది. ప్రేమ ప్రవహిస్తూ నవ్వు ప్రోత్సహించబడుతూ ఉన్నది కాబట్టి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అలాంటి సురక్షిత వాతావరణంలో ఎవరు అభివృద్ధి చెందరు?

అమెరికన్ సీజర్ అనే మరో బాగా అమ్ముడుపోయిన జీవిత చరిత్రలో, విలియం మాంచెస్టర్ తన పాఠకులను డగ్లస్ మెక్‌ఆర్థర్‌తో లోతైన పరిచయాన్ని ఆరంభించాడు. అతను భయపెట్టే బాహ్యస్వరూపం అడుగున త్రవ్వి, మెక్‌ఆర్థర్ యొక్క అనేకమైన ఆకర్షణీయ లక్షణాలను మరియు వింత పద్ధతులను ఆవిష్కరించినప్పుడు ఆ బలమైన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటానికి అతను మనకు సహాయం చేస్తాడు. ఒక చోట, కల్నల్ మెక్‌ఆర్థర్ మొదటి ప్రపంచ యుద్ధంలో తన దళాల నుండి సంపాదించిన గొప్ప విధేయతను రచయిత విశ్లేషిస్తాడు. అతను ఎలా అసాధ్యమైన దానిని సాధించడంలో సఫలత చెందాడు? క్లుప్తంగా మాంచెస్టర్ యొక్క విశ్లేషణ ఇలా ఉంది: అతను ఇతర సీనియర్ అధికారుల కంటే వారి వయస్సుకు దగ్గరగా ఉన్నాడు; అతను వారి అసౌకర్యాలను మరియు వారి ప్రమాదాలను పంచుకున్నాడు; బదులుగా, అతను వారిని ఆరాధించాడు.2 బాగా ప్రచారంలోనున్న ఈ మనిషి యొక్క అహంభావం మరియు భావోద్వేగ వక్రీకరణలతో సంబంధం లేకుండా, తన లోపాలను తన మనుష్యుల దృష్టిలో మరుగుపరచి వారి కోరికలను రేకెత్తించే ఒక గొప్ప విమోచన ధర్మాన్ని మెక్‌ఆర్థర్ కలిగి ఉన్నాడు: అతను వారి పట్ల నిజాయితీగా మరియు లోతుగా శ్రద్ధ వహించాడు.

ప్రేమలాగా ఒక జట్టుని కలిసికట్టుగా ఉంచి లేదా విశ్వాస దృక్పథాన్ని బలపరచి ఏదీ-ఖచ్చితంగా ఏదీ-గెలిపించలేదు. ఇది అంతర్గత పోటీని విచ్ఛిన్నం చేస్తుంది. ఇది పుకార్ల‌ను నిశ్శబ్దం చేస్తుంది. ఇది ధైర్యాన్ని పెంచుతుంది. ఇది “నేను చెందినవాడను” మరియు “ఎవరికి పేరొచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు?” అని చెప్పే భావాలను ప్రోత్సహిస్తుంది. అలాగే “నేను నా సాయశక్తులా కృషిచేయాలి” మరియు “నేను నిన్ను నమ్ముతున్నాను గనుక మీరు నన్ను నమ్మవచ్చు.”

యేసు యొక్క శిష్యుల బృందం ఆయనను వెంబడించటం ప్రారంభించినప్పుడు వారేమీ విజయానికి సారాంశముగా లేరు. “ప్రత్యర్థుల బృందం” ఎప్పుడైనా ఒకటి ఉందంటే, అది వీళ్ళే! ప్రభువు వారిని ఎందుకు ఎన్నుకున్నాడో అని ఆశ్చర్యపోవచ్చు. ఆయన ప్రణాళిక యొక్క నైపుణ్యము వెంటనే స్పష్టం అవ్వలేదు. కానీ మొదటి శతాబ్దం చివరికి వచ్చేసరికి, ఆయన ఎంపికను ఎవరూ తప్పుపట్టరు. ద్రోహం చేసినవాడు తప్ప, వారు “పైపైకి ఎదిగారు,” వారు “తమ సొంత రంగంలో సాధించినవారు” అని తమను తాము నిరూపించుకున్నారు మరియు వారు “మీరు విశ్వసించగల వ్యక్తులు” అయ్యారు. అంతిమంగా, తమ ప్రపంచాన్ని తలక్రిందులుగా చేయడానికి వారు బాధ్యత వహించారు. . . లేదా సరిగ్గానే త్రిప్పారని నేను చెప్పాలా? ఏది ఏమైనప్పటికీ, క్రీస్తు మనుష్యుల యొక్క ఆంతర్య కేంద్రం-అనగా మొదటి శతాబ్దపు సువార్త బృందం కంటే చరిత్రలో ఏ సమూహం కూడా సమర్థవంతమైనదిగా నిరూపించబడలేదు.

కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను సాధించడానికి ప్రత్యేక వ్యక్తుల బృందాన్ని-బహుశా మీరు ఒక సమూహాన్ని తయారుచేసే ప్రక్రియలో ఉన్నారేమో. గుర్తుంచుకోదగిన చిట్కా ఒకటి ఉంది: గొప్ప పేరున్నవారి దగ్గరకో లేక ప్రాముఖ్యమైన వ్యక్తుల దగ్గరకో వెళ్లడానికి బదులు, అప్పుడప్పుడే ఎదుగుచున్నవారి కొరకు, సాధించుటకు ముందుకు పోవుచున్నవారి కొరకు, నిజంగా నమ్మదగిన వ్యక్తుల కొరకు వెదకండి. మీరు సుదూర స్నేహాన్ని పెంపొందించుకునేటప్పుడు వారు కలిగియున్న సామర్థ్యాన్ని ప్రేమించండి. అప్పుడు దేవుని క్రియను చూడండి. ప్రేమతో దగ్గరకొచ్చిన మరియు దయతో కలిసి ఉన్న బృందం సహనశక్తిని కలిగి ఉంటుంది. ఇది జీవితంలో వేర్వేరు దశల్లో మన దృక్పథం ఎంత మంచిగా ఉంటుందో తెలియజేస్తుందని నేను అనుకొంటున్నాను.

  1. Alan Loy McGinnis, Bringing Out the Best in People: How to Enjoy Helping Others Excel (Minneapolis: Augsburg Fortress, 1985), 152.
  2. William Manchester, American Caesar: Douglas MacArthur 1880–1964 (New York: Hachette, 2008), e-book.

Copyright © 2016 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.

Posted in Friendship-Telugu, Leadership-Telugu, Pastors-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.