నేను ఒక క్రైస్తవ వ్యాపారవేత్తతో చేసిన భోజనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మేము అతని వృత్తికి సంబంధించిన అనేక బాధ్యతల గురించి చర్చించినప్పుడు, జ్ఞానం యొక్క విషయం మా సంభాషణలోకి వస్తూనే ఉంది. అతను మరియు నేను పాఠశాలలో నేర్చుకోలేని కొన్ని లక్షణాలు చాలా విలువైనవని అంగీకరించాము-దివ్యజ్ఞానం, శ్రద్ధ, చిత్తశుద్ధి, గ్రహణశక్తి, నిలకడ, విధేయత వంటివి. . . మరియు అతను, మళ్ళీ, జ్ఞానాన్ని పేర్కొన్నాడు. జ్ఞానాన్ని నిర్వచించడం కష్టం ఎందుకంటే ఇది విజ్ఞానము కంటే ఇంకా ఎంతో ఎక్కువ అర్థం కలిగియున్నది మరియు అవగాహన కంటే చాలా లోతుగా ఉంటుంది.
మా సంభాషణలో ఆ సమయంలో,జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను ఆ మనిషి ఎంత ఖచ్చితమైనదని తెలుసుకున్నాడో, అతని జీవితంలో అది ఎంత ముఖ్యమైన పాత్ర పోషించిందో మరియు అది అతని వ్యాపార నిర్ణయాలను ప్రభావితం చేసే విధానాన్ని నేను గ్రహించాను. కాబట్టి నేను అడిగాను, “ఒక వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? మనము జ్ఞానం కలిగిన స్త్రీపురుషులముగా ఉండాలని నేను గ్రహించాను, కానీ కొంతమందే దీనిని ఎలా సంపాదించారనే దాని గురించి మాట్లాడతారు.” అతని సమాధానం వడిగా మరియు ప్రస్తుతాంశమునకు అనుగుణమైనదిగా ఉంది.
“బాధ.”
నేను నిదానించి అతని కళ్ళలోకి లోతుగా చూసాను. ప్రత్యేకతలను గూర్చి తెలుసుకోకుండానే, అతని నోట నుండి ఒక్క-మాటలో వచ్చిన సమాధానం సైద్ధాంతికపరమైనది కాదని నాకు తెలుసు. అతను మరియు బాధ ఒకరికొకరు బాగా తెలుసు. ఇటీవలి నెలల్లో అతను ఎదుర్కొంటున్న పరిస్థితులను గూర్చి విన్న తర్వాత -కొన్ని వృత్తిపరమైనవి మరికొన్ని వ్యక్తిగతమైనవి-జ్ఞానంలో తన పిహెచ్‌డి సంపాదించడానికి తగినన్ని గంటలు మూసలో గడిపాడని నేను అతనితో చెప్పాను. ఫిలిప్స్ భావానువాదం చేసిన క్రొత్త నిబంధనలోని యాకోబు పత్రిక మొదటి అధ్యాయాన్ని నేను గుర్తుచేసుకున్నాను.
నా సహోదరులారా, అన్ని రకాల పరీక్షలు మరియు ప్రలోభాలు మీ జీవితాల్లోకి వచ్చినప్పుడు, వారిని చొరబాటుదారులుగా అసహ్యించుకొనవద్దు, కానీ వాటిని స్నేహితులుగా స్వాగతించండి! అవి మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి మరియు మీలో ఓర్పు అనే గుణమును కలుగజేయటానికి వచ్చాయని గ్రహించండి. కానీ ఆ ఓర్పు పూర్తిగా అభివృద్ధి చెందే వరకు ప్రక్రియ కొనసాగనివ్వండి, అప్పుడు మీరు బలహీనతలు లేని పరిపక్వత గల పురుషులుగా పరిణతి చెందిన వ్యక్తులుగా మారినట్లు మీరు కనుగొంటారు. (యాకోబు 1:2–4 ఫిలిప్స్)
అవి గొప్ప మాటలు కావా? మరీ ముఖ్యంగా, అవి పూర్తిగా నిజం. జీవిత పరీక్షలు మరియు శోధనలను స్నేహితులుగా ఆమోదించడం ద్వారా – మన వ్యక్తిగత ప్రపంచంలోకి ప్రవేశించడానికి మరియు అరుదైన ఓర్పును కలుగజేయటానికి వాటిని అనుమతించడం ద్వారా-మనం “పరిణతి చెందిన వ్యక్తులు” అవుతాము. సులభమార్గము లేదు. తక్షణ ఓర్పు అనే ఆలోచన అర్థరహితమైనది. ఆటంకాలు మరియు నిరాశలు, నష్టాలు మరియు వైఫల్యాలు, ప్రమాదాలు మరియు వ్యాధులు, మార్పులు మరియు ఆశ్చర్యాల వల్ల కలిగే బాధ పరిపక్వతకు సుదీర్ఘమైన మరియు కష్టమైన మార్గం. వేరే దారి లేదు.
కానీ జ్ఞానం ఎక్కడ కలుస్తుంది? మనం కిటికలోంచి వంగి, “సహాయం చేయండి!” అని అరచినప్పుడు అది దేవునిచేత నిర్దేశించబడిన జీవితం యొక్క బాధ కలుగజేయు ఆశ్చర్యముల నుండి వస్తుంది. నా ఉద్దేశం అది కాదు. అపొస్తలుడైన యాకోబు 5 వ వచనంలో ఇలా చెప్పాడు:
ఒకవేళ, ఈ ప్రక్రియలో, మీలో ఎవరికైనా ఏదైనా ప్రత్యేక సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే, దేవుడిని మాత్రమే అడగాలి -మనుషులందరికీ అపరాధ భావన కలిగించకుండా ఉదారంగా ఇస్తాడు -మరియు అవసరమైన జ్ఞానం అతనికి ఇవ్వబడుతుందని అతను ఖచ్చితంగా అనుకోవచ్చు. (1:5 ఫిలిప్స్)
న్యూ లివింగ్ అనువాదం మరింత సంక్షిప్తమైనది: “మీకు జ్ఞానం అవసరమైన యెడల, ధారాళముగల దయచేయు మన దేవుణ్ణి అడగండి, ఆయన దానిని మీకు ఇస్తాడు.”
ఇది ఒక సంఘటన అదనపు సంఘటనల గొలుసును ఏర్పరుస్తున్నట్లుగా నాకు కనిపిస్తుంది. ఒక విషయం మరొకదానిపైకి దూసుకెళుతుంది, క్రమంగా ఇది మరొకదానిపైకి వెళుతుంది, మరియు ఈ ప్రక్రియలో, మనం పరిపక్వమవటానికి ఓర్పు సహాయపడుతుంది. అయితే, నిర్ణీతసమయంలో, మనం ఏమి చేయాలో లేదా ఎలా స్పందించాలో తెలుసుకోలేకపోతున్నాం-అప్పుడే మనం సహాయం కోసం అడుగుతాము. ఆ సమయాలలో, దేవుడు తెలివితేటల కంటే . . . తెలివైన ఆలోచనలు మరియు మంచి ఇంగితజ్ఞానం కంటే చాలా ఎక్కువే ఇస్తాడు. ఆయన తన జ్ఞానం యొక్క బావిలోనుండి తోడుచున్నాడు మరియు అందులోనిది మనకు త్రాగడానికి అనుమతిస్తున్నాడు.
మన ప్రభువు అందించే విశ్రాంతిని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలను నేను పూర్తిగా వివరించలేను, కానీ మరొక ప్రపంచంలోనికి తీసుకువెళ్లే సామర్థ్యాలు మరియు అంతర్దృష్టులు వాటిలో ఉంటాయి. బహుశా దీనిని “క్రీస్తు మనస్సును” అర్థం చేసుకున్నట్లుగా పేర్కొనవచ్చు. పౌలు మాటల నుండి స్వీకరిస్తే:
మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము . . . మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము. (1 కొరింథీయులకు 2:13, 16)
ఇది చాలా వేగంగా భావగర్భితమైనదిగా మారవచ్చు, అయితే అలా జరగాలని నేను కోరుకోను. నేను స్పష్టముగా తెలియజేయాలనుకుంటున్నది ఇదే: జీవితపు దెబ్బలకు మనం ప్రతిస్పందించాల్సిన విధంగా ప్రతిస్పందించినప్పుడు, వాటిని తప్పించుకునే బదులు వాటిని భరిస్తే, దేవుడు మనతో ఉండి మరింత పరిపక్వతను మరియు మన జీవితాలు నిలకడగా ఉండి మనం క్రొత్తగా మెండైన జ్ఞానమును పొందుకొనునట్లుగా అనుగ్రహిస్తాడు.
మీరు ఈ మాటలను చదువుచున్నప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. అయితే, మీ జీవితంలో కూడా కొంతమంది బాధ కలిగించు చొరబాటుదారులు ఉన్నారనే అనుమానం నాకు ఉంది-మరియు వారిని భరించడంలో మీకు సహాయపడటానికి మీరు కొంత దైవిక పరిపుష్టతను ఉపయోగించుకోవచ్చు.
అలా అయితే, నిర్ణయం తీసుకోండి. సహాయం కోసం దేవుని వేడుకొనుటకు వెనుకాడవద్దు.
మీ తండ్రికి మీరు బలం మరియు శక్తి మరియు నిరీక్షణ లేకుండా పోతున్నారని . . . మీ మనస్సు మసకబారుతోంది గనుక క్రీస్తు మనస్సు నుండి . . . దేవుని వాక్యం నుండి మీకు నూతన అవగాహన అవసరమని చెప్పండి.
ఆయన తన జ్ఞానాన్ని మీకు ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాడు.
Scripture quotations marked Phillips, reprinted from “The New Testament in Modern English,” Revised Edition, translated by J. B. Phillips. Published by HarperCollins Publishers, Ltd.