ప్రభువుతో సన్నిహితంగా నడవడం అంటే మనం ఇతరులను క్షమించడానికి అంగీకరించాలి. అవును, తప్పక చేయాలి. సంబంధాలు తరచూ బాధను మరియు క్షమించాల్సిన అవసరాన్ని తీసుకువస్తాయనే వాస్తవాన్ని మనం నివారించలేము లేదా తిరస్కరించలేము. మరొకరి వలన మనకు అన్యాయం జరిగినా లేదా బాధ్యత మనదైనా, ఎఫెసీయులకు 4:31-32 మనకు స్పష్టమైన మనస్సాక్షిని ఎలా కలిగి ఉండాలో మరియు మన పూర్ణహృదయంతో దేవుణ్ణి ప్రేమించి సేవ చేయటానికి స్వేచ్ఛగా ఎలా ఉండాలో అందంగా సంక్షిప్తీకరిస్తుంది:
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
మన జీవితంలో వివిధ దశలలో, క్షమించే కష్టమైన పనిని మనం ఎదుర్కోవచ్చు. విధేయత మరియు దైవిక ప్రేమ యొక్క ఎంపిక వైపు ప్రారంభించడానికి ఈ క్రింది పటము మరియు అడుగులు మనకు సహాయపడతాయి.
క్షమించే హృదయాన్ని అలవరచుకోండి | ||
1. బైబిలు అధ్యయనం మరియు ధ్యానం ద్వారా దేవుని క్షమాపణ గురించి మీ అవగాహనను లోతుగా పెంచుకోండి. దేవుడు ఆశ్చర్యంగా, అసంబద్ధంగా మన పట్ల ఉదారంగా ఉన్నాడు. ఆ కృప తగ్గింపు మరియు కృతజ్ఞతను ప్రేరేపించనివ్వండి. రోమీయులకు 5:8 చూడండి. | 2. క్షమించే హృదయం యొక్క సూచనలను గుర్తించడం నేర్చుకోండి: శిక్ష యొక్క అవసరాన్ని వీడటం, అపరాధిని జాలి మరియు కరుణతో చూడటం, మరియు ప్రేమతో చేయుతనివ్వడానికి ఎంచుకోవడం. | 3. పాత అనుభూతులు తిరిగి గుర్తొచ్చినప్పుడు మంచిగా స్పందించడం నేర్చుకోండి. మీ హృదయాన్ని మార్చడానికి కాపరి సహాయంపై ఆధారపడండి. తిరగండి (పశ్చాత్తాపం చెందండి), కాపరి స్వరాన్ని వినండి (ఆధారపడండి), మరియు మన కోసం ఆయన మార్గంలో ప్రయాణించండి (పాటించండి). |
క్షమాపణకు అడుగులు
మొదట, క్షమాపణ ప్రమాదకరమని గ్రహించండి. పశ్చాత్తాపపడే అపరాధి కూడా మళ్ళీ విఫలమయ్యే అవకాశం ఉంది, బహుశా అదే ప్రాంతంలో.
రెండవది, దేవుని మీద ఆధారపడండి. “ప్రభువా, నన్ను బాధపెట్టిన ఈ వ్యక్తిని ప్రేమించటానికి మరియు అతనికి ఉత్తమమైన వాటి కోసం పనిచేయడానికి కృప మరియు శక్తి కొరకు నేను మీ మీద ఆధారపడుచున్నాను.”
మూడవది, వాస్తవానికి రుణాన్ని రద్దు చేయండి. ప్రార్థన ద్వారా, ఏ స్థాయిలోని అప్పులనైనా వసూలు చేసి మీ కఠినతను విడిచిపెట్టే హక్కును మీరు వదులుకుంటారని దేవునికి తెలియజేయండి.
నాల్గవది, మీరు దేవుని ముందు చేసిన పనిని అపరాధికి చెప్పాలా అని అంచనా వేయండి.
ఐదవది, సముచితమైతే, నోటితో వారికి క్షమాపణ చెప్పండి. వారు పశ్చాత్తాపపడితే, మీ సంబంధం పునఃప్రారంభమవుతుంది. అవ్వకపోతే, సంబంధం పునఃప్రారంభించబడదు; కానీ క్షమాపణతో, కీడుకు ప్రతిగా మేలును తిరిగి ఇవ్వవచ్చు (రోమీయులకు 12:21).
ఒకవేళ క్షమాపణ దొరకకపోతే?
మీరు బాధపెట్టిన వారితో సరిచేసుకోవాలనుకుంటే, కాని వారు అందుబాటులో లేకపోతే, దేవుని క్షమాపణ తృప్తిపరచనివ్వండి. మీరు కలిగించిన ఏ గుండె నొప్పినైనా తగ్గించడానికి మీ తరపున మధ్యవర్తిత్వం చేయాలని ఆయనను విశ్వసించండి. మీ పాపాన్ని విశ్వసనీయ స్నేహితుని ముందు ఒప్పుకుంటే ఇది సహాయపడవచ్చు.
వ్యక్తి అందుబాటులో ఉన్నప్పటికీ మిమ్మల్ని క్షమించటానికి నిరాకరిస్తే, మీరే ప్రశ్నించుకోండి, వారి నిరాకరణ నేను నిజాయితీగా పశ్చాత్తాపపడలేదని సూచిస్తుందా? 2 కొరింథీయులు 7:8-11లో ఉన్న ప్రమాణాల ప్రకారం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిజమైతే, దేవుని క్షమాపణ సరిపోతుంది. క్షమించడం ఒక ప్రక్రియ అని గ్రహించండి. వారు క్షమించటానికి సిద్ధంగా ఉండటానికి సమయం అవసరం కావచ్చు.
ఈ రోజు క్షమాపణ ప్రయాణంలో ప్రారంభించడానికి ఈ క్రింది ప్రార్థన మీకు సహాయం చేయునుగాక.
ప్రియమైన క్షమించే తండ్రి,
మేము క్షమించబడటానికి వచ్చిన మీ కుమారుడు క్రీస్తు యేసు అను మీ గొప్ప బహుమానమునకు ధన్యవాదములు. మీ దయకు చాలా ధన్యవాదములు.ఆ దయ చూపించడానికి మరియు దానిని అడగడానికి వినయం చూపించడానికి మాకు ధైర్యం ఇవ్వండి. మేము మనస్తాపం చెందినప్పుడు, మా తప్పును గుర్తించి, రాజీపడటానికి అవసరమైనదంతా త్వరగా చేయండి. మరియు మనల్ని బాధపెట్టిన వారితో, మనము ఆగ్రహాన్ని మరియు పగలను అన్నిటిని వదిలేద్దాం. కృపతో నిండిన జీవితం నుండి మనల్ని వెనక్కి నెట్టుచున్నవన్నీ మరచిపోయేలా చేయండి.
చివరగా, ఇతరులకు అర్హత లేని వాటిని ఇవ్వడంలో మనం గొప్ప ఆనందం పొందుకోవాలి . . . తద్వారా మమ్మల్ని విడిపించిన మీ కృపను మాదిరిగా చూపాలి. ఆమేన్.