మన చుట్టూ ఉన్న ప్రపంచంలో యేసు జీవితం మరియు స్వభావమును మాదిరిగా చూపడం ద్వారా దేవునికి దగ్గరవ్వాలనే లక్ష్యంతో మనము ఈ సంవత్సరం మన ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈ నెలలో, మనము యేసును మరియు ఆయన ద్వారా మనకు దేవుని సన్నిధిలోకి ప్రవేశమును జరుపుకుంటాము. యూజీన్ పీటర్సన్ యొక్క ది మెసేజ్ [ఆంగ్లములోని ఒక తర్జుమ] యేసు యొక్క మర్త్యరూపాన్ని ఈ విధంగా చాలా క్రొత్తగా వివరిస్తుంది:
ఆ వాక్యము రక్తమాంసములై, ఇరుగుపొరుగు దగ్గరకు వచ్చెను. మనము మన స్వంత కళ్లతో మహిమను చూశాము, తండ్రివలె, కుమారుడు కూడా అద్వితీయ మహిమగలవాడు, పరిపూర్ణముగా ఔదార్యముగలవాడు, ఆరంభము నుండి అంతం వరకు సత్యవంతుడు.
ఈ క్రిస్మస్ సీజన్‌ని గుర్తుంచుకొనే విధంగా మార్చాలనుకుంటున్నారా? మన వేడుకతో ఇరుగుపొరుగువారి యొద్దకు ఎలా వెళ్లాలో పరిశీలిద్దాం. ఈ సీజన్‌లో ఆరంభం నుండి అంతం వరకు సత్యముగా, పరిపూర్ణ ఔదార్యముగలవారముగా ఉండి, దేవుని ప్రేమను తెలుసుకోవడంలో ప్రజలకు సహాయం చేద్దాం. క్రిస్మస్ కాలానికి సుపరిచితమైన యేసు యొక్క పేర్లు, ఆయన స్వభావమును మన ప్రపంచానికి ఎలా మాదిరిగా చూపించాలో మనకు వివేచనను అందించగలవు.
బేత్లెహేములో యేసు జననం గురించి యెషయా ప్రవచించాడు, ఆయనను సమాధానకర్తయగు అధిపతిగా సూచించాడు (యెషయా 9:6).
సంవత్సరంలోని ఈ సమయంలో మీరు భూమిమీద సమాధానమును గురించి ఎంతో వింటారు. కానీ క్రిస్మస్ సందర్భంగా సంధి చర్చలు జరిగినా, యుద్ధభూమిలోనైనా లేదా మీ ఇంటిలోనైనా సరే, మీరు సమాధానాన్ని విధించలేరు. సమాధానం లోపల నుండి ప్రసరిస్తుంది-హృదయం దేవునితో నెమ్మదిగా ఉన్నప్పుడు అది అనుసరిస్తుంది. ఈ సీజన్‌లో మీ హృదయాన్ని కదిలించే అంశాలను పరిగణించండి. ప్రశ్నలు లేదా నిర్ణయాలు మీ మనస్సుపై భారంగా ఉండవచ్చు. సంబంధాలు మీరు అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు. విశ్వాసంతో, ఈ అవసరాలను మీ తండ్రికి అప్పగించండి. ఆయన “ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా [అంటే, షాలోమ్] కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు” అని ఆయన వాగ్దానం చేశాడు (యెషయా 26:3).
బేత్లెహేము దేవదూత యేసు రక్షకుడని, ఈయన ప్రభువైన క్రీస్తు అని ప్రకటించాడు (లూకా 2:11).
మన రక్షకునిగా, యేసు “నశించినదానిని వెదకి రక్షించుటకు” వచ్చాడు (లూకా 19:10). సంఘర్షణ లేదా సమయాభావం కారణంగా దూరమైన వ్యక్తులను వెతకడం ద్వారా మీరు ఈ సీజన్‌లో ఆయన ప్రోత్సాహమును మాదిరిగా చూపవచ్చు. క్షమాపణ అవసరమైతే, దానిని ఇవ్వండి లేదా దయతో స్వీకరించండి. ఖచ్చితంగా ఆ ప్రయత్నం లేదా మూల్యం భారీగా ఉండవచ్చు, కానీ దేవుడు మీ కోసం ఆ విలువైన సంబంధాన్ని ఎలా విమోచిస్తాడో లేదా తిరిగి కొనుగోలు చేస్తాడో అనే దాని గురించి మీరు పరవశులవుతారు. దేవునికి మరియు మీకు ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలను పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ సీజన్‌లో క్రీస్తును మాదిరిగా చూపించండి.
తాను లోకమునకు వెలుగునని యేసు స్వయంగా చెప్పాడు (యోహాను 9:5).
మీ కమ్యూనిటీ చుట్టూ ఉన్న క్రిస్మస్ లైట్లను చూడటం మీకు ఇష్టం లేదా? చీకట్లో వాటి అందం బాగా మెరుస్తాయని ఎప్పుడైనా గమనించారా? మీ విషయంలోనూ అదే నిజం. మీరు లోకంలో ఆయన కోసం ప్రకాశించినప్పుడు, లోకమునకు వెలుగైన యేసును మీరు ఉత్తమంగా ప్రతిబింబిస్తారు. క్రీస్తులో మీకున్న నిరీక్షణను మీరు మీ పొరుగువారితో పంచుకోవాల్సిన నెల ఇదే కాబోలు. మీ సంఘము ద్వారా లేదా మీ కమ్యూనిటీలో మీ స్థానిక మహిళల ఆశ్రమంలో స్వయంసేవకంగా పనిచేయడం లేదా అందుబాటులో ఉన్న ఏవైనా అవకాశాలను కనుగొనడాన్ని పరిగణించండి. చీకటిలో నడుస్తున్న వారితో క్రీస్తు వెలుగును పంచుకోవడానికి ఈ సీజన్ అందించే ప్రతి సందర్భాన్ని అందిపుచ్చుకోండి.
ఇమ్మానుయేలు: దేవుడు మనకు తోడు అని మరియ యొక్క బిడ్డకు పేరు పెట్టుదురని దేవదూత యోసేపుతో చెప్పాడు (మత్తయి 1:23).
సెలవులు గడిచిపోయిన తర్వాత, యేసు యొక్క పేరు, ఇమ్మానుయేలు, మీరు ఒంటరిగా లేరని మీకు గుర్తుచేస్తుంది. “దేవుడు నీకు తోడు” గా యేసు ఉండిపోతాడు. మీరు జీవితంలోని అత్యంత కష్టమైన క్షణాలతో వ్యవహరించేటప్పుడు మీరు ఈ వాస్తవికతను మాదిరిగా చూపవచ్చు. జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి దేవుడు అతన్ని లేదా ఆమెను ఒంటరిగా విడిచిపెట్టలేదని మీ జీవితంలో ఎవరు వినాలి? ఒంటరి తల్లిదండ్రులా? పోరాడుతున్న యువకుడా? ఆ ప్రోత్సాహాన్ని వారికి తెలియజేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని పరిశీలించండి. దేవుని సన్నిధికి సంబంధించిన ఈ జ్ఞాపిక ఈ సంవత్సరం మీరు ఇచ్చే అత్యంత ముఖ్యమైన బహుమతి కావచ్చు.
డిసెంబర్ యొక్క ఎత్తుపల్లాలు జనవరి యొక్క ఊహించదగిన గతితో స్థిరపడినప్పుడు, బహుమతులు మరియు సమావేశాలు జ్ఞాపకశక్తి నుండి మసకబారుతాయి. దేవుని బహుమతులు బాగా వ్యక్తిగతమైనవిగా మరియు ఆచరణాత్మకమైనవిగా ఎలా మారాయి అనేదే రేపు మీకు గుర్తుండేది. ప్రజలు తమ కళ్ళారా ఆయన కృప మరియు మహిమను చూడగలిగేలా ఇరుగుపొరుగు ప్రాంతానికి వెళ్లిన యేసును మీరు ఎలా మాదిరిగా చూపించారో అదే మీరు గుర్తుంచుకుంటారు.
Taken from Insight for Living, “Growing Closer to God, Celebrating Jesus,” Insights (December 2000): 1–2. Copyright © 2000 by Insight for Living. All rights reserved worldwide.