మరణం

Death

నిరీక్షణ కలిగిన వ్యక్తిగా దుఃఖించండి

మీరు ప్రేమించే వ్యక్తి మరణం మీకు తెలియకుండా మీపైకి చొచ్చుకొచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇతర సమయాల్లో, అది వస్తున్నట్లు మీకు తెలిసి ఉండవచ్చు మరియు దాని కొరకు సిద్ధపడటానికి సమయం ఉండి ఉండవచ్చు. ఏదేమైనను, ఫలితం అదే . . . పర్యవసానం తిరుగులేనిది. మీరు ప్రేమించిన ఆ వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో లేరు. తనకు సంబంధించిన వారందరి కొరకు పరలోకంలో నిత్యజీవము కలదని యోహాను 11: 25–26లో యేసు మనకు రూఢిగా చెప్పాడు. ఓదార్పునిచ్చే ఆ మాటలు మనకు భవిష్యత్తుపై నిరీక్షణను ఇస్తాయి . . . అయితే ఈ స్వల్పకాలపరిమితిలో, దుఃఖము కదిలించివేస్తుంది.

తన జీవితాన్ని తీసుకున్న వ్యక్తి యొక్క ప్రభావాల నుండి మీరు బయటపడటానికి తొట్రుపడుతూ ఉండవచ్చు. అలా అయితే, మీరు చాలా మిస్ అయిన వ్యక్తి పట్ల కోపంతో వ్యవహరిస్తూ ఉండవచ్చు, అలాగే చాలా కాలం పాటు ఉండే జవాబు లేని ప్రశ్నలతో పోరాడుతూ ఉండవచ్చు.

ఈ చీకటి కాలములగుండా వెళ్ళడానికి ఈ క్రింది వనరులు మీకు సహాయపడతాయి. యేసుక్రీస్తు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడనే భరోసా మీరు కలిగియుండవచ్చు. ఆయన ప్రతి కన్నీటిని చూస్తాడు మరియు తీరని ప్రతి మొరను వింటాడు, అలాగే ఆయన ప్రేమ మరియు ఆదరణ శాశ్వతమైనవి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి