యేసు

Jesus

నజరేతు యొక్క వడ్రంగివానిని ఎదుర్కొనుడి

సువార్తలను చదివిన ఎవరికైనా, యేసు మాటలు మరియు చర్యలను కలిగి ఉన్న లేఖనములోని పేజీల ద్వారా ఒక విషయం త్వరగా స్పష్టమవుతుంది: ఆయన మాటలు విన్న ఎవరూ స్పందించడంలో విఫలమవ్వలేదు. విన్నవారు కొంతమంది ఆయనపై తమ పిడికిలిని ఝుళిపించారు. ఇతరులు ఇంతకు ముందెన్నడూ వినని లోతైన జ్ఞానమునకు విస్మయమొందారు. ఇంకొందరు ఆయన మాటలయందు విశ్వాసముంచి, ఆయనను వెంబడించాలని అనుకున్నారు. ప్రతిస్పందన ఏమైనప్పటికీ, ఆయనను ఎదుర్కొన్న ఏ ఒక్కరూ ప్రభావితులవ్వకుండా ఆయన సన్నిధిని విడిచివెళ్లలేదు.

చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా యేసు సులభంగా నిలుస్తాడు. నేటికీ, లక్షలాది మంది ఆయనను రక్షకుడని పిలుస్తున్నారు. ఎందుకు? ప్రపంచాన్ని యింతలా కుదిపేసిన భూమిపై ఆయన స్వల్ప సమయం గురించి ఏమి తెలుసుకోవాలి? ఈ విధముగా చేసి మనుష్యుల హృదయాలను ఆకర్షించడానికి ఆయన ఏమి చెప్పాడు? మనుష్యకుమారుడని అనేకమంది ఆయనయందు ఎందుకు విశ్వాసముంచుచున్నారు?

నజరేతు నుండి వచ్చిన ఈ వడ్రంగి జీవితం మరియు సమయంలోకి కళ్ళు తెరిపించే ప్రయాణాన్ని ప్రారంభించండి. మీరు యేసును ఎదుర్కొన్న తర్వాత రేకెత్తించబడరని ఆశించవద్దు.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి