నేను ఇంటికి రావడానికి సుదీర్ఘ విమాన ప్రయాణంలో ఉన్నాను.
నేను అలసిపోయాను. ఇంటికి దూరంగా ఉన్న రోజులు బాగానే గడిచాయి కానీ అవి ఆయాసకరమైనవి. నేను ప్రయాణం చేసినందుకు సంతోషిస్తున్నాను, కానీ ఇంటికి వస్తున్నందుకు మరింత సంతోషంగా ఉన్నాను. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉంటే నేను ఇంట్లో ఉండడాన్ని ఎంతగా ఇష్టపడుతున్నానో నాకు తెలుస్తుంది.
ఒక్కసారి నేను లోపలికి అడుగుపెట్టి నా ఇంటి ముందు తలుపును మూసేసిన తర్వాత వచ్చే ఆ వెచ్చని, సంతృప్తికరమైన అనుభూతుల స్థానాన్ని ఏ హోటల్ కూడా భర్తీ చేయలేదు. ఇంట్లో ఉండటం నా ప్రాణానికి ఎందుకంత ఆనందాన్ని ఇస్తుందో ఖచ్చితంగా గుర్తించడం కష్టం. బహుశా అందులో ప్రతిదీ నాకు తెలిసినది ఉన్నందువల్లనేమో . . . ఖచ్చితంగా, అది కొంత అయ్యుండవచ్చు. లేదా ఇంటిపై తీవ్ర ఆకర్షణ . . . నాదీ అనే భావన కావచ్చు. ఆపై ఇంట్లో నన్ను చుట్టుముట్టే జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. పిల్లలు మరియు మనవళ్ళు మనవరాళ్ళతో ఉన్న ప్రత్యేక క్షణాలు నేను ఇంటి చుట్టూ వేరేవేరే చోట్లలో ఉన్న వారి ఫొటోలను చూస్తున్నప్పుడు వెంటనే గుర్తుకువస్తాయి. పర్వతాలు మరియు బీచ్‌లకు సెలవులకెళ్లడం, ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలల నుండి డిగ్రీలు పొందుకోవడం మరియు క్రిస్మస్ సందర్భంగా బల్ల చుట్టూ చిరస్మరణీయమైన భోజనాలు–పంచుకున్న అనుభవాల ఫలితంగా గడిచిన రోజుల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఇంకా ఎన్నో ఉన్నాయి. అవును, ఇవి ఖచ్చితంగా ఇంటికి వచ్చే ఆనందాన్ని పెంచే జ్ఞాపకాలు.
ఈ ప్రదేశం ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్న నొప్పి యొక్క కొలనుల నుండి ప్రతిబింబాలను కూడా సూచిస్తుంది. కన్నీళ్లు మూలాలను తడుపుతాయి, తద్వారా అవి లోతుగా, బలంగా మరియు దృఢంగా పెరుగుతాయి. అపార్థాలు మరియు తప్పుల ఫలితంగా కన్నీళ్లు. . . బాధాకరమైన వార్తల కన్నీళ్లు, నిరుత్సాహాలు, ఉద్వేగభరితమైన విభేదాలు, తప్పులు, ఒప్పుకోలు, పశ్చాత్తాపం, క్షమాపణ. అలాంటి గుండెకు కలిగిన గాయాలు ఇంటి నుండి తొలగించబడవు, వాటిని తొలగించడానికి మనం ప్రయత్నించకూడదు. బాధ తర్వాత వచ్చే కృపలతో సమానంగా అవి ఇంటికి మృదువైన అందాన్ని ఇస్తాయి.
