నేను దాదాపు 30 సంవత్సరాల క్రితం కృపా మేల్కొలుపు వ్రాసినప్పుడు, పుస్తకం యొక్క విస్తృత ప్రభావాన్ని నేను ఊహించలేకపోయాను. ఇది వారి జీవితాలను మరియు వారి వివాహాలను కూడా ఎలా మార్చిందో చెప్పడానికి ప్రజలు ఇప్పటికీ నాకు వ్రాస్తూ ఉంటారు. కొంతవరకు, పుస్తకం నా స్వంత “కృపా మేల్కొలుపు” నుండి ఉద్భవించిందని వారికి తెలియదు.
ఈ జూన్‌లో, సింథియా మరియు నేను వివాహం చేసుకుని 64 సంవత్సరాలు కావొస్తుంది . . . కానీ మా దాంపత్యంలో ఎల్లప్పుడూ కృపా తైలం స్వేచ్ఛగా ప్రవహించలేదు. మొదట్లో, సింథియాను దయతో చూసుకోవడం కంటే దైవజనునికి లేదా మా సంఘములోని సిబ్బందికి దయను అందించడం సులభంగా అనిపించింది.
సమస్య-అలాగే దాని పరిష్కారం-మా పెళ్లి కాకముందే చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఒక వారం డేటింగ్ తర్వాత, నన్ను పెళ్లి చేసుకోమని నేను సింథియాను అడిగాను మరియు ఆమె “సరే!” అని చెప్పింది. అయినప్పటికీ నేను చాలా అభద్రతాభావంతో ఉన్నాను, అసూయ నన్ను తినేస్తుంది. నేను సింథియాను ప్రశ్నలను–చిన్నవి, మాటలతో చెప్పకుండానే అర్థమయ్యే ప్రశ్నలను పదేపదే అడిగాను. మూడు వారాల తర్వాత, మా మొదటి ఘర్షణ జరిగింది . . . మరియు నిశ్చితార్థం అయిపోయింది అని ఆమె నాకు తెలియజేసింది!!!! మా జీవితాంతం అలా జీవించడానికి ఆమె నిరాకరించింది. ఆమె సరైనదని నేను గ్రహించాను. నన్ను క్షమించమని నేను ఆమెను అడిగాను మరియు భయపడకుండా ఆమెను ప్రేమించే కృప కొరకు దేవుణ్ణి వేడుకున్నాను. అప్పటి నుండి, నాకు అసూయపడే రోజు మరొకటి రాలేదు.
అయితే, మేము వివాహం చేసుకున్న తర్వాత, నేను ఆమె కార్యకలాపాలు మరియు స్నేహాలను పరిమితం చేయడం ప్రారంభించాను. ఇల్లు శుభ్రంగా ఉంచి, పిల్లల అవసరాలు తీర్చి, షాపింగ్ చేసి, బిల్లులు చెల్లించి మరియు సమయానికి భోజనం తయారు చేసినంత వరకు . . . ఆమె కోరుకున్నది ఏదైనా చేయవచ్చని నేను భావించాను. ఏది ఏమైనా ఆమె నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఉద్రిక్తత ఏర్పడింది. ఇది ప్రతి వివాహిత జంట ఎదుర్కొనే ఘర్షణల్లో ఒకటిగా ముగిసింది.
సింథియా మాటలు బాధించాయి, కానీ ఆమె నన్ను ఎదిరించడం సరైనది. నేను ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాను. నేను విన్నాను, ఆమెను ముఖ్యంగా పరిగణించాను మరియు నా జీవితంతో కోపం పుట్టించి పనికి వెళ్ళాను. నేను ఆమెతో ఇకపై అలా అగౌరవంగా ప్రవర్తించనని హామీ ఇచ్చాను. ఈ విధ్వంసకర అలవాటు నుండి విముక్తి కోసం మరియు అన్ని ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు లేకుండా ప్రేమించే మరియు నన్ను నేను ఆమెకు సమర్పించుకొనే సామర్థ్యం కొరకు నేను దేవుణ్ణి వేడుకున్నాను.
నేను పయనించడానికి మరియు ఎదగడానికి ఇంకా ఎంతో దూరం ఉంది, కానీ నా జీవితంలో కృప మేల్కొంటోంది! మొట్టమొదటిసారిగా, అది నా వివాహంలో–మొదట చిన్న విషయాల్లో తర్వాత పెద్ద విషయాల్లో నన్ను విడిపించడం ప్రారంభించింది.
నేను ఆ పూర్వపు రోజులను తలచుకుంటున్నప్పుడు, నాకు మరొక కష్టమైన మలుపు గుర్తుకు వచ్చింది. సింథియా మరియు నేను “ఒక జట్టు” అని నేను ప్రజలకు చెప్పేవాడిని. తర్వాత ఒకరోజు, ఆమె నాతోపాటు కూర్చొని, అది నిజం కాదు కాబట్టి అలా చెప్పడం మానేయమని నన్ను కోరింది. మళ్ళీ, ఆమె సరైనదని నేను గ్రహించాను. మా సంబంధంలో “జట్టు స్ఫూర్తి” లేదు. ఎందుకు అని నేను విశ్లేషించడం ప్రారంభించినప్పుడు, మళ్ళీ ఒక ప్రధానమైన అంశం అగపడటంలేదని బాధాకరంగా స్పష్టమైంది: కృప.
నేను ఆమెను నియంత్రించడం, సరిదిద్దడం మరియు విమర్శించడం వంటి నా దీర్ఘకాల అలవాట్లతో మరింతగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. . . మరియు ఆమె ఏమైయున్నదో అందునుబట్టి ఆమెను అంగీకరించడం మరియు ఆమె పట్ల నన్ను మొదట ఆకర్షించిన ఆ లక్షణాలను మెచ్చుకోవడం ప్రారంభించాను. ఎంత తేడా వచ్చింది! నేను నా వైఖరిని మరియు నా అంచనాలను మార్చుకున్నప్పుడు, కృప మా సంబంధాన్ని అద్భుతంగా పెంచింది. సింథియా యొక్క సృజనాత్మక వరములు మరియు సంస్థాగత నైపుణ్యాలు వికసించడం ప్రారంభించాయి. అది నలభై సంవత్సరాల క్రితం జరిగింది. వెంటనే, మేము జీవాంతర్దృష్టి మినిస్ట్రీస్ ప్రారంభించాము. మరియు ఏమి జరిగిందో ఊహించండి? ఇప్పుడు ఇతర వ్యక్తులు తరచుగా మమ్మల్ని “ఒక జట్టు!” అని పిలుస్తున్నారు.
కృప తేడా తీసుకువచ్చింది! కృప నా అసూయను చెరిపేసింది. కృప నా అంచనాలను మార్చింది మరియు నియంత్రించే శక్తి నుండి నన్ను విడిపించింది. సింథియాను ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చూడడానికి కృప నా కళ్ళను తెరిచింది.
నేను దీనికి యథార్థముగా సాక్ష్యమివ్వగలను: భర్త హృదయంలో కృప మేల్కొన్నప్పుడు, అతను దేవుడు తనకు ఇచ్చిన వ్యక్తిపట్ల ఒక క్రొత్త మరియు లోతైన మార్గంలో శ్రద్ధ వహించడం ప్రారంభిస్తాడు. అతను తన భార్య యొక్క విలువ, అసాధారణ ప్రతిభ మరియు ప్రాముఖ్యత గురించి ఎక్కువగా తెలుసుకుంటాడు. దేవుడు ఆమెను ఏవిధంగా చేశాడో ఆ విధంగా ఆమెను ఉండనివ్వడానికి అతనిలోని కృప అతన్ని తేలికపరుస్తుంది. దేవుని కృప గురించి నేను ఎంత బాగా తెలుసుకున్నానో, మా ఇంట్లో అధికారం గురించి అంత తక్కువగా పట్టించుకున్నాను . . . సమస్యలు వచ్చే అవకాశం తక్కువని నేను భావించాను. నేను దేవుని కృపపై ఎంత ఎక్కువగా ఆధారపడితే, నేను అంత ఎక్కువగా సేవకునిగా ఉండటానికి, నా భార్యను ధృవీకరించడానికి మరియు బంధకాల నుండి విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా, నేను ఆమెపై ఆధిపత్యం చెలాయించాలని మరియు నియంత్రించాలని కోరుకోవడంలేదు.
కృప ప్రేమిస్తుంది మరియు సేవ చేస్తుంది; అది ఇస్తుంది మరియు క్షమిస్తుంది, విడుదల చేస్తుంది మరియు ధృవీకరిస్తుంది. మనం తప్పుల చిట్టాను ఉంచడంలో ఆసక్తి లేనంతగా, కృప మన ప్రేమ సామర్థ్యాన్ని విస్తరింపజేస్తుంది. కృప చోటును ఇస్తుంది-ఎదగడానికి మరియు మనం మనంగా ఉండటానికి, కనుగొనడానికి, అభివృద్ధి చేయడానికి చోటునిస్తుంది. ఈ రకమైన కృపా మేల్కొలుపు ప్రేమ ఉన్నప్పుడు, తన్నుతాను ప్రేమించుకున్నట్లుగా పురుషుడు తన భార్యను ప్రేమిస్తాడు మరియు భార్య తన భర్తను గౌరవిస్తుంది . . . ఇది ఖచ్చితంగా దేవుడు ప్రణాళిక వేసినట్లుగానే ఉంది (ఎఫెసీయులకు 5:33).
భూమిపై నాకు ఇష్టమైన ప్రదేశం నేను ఇష్టపడే వ్యక్తితో మా ఇంట్లో ఉందని నేను చాలా సంవత్సరాలుగా చెబుతున్నాను. నాకు ఇంట్లో ఉండటం చాలా ఇష్టం! అక్కడ నేను పూర్తి భద్రత మరియు అంగీకారం, నెరవేర్పు మరియు జవాబుదారీతనం, బాధ్యత మరియు సామరస్యం, అసలైన నిజాయితీ మరియు ఆప్యాయతతో కూడిన ప్రేమను కనుగొంటాను. ఎందుకు? ఎందుకంటే సింథియా మరియు నేను చివరకు ఒక జట్టుగా ఉన్నాము గనుక—ఈ జట్టు వివాహాన్ని వికసించేలా చేసే అదే ముఖ్యమైన అంశానికి పూర్తిగా కట్టుబడి ఉన్నది: కృప!