నమ్మడం కష్టమే, కానీ సింథియా మరియు నేను మా అరవయ్యవ వివాహ వార్షికోత్సవాన్ని ఈ నెలలో జరుపుకుంటున్నాము. మీరు సరిగ్గానే చదివారు . . . అర్ధ శతాబ్దం కంటే పదేళ్లు ఎక్కువ! ఇరవై అయిదు సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వారు నాకు గుర్తున్నారు. వారు నడవటానికి ఊతమిచ్చే చట్రం నుండి కొద్ది దూరంలోనే ఉన్నారు. అయితే ఇక్కడ సింథియా మరియు నేను అరవై ఒకటిలో ఉన్నాము. సమయం ఎలా పరుగెడుతుందో! మీ చర్మంపైనున్న మచ్చలు పోయే సమయానికి, మీ మనస్సు అస్పష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. లేదా కనీసం కొద్దిగా మసకగా అనిపిస్తుంది. ఎందుకు?
జ్ఞాపకాలు. వార్షికోత్సవాలు వచ్చినప్పుడు ఒడ్డుకు కొట్టుకొచ్చే కెరటాల్లాగా జ్ఞాపకాలు మదిలోనికి దూసుకొస్తాయి. తమాషా జ్ఞాపకాలు. బాధాకరమైనవి. అవన్నీ గతాన్ని గుర్తుచేస్తూ స్రవించుచున్నవి. అంటే మా హనీమూన్ లాగా–లోపాలతో కూడిన బ్రహ్మాండమైన హాస్యము. మరియు మా పద్దెనిమిది నెలల బలవంతపు యెడబాటు, సైన్యానికి ధన్యవాదాలు. అలాంటి ఒంటరి సమయాలు. కానీ మేము ఎదగడానికి మరియు వాస్తవికతను ఎదుర్కోవడానికి అవసరమైన సమయాలు. వృత్తి విషయంలో మధ్యలో మార్పుచెందటం . . . మరలా పాఠశాలకు, ఆ చిన్న ఫ్లాట్, మరియు ఆ క్రమశిక్షణతో కూడిన అధ్యయనం. మా నలుగురు పిల్లల జననాలు (అంతేకాకుండా ఇద్దరిని కోల్పోవడం) మరియు డైపర్‌ల నుండి నర్సరీ స్కూల్ వరకు శక్తిని హరించే ఆ సంవత్సరాలు. మేము ఎంత నేర్చుకున్నామో . . . మా మూలాలు ఎంత లోతుగా పెరిగాయో . . . మేము ప్రయాణించిన కొన్ని మార్గములు ఎంత కఠినమైనవో.
“జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. అవి శాశ్వతమైనవి,” అని వార్షికోత్సవం మీకు గుర్తుచేస్తుంది.
మార్పులు. మీరు మీ జీవితంలోని అనేక విషయాలలో మార్పులు-చేర్పులు చేయకుండా ఒకే వ్యక్తితో అరవై సంవత్సరాలు జీవించి ఉండరు. నేను అనుభవించిన అత్యంత ముఖ్యమైన మార్పు సున్నితత్వం విషయంలో అని నేను అనుకుంటున్నాను. నేను మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించడం, ఎన్నడూ పలికించని భావాలను వినడం, నాలుక ప్రకటించకుండా ముఖం వ్యక్తపరిచే వేదన లేదా కోపం, సరదా లేదా భయం, గందరగోళం లేదా కరుణను చూడడం నేర్చుకున్నాను. అరవై ఏళ్ల క్రితం నేనెంత అధికారం గలవాడినని అనుకున్నానో! అయితే ఒక భార్య మరియు గంపెడు పిల్లలు మరియు పది మంది మనవళ్ళు మనవరాళ్ళు-అలాగే నలుగురు మనవళ్ళు మనవరాళ్ళు-ఎంతటి వ్యత్యాసం తీసుకురాగలరో! నా ఉద్రేకమును నిగ్రహించడానికి దేవుడు వారిని ఉపయోగించుకున్నాడు. మొండిపట్టుగల వాదము చేసేవానినుండి విశాల హృద్రయం గలవానిగా మార్పుచెందడం ఆవశ్యకమైనది. ఆ ప్రక్రియ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది.
“మార్పులకు కృతజ్ఞత కలిగి ఉండండి. అవి ముఖ్యమైనవి,” అని వార్షికోత్సవం మీకు గుర్తుచేస్తుంది.