కానీ అన్నింటికంటే ఎక్కువగా, ఇంటికి రావడం అంటే 1955 వేసవి నుండి నన్ను నమ్మకంగా ప్రేమిస్తున్న వ్యక్తి చేతులతో ఆలింగనం చేసుకోబడటమే. యాభై ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ అయ్యాయా-నిజంగా అన్ని అయ్యాయా? మేము అప్పుడు ఎంత చిన్నవాళ్లంగా ఉన్నాము, జీవితంలో ఎక్కువ భాగం అనుభవం లేని వాళ్లముగానే ఉన్నాము! ఏది ఏమైనప్పటికీ, మేము ఇద్దరం “నేను అంగీకరిస్తున్నాను” అని చెప్పిన తర్వాత ఆ వెచ్చనైన, దీపకాంతుల మధ్య యెర్రబారిన ముఖములతో కూడిన ఆ మొదటి ఆప్యాయత నుండి ఈ రోజు వరకు మేము ఎదుగుతూ మరియు నేర్చుకుంటూనే ఉన్నాము. మేము కలిసి మా ప్రేమ యొక్క మంటలను రేకెత్తించినందున మేము క్షమించుకోవడానికి సిద్ధంగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను . . . దానిని విడిచిపెట్టి దూరంగా వెళ్లడానికి బదులు–మేము దాని గురించి మాట్లాడినందుకు మరియు కలిసి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ఈ రాత్రి, ఆకాశం గుండా ఈ సుదీర్ఘ ప్రయాణంలో, నేను ఇంటికి రావాలని ఆలోచిస్తున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. దూరం మరియు సమయం అనేవి నా వైవాహిక జీవితంపై శ్రద్ధ వహించడం యొక్క ప్రాముఖ్యతను నాకు గుర్తుచేశాయి–మర్యాదను ప్రదర్శించడం, స్వార్థపూరితమైన చిన్నచిన్న చర్యలకు విరుద్ధంగా పోరాడటం, బాగా అర్థం చేసుకోవడం, బాగా వినడం, త్వరగా క్షమించడం, నిజం మాట్లాడటం, లోతైన సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం, నిష్క్రియాత్మకతను నిరోధించడం మరియు దుమ్మూధూళికి దూరంగా ఉంచే మరికొన్ని వైవాహిక క్రమశిక్షణ పద్ధతులను అభ్యసించడం వంటి విషయాలలో కష్టపడి పనిచేయడం . . . ఇవి నిర్లక్ష్య ధోరణి పదేపదే కనబడకుండా కాపాడతాయి. నేను పెద్దవాడినవుతున్న కొద్దీ, మా వివాహం మెరుగుపడాలని నేను కోరుకుంటున్నాను, కానీ అది “ఊరకనే జరగదు.” వయస్సు ఆప్యాయతకు స్నేహితుడు కాదు, ఇద్దరు వ్యక్తుల “ఫలవంతమైన ప్రయాణానికి” మర్దన చేసే ఓదార్పు ఔషధతైలం కాదు.
ఏదో ఒక రోజు-ఏదో ఒక భయంకరమైన రోజున-సింథియా లేదా నేను
నేను కోసిన ముళ్ళు
నేను నాటిన చెట్టుకు చెందినవి;
అవి నన్ను చీల్చి చెండాడాయి, నాకు రక్తం కారుతుంది.
అటువంటి విత్తనం నుండి ఏ పండు
ఉద్భవిస్తుందో నాకు తెలిసుండాల్సింది!”
కాబట్టి, ప్రతిచోటా ఉన్న భర్తలందరికీ, ఈ ఉన్నతమైన మరియు పవిత్రమైన అన్వేషణలో నాతో చేరాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను-మీ భార్యను ప్రేమించడం మీ లక్ష్యంగా చేసుకోండి, అప్పుడు ఇంటికి రావడం ఎల్లప్పుడూ మీకు ఆనందంగా ఉంటుంది (మరియు మీ భార్యకు కూడా ఆనందంగా ఉంటుంది), అంతేగాని మీకెప్పుడూ భయమేయదు. అది జరిగినప్పుడు, మనం చావుకు భయపడాల్సిన అవసరం లేదు; దానికి బదులుగా, మన భార్యలను ప్రేమిస్తే మనం జీవించడం ప్రారంభించడానికి సహాయపడుతుంది.