గలతీయులకు 5:1
కృపా హంతకులను ఊరికే విస్మరించలేము లేదా మంచితనముతో సహించలేము. కట్లపామును మీ ఇంట్లోకి జారుకొని దాక్కోవడానికి మీరు అనుమతించని విధంగానే దాసత్వమును కొనసాగించడానికి మీరు అనుమతించలేరు. ఈలోపు, ఎవరో ఒకరు గాయపడతారు. అలాంటప్పుడు, స్వాతంత్ర్యము కోసం పోరాడటం విలువైనది గనుక, మనం దానిని ఎలా చేయాలి? మన వ్యక్తిగత కృపా మేల్కొలుపు ఎక్కడ ప్రారంభించవచ్చు? నేను నాలుగు బలమైన వ్యూహాల గురించి ఆలోచించగలను:
మీ స్వాతంత్ర్యములో స్థిరంగా ఉండండి. గలతీయులకు 5:1లో పౌలు వ్రాసిన దాని గురించి నేను గుర్తు చేస్తున్నాను: “ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి.” ధైర్యంగా నిలబడండి. మీకు ధైర్యాన్ని ఇవ్వమని దేవుని అడగండి.
అందరి దయను పొందాలనుకోవడం మానేయండి. ఇది మానుకోవడానికి కఠినమైన అలవాటు కావచ్చు, కానీ మీరు ప్రయత్నిస్తే ఇది చాలా మంచిది. మీరు సమూహంలో ఉన్నట్లయితే, మీ మనస్సాక్షికి విరుద్ధమైన కొన్ని పనులు చేయమని మీరు బలవంతం చేయబడుతున్నారని లేదా మీకు ఎటువంటి సమస్య లేదని మీరు భావించే పనులను ఆపమని ఒత్తిడి చేయబడుతున్నారని మీరు భావిస్తే, సమూహం నుండి బయటకు వెళ్లిపోండి! ఇది సరైనది కాదని మీ మనస్సాక్షి మీకు చెప్పినప్పుడు ఆ పరిస్థితులలో ఉంటే మీరు అజ్ఞానులవురు. అది మనుష్యులకు సేవ చేయడం అవుతుంది గానీ, దేవునికి కాదు. ఇది ఆత్మీయంగా ఎంత లోతుగా అనిపించిందో నేను పట్టించుకోను. అందరి దయను పొందడం మానేయండి.
బానిసత్వానికి లోబడటాన్ని నిరాకరించడం ప్రారంభించండి. దానిని ఏమని పిలవాలో అలా పిలవండి: బానిసత్వం. ఇది క్రియల ద్వారా “ఆత్మీయంగా” ఉండటానికి ప్రయత్నిస్తుంది. మిమ్మల్ని మీరే సమర్పించుకున్న బానిసత్వముతో వచ్చే అన్ని ఆందోళనలను వదిలించుకోవడం ఎంత సంతోషకరమైనదో ఆలోచించండి; మీరు పెద్దవారైన తర్వాత జీవితంలో మొదటిసారిగా మీరు మళ్లీ వాస్తవికంగా ఉండటం ద్వారా ఎంత స్వచ్ఛంగా ఉన్నట్లు భావించవచ్చో ఆలోచించండి.
నిజం విషయమై సూటిగా ఉండటం కొనసాగించండి. అంటే నిజాయితీగా జీవించాలి. మీరు అంగీకరించకపోతే, మృదువుగా చెప్పండి కానీ దృఢంగా చెప్పండి. మీరు ఒంటరి అయినట్లైతే, మీరు నిజాయితీగా ఉండండి మరియు ప్రత్యేకంగా ఉండండి. మీరు దేనినైనా పాడుచేసినప్పుడు, “నేనే దానిని పాడుచేసాను” అని చెప్పండి. మీకు తెలియకపోతే, నిజం ఒప్పుకోండి. తెలియక పోయినందువల్ల నష్టమేమీ లేదు. ఈసారి మీ పిల్లలు కపటత్వాన్ని గుర్తించినప్పుడు, మీకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ, వారితో ఏకీభవించండి, “మీకు తెలుసా, పిల్లలూ? మీరు చెప్పింది నిజమే. నేను గొప్ప వేషధారుడను. మీరు చూసినది మరియు ఎత్తి చూపినది ఖచ్చితంగా సరైనది.” అది వారికి చెప్పండి. ఇది ఇప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ వారు మీ ఒప్పుకోలు గుణాన్ని మెచ్చుకుంటారు మరియు గౌరవిస్తారు. వారు దెబ్బతినకుండా ఎదుగుతారు. అన్నింటికంటే ఉత్తమమైనది, మీరు వృత్తిపరమైన క్రైస్తవ పనిలో. . . ప్రత్యేకించి మీరు వృత్తిపరమైన క్రైస్తవ పనిలో ఉన్నప్పుడు, వారు అదే రకమైన దుర్బలత్వం మరియు నిజాయితీని మాదిరిగా చూపడం నేర్చుకుంటారు. ఎవరూ పరిపూర్ణతను ఆశించరు, కానీ వారు నిజాయితీని ఆశిస్తారు మరియు ఆశించాలి కూడా.
మనం ఎలా ఉండాలో అలా ఉండటానికి నిశ్చయత మరియు ప్రోత్సాహం అవసరం, అలాగే చాలా మంది లోపల చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి, స్వాతంత్ర్యము కొరకైన వారి పోరాటంలో వారికి సహాయం చేయడానికి బలమైన వారు అవసరం. కాబట్టి, ఇతర కారణాలేవీ లేకపోయినా, ఇతరులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి స్వాతంత్ర్యము కోసం పోరాడడం విలువైనదే.
స్వాతంత్ర్యం కోసం పోరాడడం మీకు చాలా దూకుడుగా అనిపిస్తే, బహుశా చాలా స్వార్థపూరితంగా అనిపిస్తే, ఇతరులను విడిపించడానికి చేసే పోరాటంగా భావించండి–అప్పుడు ఇతరులు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క ఆనందాలు మరియు అధికారాలకు మేల్కొల్పబడవచ్చు. నిజమైన యుద్ధభూమిలో అలా చేసేవారిని దేశభక్తులు లేదా వీరులు అని అంటారు. నా మనసారా చెబుతున్నాను, దాసత్వమను కాడికి వ్యతిరేకంగా పోరాడే వారిని కూడా అలాగే పరిగణించాలని నేను నమ్ముతున్నాను.
Reprinted by permission. The Grace Awakening Devotional, Charles R. Swindoll, © 2003, Thomas Nelson, Inc., Nashville, Tennessee. All rights reserved. Copying or using this material without written permission from the publisher is strictly prohibited and in direct violation of copyright law.