ఆధారపడటం. నేను సర్వసమృద్ధి లేదా స్వయం సమృద్ధి గలవాడను కానని నా వివాహం నాకు నేర్పింది. నాకు భార్య కావాలి. నాకు ఆమె మద్దతు, అంతర్దృష్టి, వివేచన, సలహా, ప్రేమ, ఉనికి మరియు సమర్థత అవసరం. ఆమె నా ఊతకర్ర కాదు. . . కానీ ఆమె నాకు దేవుడిచ్చిన తోడు, నా మనోభావాలు మరియు నా అవసరాల గురించి ఎప్పుడూ ఎరిగి ఉంటుంది. ఆమె నా రహస్యాలను విని వాటిని గుప్తముగా ఉంచుతుంది. ఆమె నా తప్పులను తెలుసుకుంటుంది మరియు వాటిని క్షమిస్తుంది-ఎల్లప్పుడూ. ఆమె నా వైఫల్యాలు మరియు భయాలను తెలుసుకుంటుంది మరియు వాటిగుండా నన్ను ప్రోత్సహిస్తుంది. కొన్నేళ్లుగా, ఆమె అవసరం నాకుందనే విషయం గురించి సింథియాకు తెలియదు. మితిమీరిన ధైర్యంతో, జడిపిస్తూ, స్వార్థంతో-జీవితాన్ని ఒక రైలుబండిలా నడిపించాను. చివరకు, పగుళ్లు కనిపించడం ప్రారంభించాయి. ఇకపై వాటిని దాచడం సాధ్యం కాలేదు. నా బాధలను పంచుకోవడం మరియు నా అవసరాన్ని అంగీకరించడంలో ఉన్న విలువను ప్రభువు నాకు చూపించాడు. “నాదే తప్పు . . . నన్ను నిజంగా క్షమించు,” వంటి విషయాలు చెప్పడంలో నాకు విలువ తెలిసింది. అలాగే నేను పట్టువిడువకుండా ఉండటానికి నాకు ఎంత సహాయం చేస్తుందో మరియు ఆమెపై ఎంత ఎక్కువగా నేను ఆధారపడి ఉన్నానో అని నా భార్య యెదుటే చెప్పడం యొక్క విలువను గ్రహించాను.
“నువ్వు జీవితాన్ని నీ స్వంతంగా లోపరచుకోవలసిన అవసరం లేదు. నీ భాగస్వామి భర్తీ చేయలేనిది,” అని వార్షికోత్సవం మీకు గుర్తుచేస్తుంది.
కలలు. మీరు జంటగా ఊహించేవే కలలు మరియు దేవుడు వాటిని సఫలీకృతం చేయడం మీరు చూస్తారు. కొన్నిసార్లు అవి చిన్న విషయాలు కావచ్చు, కలిసి తోటలో పని చేయడం, కొన్ని గింజలను నాటడం మరియు వాటి మొలకలను చూడటం, ఆపై పండ్లను చూడటం వంటివి. లేదా పిల్లలలో ఒకరి గురించి కలిసి ప్రార్థించడం, అంటే దేవుడు వారి హృదయాన్ని పట్టుకొని వారి ఆత్మను మృదువుగా చేయాలని ఆయనను వేడుకోవడం. ఆ కల నెరవేరినప్పుడు, మీరు ఒకరినొకరు చూసుకుని సంతోషిస్తారు. ఒక్కొక్కసారి, పెద్ద విషయమైన కల ఉండొచ్చు-ఒక తప్పిపోయిన వ్యక్తి తిరిగి రావాలని లేదా పిల్లల దీర్ఘ అనారోగ్యం గుండా ఓర్పు కోసం నిరంతర ప్రార్థనకు పిలుపునిస్తుంది. అప్పుడప్పుడు, కల నిరంతర త్యాగం కోసం, పరస్పరం పంచుకోవడం కోసం పిలుపునిస్తుంది. కాలేజీలో ఉత్తీర్ణత సాధించటంలాగా. లేదా అప్పుల నుండి బయటపడటంలాగా. ఎట్టకేలకు వాస్తవికతలోనికి వచ్చినప్పుడు, ఆ సుదీర్ఘ ఆలింగనం యొక్క ఆనందాన్ని, ఆ లోతైన సాఫల్యం యొక్క చుంబనాన్ని ఏ పదాలు వర్ణించలేవు.
“మీరు కలిసి గడిపిన కలల గురించి ఆలోచించండి. అవి సన్నిహిత విజయాలు,” అని
వార్షికోత్సవం మీకు గుర్తుచేస్తుంది.
జ్ఞాపకాలు, మార్పులు, ఆధారపడటం మరియు కలల యొక్క అందమైన కలయికే వార్షికోత్సవాలు. మాది జూన్ 18, 1955 నాటిది, ఒక జంట, “నేను అంగీకరిస్తున్నాను” అని చెప్పి, మా ముందు ఎలాంటి భయానక తుఫానులు వస్తాయోనని లేదా చెప్పలేని ఆనందాలు మమ్మల్ని కలుపుతాయోననే ఆలోచన లేకుండా . . . జీవితాంతం ఒకరికొకరు కట్టుబడి ఉన్నారు.
మా వివాహంలో సగానికి పైగా-ఖచ్చితంగా చెప్పాలంటే ముప్పై ఐదు సంవత్సరాలు-సింథియా మరియు నేను ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్‌లో అద్భుతమైన ప్రపంచవ్యాప్త బృందంతో భాగస్వాములుగా పనిచేశాము. దాని గురించి ఆలోచించండి, ఈ నెలలో మా పరిచర్య కూడా వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది-ముప్పై ఐదు సంవత్సరాలు!
నేను కృతజ్ఞత గల భర్తను. వివాహం యొక్క ప్రణాళిక మరియు పులకరింతతో నేను ఇష్టపడే వారితో ఏటా జరుపుకోవడాన్నిబట్టి దేవుడు స్తుతింపబడునుగాక. నేను కృతజ్ఞతగల బోధకుడిని. ఈ గొప్ప-పెద్ద ప్రపంచమంతటా ఆయన సత్యాన్ని ప్రకటించడానికి ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్‌లో మనకు లభించిన అద్భుతమైన ప్రణాళిక మరియు అద్భుతమైన ఘనత విషయమై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
Copyright © 2015 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.