ముంచుకొస్తున్న ముప్పు

పరిచయం యేసు నిజానికి శాంతముగలవాడు మరియు దయగలవాడు అయినప్పటికీ, ఆయన పాపానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడ్డాడు. నిజానికి, మతం యొక్క ముసుగుతోనున్న చెడును ఎదుర్కొన్నప్పుడు, ఆయన భీకర కోపం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇశ్రాయేలు‌లోని మత పెద్దలు తమ ప్రత్యేక స్థానాన్ని ధనము మరియు అధికారాన్ని పొందేందుకు అవకాశంగా మార్చుకున్నందుకు ఆయన తీవ్రంగా మందలించాడు. మరియు సరైనది చేసినందుకు మనం ప్రజాదరణను కోల్పోయి హింసను అనుభవిస్తున్నప్పటికీ, సత్యం కోసం ఎలా నిలబడాలో యేసు యొక్క […]

Read More

పునరుత్థానం యొక్క పాటలను కొనియాడుట

నేను సంగీతాన్ని ఇష్టపడుతున్నాను అనేది ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు. బృంద సంగీతం, వాయిద్య సంగీతం, ప్రసిద్ధ సంగీతం, అలాగే శాస్త్రీయ అంశాలు. . . జానపద రాగాలు, జానపద గేయాలు, సరదా పాటలు మరియు గంభీరమైన రచనలు . . . దేశవాళీ పాశ్చాత్య మరియు బ్లూగ్రాస్, అలాగే దేశభక్తి మరియు శృంగారభరితం. నామట్టుకైతే, సంగీతం తప్పనిసరి. దీనివల్ల నేను గొప్ప కీర్తనలు, కాల పరీక్షను తట్టుకున్న . . . భక్తిగీతముల విద్యార్థినయ్యాను. ఆదివారం నాడు […]

Read More

గత అపరాధములు ప్రభావితం చేయకపోవడం: క్షమించబడిన అనుభూతికి కలిగే అడ్డంకులను అధిగమించడం

ప్యూరిటన్ పరిచారకుడైన రిచర్డ్ బాక్స్టర్ అనవసరమైన అపరాధ భావమును మోయడం వల్ల కలిగే భావోద్వేగాల గురించి హెచ్చరించాడు: “ఆ దుఃఖం, పాపం గురించి అయినా సరే, మరీ ఎక్కువ అవుతుందేమో. ఆ విపరీతమైన దుఃఖం మనిషిని మ్రింగేస్తుంది.”1 రెవరెండ్ బాక్స్టర్ క్షమాపణను అనుభవించని వ్యక్తుల భావాలను తన అద్భుతమైన పాత ఆంగ్లంలో స్వాధీనపరచాడు. గత పాపాలపై దుఖం వారిని తీవ్ర విషాదంలో ముంచేస్తుంది. అపరాధం వారిని మింగేస్తుంది, మరియు తాము మునిగిపోతున్నట్లుగా వారు భావిస్తారు. విశ్వాసులుగా, క్షమించబడటం […]

Read More

మార్పును తెచ్చు నిరీక్షణ

ఈస్టర్ మరియు నిరీక్షణ పర్యాయపదాలు. ఈ జీవితానికి మించిన జీవితం ఉందని మనకు సేదతీర్చుచూ గుర్తుచేయకుండా ఈ ప్రత్యేకమైన దినము ఎప్పటికీ రాదు. నిజమైన జీవితం. నిత్యజీవం. ఘనమైన జీవితం. “నిరీక్షణకు దూరంగా” నివసించే వారికి మార్పు అవసరం. ఈస్టర్ అది ఇస్తుంది. కొన్ని అసాధారణ కారణాల వల్ల, నేను నిత్యం సాన్నిహిత్యం కలిగియుండే చాలా మంది వ్యక్తులు ఒకేసారి క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి బారిన పడి జీవించడం నేను నా జీవితంలో అనుభవించాను. “దూరంగా” […]

Read More

పునరుత్థానం మనకు ఏమి ఇస్తుంది

నేను హ్యూస్టన్‌లో పెరుగుతున్నప్పుడు, మా కుటుంబం శ్రీమతి రాబర్ట్స్ అనే విధవరాలి యింటికి ఎదురుగా వీధి ఆవల నివసించాము. ఆమె భర్త ఇటీవల ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఒంటరితనముతో, భయముతో, భవిష్యత్తు ఏమిటో తెలియని స్థితిలో ఉన్నది. ఆమె దుఃఖానికి హద్దులు లేవు. అంత్యక్రియలు జరిగిన తరువాతి వారాల్లో, శ్రీమతి రాబర్ట్స్ తన భర్త సమాధిని సందర్శించడానికి ప్రతిరోజూ ఇంటి నుండి బయలుదేరడం మా తల్లి గమనించారు. ప్రతి రోజు ఆమె ఏకాంతమైన ఇంటినుండి స్మశానవాటికకు వెళుతున్నప్పుడు, […]

Read More

చింతించకండి…ఆయన లేచాడు!

యేసు సిలువ వేయబడిన రోజున, ఒక చెడ్డ అంధకారము సూర్యుడిని మాయంచేసి, చెడు దుప్పటి కింద యెరూషలేమును ఉక్కిరిబిక్కిరి చేసింది. అంధకారము, సాతాను మరియు మరణం దేవుని కుమారుడిని ఒక్కసారిగా ఓడించాయని శారీరక కళ్ళతో చూసేవారికి ఎవరికైనా అనిపిస్తుంది. నేను బాధపడే ప్రతి ఆందోళనకు దాదాపు మూలంగా ఈ మూడూ ఉన్నాయని నేను మీతో ఏకీభవిస్తాను. నేను మరణం గురించి, ముఖ్యంగా, నేను ప్రేమించే వ్యక్తుల మరణం గురించి ఆందోళన చెందుతున్నాను. నేను యథాతథమైన మరియు ఉపమానవిశిష్టమైన […]

Read More

వైఫల్యానికి మించి నిరీక్షణ

అరుదుగా దేవుని వీరులలో ఒకరు వైఫల్యాలు లేని జీవితాన్ని గడిపినట్లు లేఖనాల్లో కనిపిస్తారు. ఉదాహరణకు పేతురు‌ను తీసుకోండి. మీరు పేరు చదివిన వెంటనే, అతని కథ మీకు గుర్తుకు వస్తుంది. క్రీస్తుతో ఆశీర్వాదకరమైన సహవాసం గడిపిన రోజుల నుండి ప్రభువును తిరస్కరించినప్పుడు కలిగిన విధేయత యొక్క గుండె కోత వరకు కూడా జీవితం యొక్క ఒడిదుడుకులను పేతురు ఎదుర్కొన్నాడు. ఒక్కసారి కాదు. రెండుసార్లు కాదు. మూడు సార్లు. అతను తన వైఫల్యాన్ని గ్రహించిన తర్వాత, “అతను వెలుపలికిపోయి […]

Read More

యేసు మరణం నన్ను ఎలా రక్షిస్తుంది?

ప్రశ్న: నా పాపాల కోసం యేసు చనిపోయాడని నాకు చెప్పబడింది. సరిగ్గా దాని అర్థం ఏమిటి? యేసు మరణం నేను పరలోకానికి చేరుకోవడానికి ఎలా సహాయపడుతుంది? క్రీస్తు మరణం నన్ను దేని నుండి రక్షిస్తుంది? సమాధానం: యేసు యొక్క మరణమును అర్థం చేసుకోవడానికి ఒక విధానమేమిటంటే, మన పాపములకు మనం విచారణలో ఉన్న న్యాయస్థాన దృశ్యాన్ని అలాగే న్యాయాధిపతియైన దేవుణ్ణి ఊహించుకోండి. దేవునికి వ్యతిరేకంగా మన పాపాలు మరణకరమైన నేరాలు. దేవుడే మన న్యాయాధిపతి, మరియు ధర్మశాస్త్రం […]

Read More

మంచి మానవుడు లేదా దైవ-మానవుడు? యేసు దైవత్వమును గూర్చిన విషయము

“నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు?” (మార్కు 8:27) యేసు ఈ ప్రశ్నను రెండు వేల సంవత్సరాల క్రితం అడిగాడు, ఇంకా సమాధానాలు వస్తూనే ఉన్నాయి: కరుణను బోధించిన రబ్బీ, వేలాది మంది హృదయాలను తాకిన తెలివైన నాయకుడు, అమరవీరుడిగా మరణించి తప్పుగా అర్ధం చేసుకోబడ్డ ఆవిష్కర్త. ఆయన శత్రువులైతే ఆయనను ఒక దెయ్యమని, చనిపోయే అర్హత కలిగిన ఆందోళనకారుడని అన్నారు. ఆయన అనుచరులైతే ఆయనను మెస్సీయ అని, ఆరాధనకు యోగ్యుడైన దేవుని కుమారుడని అన్నారు. ఏ అభిప్రాయం […]

Read More