హెబ్రీయులకు 11:8-10
యాభై సంవత్సరాల క్రితం, సింథియా నాకు సరైన జోడు అనే నమ్మకం మా తల్లిదండ్రులకు లేదు. వారు సద్భావముతోనే చెప్పారు, కానీ ఆ విషయంలో, వారు పొరపాటుపడ్డారు. నేను వారి మాటలు విని ఉంటే, నేను వివాహం చేసుకోవలసిన స్త్రీని వివాహం చేసుకొని ఉండేవాడిని కాదు.
మేము ఇటీవల మా యాభైవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము.
సరే, వారు విశ్వాసులైతే మరియు వారు దేవునితో నడచుచున్నట్లయితే, తల్లిదండ్రులు సాధారణంగా చాలా విషయాలలో మంచి సలహాదారులుగా ఉంటారు. కానీ వాళ్ళేమీ దేవుడు కారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు సంకుచిత మనస్తత్వం గలవారు మరియు స్వార్థపరులు కావచ్చు. ఇది మిగిలిన కుటుంబ సభ్యుల విషయంలో కూడా వర్తిస్తుంది మరియు కొన్నిసార్లు మీ రక్త సంబంధికులే మీరు దేవుని చిత్తానికి విధేయత చూపే విషయంలో మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు. వారు మీ జీవిత నిర్ణయాలతో ఏకీభవించనప్పుడు వారు కటువుగా లేదా కోపంగా కూడా మారవచ్చు. కానీ విశ్వాస సంక్షోభం సంభవించినప్పుడు, విశ్వాసం మరియు విధేయత గెలవాలి. విడుదల చేయడం మరియు తెగించడం అవసరం. ప్రప్రథమముగా మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి. అది విధేయత 101 (అంటే విధేయత యొక్క మొట్టమొదటి పాఠం)!
విశ్వాసమే గాని, వెలిచూపు ఇక్కడ పనిచేయదు. మీ నిర్ణయాలను దేవుని మీద వదిలేయండి, ఆయన మీ జీవితం కోసం తన ప్రణాళికను అమలు చేస్తున్నాడనే ధైర్యంతో నెమ్మది కలిగియుండండి, అలాగే ఆయనే మీ కుటుంబ విషయాలను సరిచేస్తాడు.
మనం ఎవరిపట్ల నమ్మకంగా ఉండాలో ఆయనే కుటుంబాన్ని కనిపెట్టాడు!