ప్రోత్సాహం & స్వస్థత

Encouragement and Healing

ప్రస్తుత పోరాటాలకు ఆదరణనిచ్చే మాటలను వెదకండి

యాత్రికుని ప్రయాణం అనే ఒక గొప్ప రూపకంలో, ప్రధాన పాత్రయైన క్రైస్తవుడు జిగటగల ఊబిలో అనగా, “నిరాశ యొక్క బురద” లో పడిపోయి విడుదలను పొందటానికి కష్టపడతాడు. కానీ అతని వెనుక భాగంలో ఉన్న భారీ బరువు అతన్ని లోతుగా లాగుతుంది, మరియు అతను మునిగిపోవటం ప్రారంభిస్తాడు.

మన అప్పులు మన ఆదాయాన్ని మించిపోయినప్పుడు, పాత గాయములు నయం కానప్పుడు, అసంతృప్తి మన సంబంధాలకు గుర్తుగా ఉన్నప్పుడు మరియు పరలోకం యొక్క వెలుగు దూరముగాను, మసకబారినట్లుగాను అనిపించినప్పుడు ఎలా ఉంటుందో, ఈ చిత్రం మనం క్లిష్ట పరిస్థితులలో మునిగిపోతున్నప్పుడు అలా అనిపిస్తుంది. నిరుత్సాహం, నిరాశ, బాధ, శ్రమ- జీవిత ప్రయాణంలో ఈ జిగటగల గుంటలు మన స్వంత “నిరాశ యొక్క బురద” లోనికి మనలను క్రిందకు లాగివేస్తాయి.

క్రైస్తవుని యొక్క రక్షణ సహాయం అనే తోటి ప్రయాణికుడి వలన వచ్చింది. . . ఈ రోజు మీకు కూడా ఇది వర్తిస్తుంది. మీ స్వంత జీవితానికి ప్రోత్సాహం మరియు స్వస్థత పొందుకోవడానికి . . . లేదా జీవిత ప్రయాణంలో మీరు కనుగొన్న వారికి పరిచర్య చేయడానికి ఈ వనరులను ఉపయోగించండి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి