ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును, . . .
ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు;
ఆమె పెనిమిటి ఆమెను పొగడును. (Proverbs 31:27-28)
మాతృత్వానికి అవసరమైనది ఏమిటి? స్వచ్ఛమైన దయ, ప్రామాణికమైన ఆత్మీయత, అంతర్గత విశ్వాసం, నిస్వార్థ ప్రేమ మరియు స్వీయ నియంత్రణ. పెద్ద జాబితానే, కదా? మనం ఊహించిన దానికంటే పెద్దదే. మాతృత్వానికి 180 కదిలే భాగాలు మరియు 3 జతల చేతులు మరియు 3 సెట్ల కళ్ళు అవసరమని ఎర్మా బాంబెక్ ఎందుకు చెప్పారో బహుశా అది వివరిస్తుంది . . . మరియు, దేవుని దయను నేను దీనికి చేర్చవచ్చు. మీరు తల్లి అయితే, మీ ప్రతి ప్రయత్నాన్ని మెచ్చుకునే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మీరు చేసే ప్రతి పనికి హర్షధ్వానాలు చేస్తున్నాను! . . .
ది వెల్వెటీన్ రాబిట్‌లోని స్కిన్ హార్స్ గుర్తుందా? ఆ స్కిన్ హార్స్ బొమ్మ పాడైపోతూ తనలో ఉన్నదంతా ఊడిపోవడం ప్రారంభించింది, తన వెంట్రుకలు ఊడిపోయి “ప్రేమించబడటంలేదు,” కానీ అతను ఎంత విలువైనవాడు! . . . మృదువైన తల్లులకు నిర్భయముగానున్న పిల్లలు ఉండరు. మృదువైన, ముట్టుకుంటే కందిపోయే “సున్నితమైన తల్లులు” బలహీనమైన, స్వార్థపూరితమైన, తాకితే కందిపోయే పిల్లలనే అందిస్తారు. కానీ నిస్వార్థమైన, ఔదార్యమైన, నిర్భయమైన తల్లులు ఏదో ఒకవిధంగా ఆరోగ్యవంతమైన, పరిపూర్ణమైన పిల్లలను మన ఒంటరి, భయానక సమాజానికి సమర్పిస్తారు.
Taken from Charles R. Swindoll, Wisdom for the Way: Wise Words for Busy People (Nashville, Tenn.: J. Countryman, 2001), 23.