నాయకత్వం ప్రభావితం చేస్తుంది. మనం ఇతరులను ప్రభావితం చేసేంత మేరకు వారిని నడిపిస్తాం. లార్డ్ మోంట్‌గోమెరీ దీనిని సూచిస్తూ ఈ విధంగా వ్రాశాడు . . .
నాయకత్వం అనేది పురుషులు మరియు స్త్రీలను ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం సమీకరించే సామర్థ్యం మరియు సంకల్పం అలాగే విశ్వాసాన్ని ప్రేరేపించే స్వభావం కలిగియుండటం.
ఈ విధంగా చేసిన చాలా మంది గొప్ప వ్యక్తులను, అనగా సైనిక సిబ్బంది, అథ్లెటిక్ కోచ్‌లు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వర్తకులు లేదా ఆత్మీయ అధికారులను మనం పేర్కొనవచ్చు. వారి జీవితాల యొక్క ఫలితాలను ప్రభావం ఉత్తమంగా వివరిస్తుంది.
స్వతహాగా నాయకులైన వారిలో సాధారణంగా కనిపించే కొన్ని ప్రామాణిక లక్షణాలు లేదా ప్రత్యేకతలను పేర్కొనమని నన్ను అడిగితే, నేను ఈ క్రింది జాబితాను ఇస్తాను:
ఉత్సాహము
పట్టుదల
పోటీతత్వం
అంతర్దృష్టి
స్వాతంత్ర్యం
సాహసోపేతము
నిర్ణయాత్మకత
వశ్యత
హాస్యాన్ని ఆస్వాదించే గుణం
ఆచరణాత్మకత
ఆశావాదంఆశయం
జ్ఞానం
జిజ్ఞాస
స్నేహశీలత
భద్రత
చిత్తశుద్ధి
క్రమశిక్షణ
సృజనాత్మకత
సమభావము
దూకుడు
ఇవి “స్వతహాగా” నాయకులైన వారిలో కనిపించే ప్రామాణిక లక్షణాలు అని ఎవరూ కాదనలేరు. కానీ నా ప్రశ్న ఏమిటంటే: “ఆత్మీయ” నాయకులలో కూడా ఈ లక్షణాలు అవసరమా? మీరు వెంటనే సమాధానం చెప్పే ముందు, “సహజమైన” నాయకత్వ పరీక్షలో పేలవంగా ప్రదర్శించిన కొంతమంది బైబిల్ నాయకులను నేను మీకు సూచిస్తాను. నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే, మనం విస్మరించే వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నాడు!
వెనక్కి మరలుతూ, అభద్రతతో, భయముతో, అనుమానముతో ఉన్న మోషే గురించి ఏమంటారు? (నిర్గమకాండము 3:10-4:14 చదవండి.) మొరటువాడైన, వ్యతిరేకించువాడైన, సిద్ధపాటులేనివాడైన, అనావశ్యకమైనవాడైన, నిశ్చితాభిప్రాయంగలవాడైన, మేడిపండ్లు ఏరుకొనువాడునైన ఆమోసు? (ఆమోసు 7:10-17లో అతనితో పరిచయం పెంచుకోండి.) అలాగే తరచుగా మూర్ఖముగా మాట్లాడుచూ, ఉద్రేకపూరితమైన, హ్రస్వ దృష్టిగల, అతిశయపడే పేతురును మనం మరచిపోలేము!
ఈ పురుషులకు నాయకత్వానికి సంబంధించిన సహజ లక్షణాలు లేవని నేను సూచించడం లేదు-కానీ మనం సాధారణంగా “ఆదర్శ నాయకుడు” గా వర్గీకరించే మూస పద్ధతికి స్వస్థి పలికారు. దేవుని శేష నాయకులు తరచుగా వెట్టి చాకిరి చేసి అలసిపోయినవారు . . . ప్రభువైన యేసుక్రీస్తును నిర్విరామంగా ప్రేమించే మరియు ఆయనకు మరియు ఆయన చిత్తానికి అపురూపంగా అందుబాటులో ఉండే నూతన ఆలోచనలు, వ్యప్తిలోనున్న కట్టుబాట్లవైపు తిరుగక, విచిత్రంగా కనిపించే స్వభావములతో రూపొందించబడతారు. ఈ వ్యక్తులు (మరియు మీరు ఒకరు కావచ్చు!) విశ్వాసం, దివ్యదృష్టి, బోధించే సామర్థ్యం, సంకల్పం మరియు ప్రేమ అనే ప్రాథమిక పదార్ధాలను కలిగి ఉంటారు-మరియు వారు ప్రపంచాన్ని మార్చడంలో పాల్గొంటారు.
