తన మరణానికి కొంతకాలం ముందు, శామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్ యూత్ అండ్ ఏజ్ అనే కవిత రాశాడు. అందులో అతను తన గతాన్ని మరియు తన యౌవనదశలోని బలాన్ని తలపోసుకున్నాడు.
ఈ విలక్షణమైన పనిలో నన్ను బాగా కదిలించిన వాక్యం”స్నేహం ఆశ్రయమిచ్చు చెట్టు. . . .”
ఎంత నిజమో . . . ఎంత భయంకరమైన నిజమో! ప్రతికూలత అనే సూర్యుని యొక్క మండే కిరణాలు మన జీవితంలోనికి కాలుస్తూ ప్రవేశించినప్పుడు, దాని చల్లని నీడలో మనకు ఉపశమనం కలిగించడానికి ఆశ్రయమిచ్చు చెట్టు-నిజమైన స్నేహితుడు-వంటిది మరొకటి లేదు. ప్రేమ అనే మందపాటి ఆకులు మన ముఖాలను కడిగి, మన కనుబొమ్మలను తుడిచివేసినట్లుగా, వివేచన అనే దాని యొక్క భారీ మొద్దు భద్రతను ఇస్తుంది. దాని కొమ్మల క్రింద నిరుత్సాహపడిన అనేక ఆత్మలు విశ్రాంతి తీసుకున్నాయి!
కొన్ని పేర్లు చెప్పనివ్వండి. ఏలీయా నిష్క్రమించడానికి సిద్ధమయ్యాడు. నిరాశ మరియు బెదిరింపులతో నిండిపోయి, అతను తన ప్రవక్త అనే బిరుదును తిరిగి ఇచ్చేసి రాజీనామాను సమర్పించాడు. అయితే దేవుడు దానిని అంగీకరించడానికి ఒప్పుకోలేదు. ఆయన అతనికి విశ్రాంతిని, మంచి ఆహారమును మరియు ఎలీషా అనే “చెట్టు”ను ఇచ్చాడు – అతను “అతనికి ఉపచారము చేయుచుండెను” (1 రాజులు 19:19-21). కోల్రిడ్జ్ యొక్క సారూప్యతను ఉపయోగించి, ఏలీయా ఎలీషా యొక్క “ఆశ్రయమిచ్చు చెట్టు” నీడలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పవచ్చు.
పౌలుకు కూడా యిటువంటి అనుభవమే ఉంది. నిజానికి, అతని జీవితంలో చెట్లు అతనిని గణనీయంగా నిలబెట్టాయి. మిగిలిన వారందరూ అతనికి భయపడి పారిపోయినప్పుడు బర్నబా అతనిని దగ్గర తీసుకున్నాడు (అపొస్తలుల కార్యములు 9:26-27; 11:25-26). తన ప్రయాణంలో సీలను తోడుగా తీసుకెళ్లాడు (15:40-41). అతను లేకపోయి ఉంటే పౌలు అనేకమైన మైళ్ళు ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చేది. మీరు డాక్టర్ లూకాను మరియు తిమోతిని మరియు ఒనేసిఫొరును మరియు ఎపఫ్రొదితును మరియు అకులను మరియు ప్రిస్కిల్లను జోడించినప్పుడు, మీరు ఆశ్రయమిచ్చు చెట్ల యొక్క నిజమైన అడవిని కనుగొంటారు. యేసు కూడా లాజరు, మార్త, మరియల స్నేహాన్ని ఆస్వాదించాడు. బేతనియ నుండి వచ్చిన ఆశ్రయమిచ్చు కొమ్మల క్రింద ఆయన కూడా సేదతీరాడు (యోహాను 11:5).
దేవుడు తాను ఏర్పరచుకున్న సేవకుల ప్రక్కన ఉంచిన అన్ని చెట్లలో, నా ఉద్దేశ్యంలో ఒక మానవ పురాతనమైన పెద్ద వృక్షము ఉద్భవిస్తుంది. పిచ్చివాడైన సౌలు చేత దావీదు వేటాడబడ్డాడు మరియు వెంటాడబడ్డాడు. అయితే, సౌలు మరియు దావీదుల మధ్య, యోనాతాను అనే ఆశ్రయమిచ్చు చెట్టు నిలబడి ఉంది. నమ్మకమైన మరియు ఆధారపడదగ్గ యోనాతాను దావీదుకు, “నీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదును” అని హామీ ఇచ్చాడు (1 సమూయేలు 20:4). అవధులు లేవు. షరతులు లేవు. బేరం లేదు. దాచిపెట్టేదేమీ లేదు. అన్నింటికంటో ఉత్తమంగా, పరిస్థితులు ఘోరంగా ఉన్నప్పుడు, అతను “దావీదునొద్దకు వచ్చి . . . దేవునిబట్టి అతని బలపరచెను” (23:16-17). ఎందుకు? ఎందుకంటే అతను స్నేహం యొక్క ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే యోనాతాను తనను తాను ప్రేమించినట్లే దావీదును ప్రేమించాడు (18:1). యేసు చెప్పినట్లుగా, మానవులు తమ స్నేహితుల కోసం తమ ప్రాణములను పెట్టుటకు కారణమయ్యే ప్రేమ ఇది (యోహాను 15:13). ఈ భూగోళంలో అంతకంటే గొప్ప ప్రేమ లేదు.
ప్రియమైన పాఠకులారా, మీరు ఎవరి కొమ్మల క్రింద సేదతీరుచున్నారు? లేదా, మీ నీడన ఎవరు విశ్రాంతి తీసుకొనుచున్నారో నేను నిజంగా అడగాలా? అపరిపక్వ, ఆత్మీయ శిశువులు లేదా ప్రభువుపై మాత్రమే నమ్మకం ఉంచటం నేర్చుకొనని వారి కోసమే ఈ చెట్లు అని భావిస్తూ, తనకు ఆశ్రయం అవసరమన్న ఆలోచనను విసర్జించే స్వేచ్ఛాత్మను అప్పుడప్పుడు నేను ఎదుర్కొంటాను. అలాంటి వ్యక్తి మీదనే నేను ఎక్కువగా జాలిపడుచున్నాను. ఎందుకంటే మనుష్యులతో అతని సంబంధాలు పైపైన మరియు లోతు లేకుండా ఉంటాయి. అన్నింటికంటే దౌర్భాగ్యమేమంటే, భూమిపై అతని ముగింపు సంవత్సరాలు ఊహించదగిన ఒంటరి ప్రదేశంలో-వేడి, చెట్ల రహిత ఎడారిలో గడుస్తాయి.
కాబట్టి, మన చెట్లకు నీళ్ళు పోస్తూ, కత్తిరిస్తూ, పండిస్తూ బిజీగా ఉందాము. నేను కొన్ని మొక్కలనే నాటితే నేను సరిగ్గా ఉన్నట్లేనా? మీకు తెలుసు, వాటిని పెంచడానికి సమయం పడుతుంది . . . మరియు వేడి పెరిగినప్పుడు మరియు గాలులు వీచడం ప్రారంభించినప్పుడు మీకు నిజంగా కొన్ని అవసరం పడవచ్చు.
Adapted from Charles R. Swindoll, “A Sheltering Tree,” Insights (May 1999): 1. Copyright © 1999, Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.