దేవుడు ఈ గ్రహాన్ని పురుషులు మరియు స్త్రీల కోసం వెతుకుతున్నాడని నేను చదివినప్పుడు (దయచేసి ఒకసారి ఆగి, 2 దినవృత్తాంతములు 16:9 మరియు యెహెజ్కేలు 22:30 చదవండి), వారు సరిపోయేటటువంటి నిర్మాణాత్మకమైన, చక్కగా నిర్వచించబడిన చట్రాన్ని కలిగి ఉన్నట్లు నేను గుర్తించలేదు. నిజానికి, దేవుడు అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించిన వారిలో కొందరిని మీరు ఊహించగలిగే వారు విచిత్రముగా రూపొందించబడ్డారు. మీరు దీన్ని అనుమానించినట్లయితే, అదుల్లాము గుహలో దావీదును చుట్టుముట్టిన 400 మంది అప్పులు చేసికొనిన వారందరినీ మరియు అసమాధానముగా నుండిన వారినందరినీ చూడండి (1 సమూయేలు 22:1-2). దావీదు జీవితంలోని సమతౌల్యం ద్వారా ఈ వ్యక్తులను గుర్తించడానికి నేను అసాధారణంగా సవాలు చేయబడ్డాను మరియు వీరు అతని శ్రేష్టమైన, సాహసోపేతమైన పోరాట యోధులుగా మారారని తెలుసుకున్నాను-మీకిష్టమైతే, వీరు శూరులు-వీరి నుండి అనేక మంది నాయకులు ఉద్భవించారు.
మీరు నా ఉద్దేశ్యాన్ని ఊహించారని నేను నమ్ముతున్నాను. దేవునిలా మనం కూడా స్వష్టంగా, సరళంగా, సహనంతో ఉందాం! బహుశా మీరు అందరిలా కాకపోవచ్చు. మీరు ఒక ఎజెండాకు కట్టుబడి ఉండకపోవచ్చు, కాబట్టి మీరు “నేను దేవునికి ఉపయోగపడను-నేను క్రైస్తవ నాయకత్వంలో ఎన్నటికీ నాయకుడిని కాలేను” అని ఆలోచించడం మొదలుపెట్టారేమో. నిరుత్సాహపడిన విశ్వాసీ, ధైర్యంగా ఉండు! మీలో ఇతరులు సొంతంగా ఆలోచిస్తున్న మీ పిల్లలను అలక్ష్యం చేస్తున్నారని నేను అనుమానిస్తున్నాను. వినండి, వారు లక్ష్యం వైపు పరుగెడుతూ ఉండవచ్చు. మీ యొక్క యువకుడికి మాత్రమే దేవుడు విశిష్టమైన, ప్రత్యేకమైన నాయకత్వ పాత్రను సిద్ధముచేసి ఉండవచ్చు. తల్లిదండ్రులారా, పట్టు విడువవద్దు! ఈ యువకులు కొంతమంది పెద్దలకు వింతగా కనిపించవచ్చు మరియు అనిపించవచ్చు . . . కానీ నేను నిట్టూర్పు విడిచి ఎందుకు అని అడగను. మనకు తెలిసినంతవరకు, దేవుడు వారి నాయకత్వం ద్వారా ఏదైనా గొప్ప పని చేయబోతున్నాడు.
మీకు భరోసా ఇవ్వనివ్వండి-పెద్దలందరూ ముప్పై సంవత్సరాల క్రితం ఒక యువ, విసుగు పుట్టించే, దూకుడు, దృఢ సంకల్పం కలిగిన యువకుడిని అలక్ష్యం చేసి ఉంటే . . . ఈ వ్యాసం ఎప్పటికీ ఉనికిలో ఉండేది కాదు.
Taken from Charles R. Swindoll, Growing Strong in the Seasons of Life (Grand Rapids, Mich.: Zondervan Publishing House, 1983) 408. Copyright © 1983 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.