ఆరుగురి సమూహమైన మేము అక్కడ కూర్చున్నాము. మా బల్ల మధ్యలో ఒక నారింజ రంగు కొవ్వొత్తి వెలుగుతుండగా, మా ముఖాల మీద నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకరు మాట్లాడుతున్నారు; ఐదుగురు వింటున్నారు. ప్రతి ప్రశ్న ఎంతో సౌమ్యతతో, ఎంతో నెమ్మదిగా నిర్వహించబడింది-ప్రతి సమాధానం లోతైన వివేకం నుండి తీయబడింది, కఠినమైన నిర్ణయాల ద్వారా రూపం ఏర్పరచబడింది, కాలముచేత బోధించబడింది. అలాగే బాధ. అలాగే తప్పులు మరియు నిందలు. పరీక్షలు, సంకటములు, హృదయవిదారకములు మరియు వైఫల్యాల ద్వారా మెరుగుపరచబడ్డాయి. అతి తీవ్రమైన పరీక్షల్లో దశాబ్దాలు ఉండటం వలన ఈ వ్యక్తి యొక్క బోధన అమూల్యమైనదిగా తయారైయ్యింది.
అతని వయస్సు? డెభ్బై రెండు. మంద యొక్క అన్ని విమర్శలు మరియు ఆనందములు-అతను వాటన్నింటినీ ఎదుర్కొన్నాడు. అతను మోసపూరిత మరియు అత్యాశగల తరాల యొక్క అన్ని అభిరుచులు మరియు జిమ్మిక్కులను అధిగమించాడు. జీవితాలు విప్లవాత్మకంగా మారడం చూసిన పారవశ్యం, అలాగే నాశనమైన జీవితాల వేదన మరియు జీవితాల హృదయ విదారకమైన మార్పులేని ఏకరూపత అతనికి తెలుసు. అతను కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుకున్నాడు-దానిని నిరూపించడానికి గాయముల గుర్తులు ఉన్నాయి.
మేము అతని కథలను వింటూ, అతని సూత్రాలను గూర్చి ఆలోచిస్తూ మరియు అతని తీర్మానాలను పరిశీలిస్తూ మూడు గంటలకు పైగా కూర్చున్నాము. సాయంత్రం క్రమానుగతంగా పగలబడి నవ్వటంతో విరామమయమైంది, ఆ తర్వాత సుదీర్ఘమైన నిశ్శబ్ద చర్చలు జరిగాయి. నేను పాల్గొన్నప్పుడు, అకస్మాత్తుగా, నాకు మళ్లీ ఇరవై ఆరేళ్లు వచ్చినట్లు అనిపించింది–కోరికలతో నిండిన హృదయం మరియు కలలతో నిండిన తల మధ్య ఎవరూ లేని ప్రదేశంలో ఉన్న ఒక యువ సెమినేరియన్ మరియు పాస్టోరల్ ఇంటర్న్‌లా ఉన్నాను. వేదాంత సిద్ధాంతాలపై ఎక్కువ సమయం ఉంది కానీ ఆచరణాత్మక అనుభవం తక్కువగా ఉంది, ఎవరూ అడగని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి కానీ నిజంగా ముఖ్యమైన విషయాల గురించి అవగాహన లేదు. నాకు మార్గదర్శకుని అవసరం చాలా ఉంది.
కాలక్రమ వ్యత్యయంలో, ముప్పై సంవత్సరాల క్రితం నేను ఈ వ్యక్తితో ఒకే గదిలో అదే బావి వద్ద తాగడం, అదే స్ఫూర్తిని నింపుకోవడం చూశాను. ముప్పై సంవత్సరాల క్రితం, రే స్టెడ్‌మాన్ నా ఆదర్శం; ఇప్పుడు అతను నా మార్గదర్శకుడు అయ్యాడు.
వ్యక్తులు యవ్వనంగా మరియు ప్రతిభావంతులుగా ఉన్నప్పుడు, వారు అహంకారం మరియు కొన్నిసార్లు అపక్వమైన స్వాభిప్రాయం వైపు మొగ్గు చూపడం అత్యంత సాధారణ ధోరణి అని నేను కనుగొన్నాను. దాదాపు మినహాయింపు లేకుండా, నేను వ్యక్తులలో అహంకారాన్ని గుర్తించినప్పుడు, వారు మార్గనిర్దేశం చేయబడలేదని నేను అనుకుంటున్నాను. మార్గదర్శకత్వం దారి తప్పకుండా నిరోధించగలదు. మంచి మార్గదర్శకత్వం పొందిన స్వీయ-ముఖ్యమైన, గర్విష్ఠుడైన వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు. అహంకారం మార్గదర్శకత్వమును తట్టుకోలేదు. ఒక మార్గదర్శకుడు లోపాలను ఎత్తి చూపి, మీ అహంకారం గురించి మిమ్మల్ని ప్రతిఘటించాల్సిన అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని మందలిస్తాడు. ఒక మార్గదర్శకుడు వెనక్కి తగ్గడు. ఒక మార్గదర్శకుడు శ్రేష్ఠత కోసం కనికరం లేకుండా ఒత్తిడి చేస్తాడు. ఒక మార్గదర్శకుడు మీ వ్యక్తిత్వం గురించి పట్టించుకుంటాడు.
అది రే స్టెడ్‌మాన్. పూర్తిగా మానవుడు మరియు పూర్తిగా ప్రామాణికుడు, అతను యజమాని యొక్క ఉపయోగానికి సరిపోయే అర్హమైన పాత్రగా ఉద్భవించాడు. మరియు ఆ రాత్రి ఆ చిన్న నారింజ కొవ్వొత్తి చుట్టూ, రే యొక్క నీడ నా జీవితాన్ని దాటినందుకు నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను.
రే నా మొదటి మార్గదర్శకుడు కాదు-అతను చివరివాడు కూడా కాదు. నేను హైస్కూల్ ప్రారంభించినప్పుడు, నేను ఒక వాక్యాన్ని పూర్తి చేయలేనంతగా నత్తిగా మాట్లాడేవాడిని. నేను ప్రేక్షకుల ముందు ఉండకూడదనేదే నా చివరి కోరిక! వ్యత్యాసమును ఎవరు తీసుకొచ్చారో తెలుసా? డిక్ నీమ్ అనే మార్గదర్శకుడు.
నేను మెరైన్ కార్ప్స్‌లో విదేశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు మరియు నేను పెళ్ళిచేసుకున్న నా క్రొత్త భార్య నుండి నేను ఇష్టం లేకుండా విడిపోయాను, నేను స్వీయ దృష్టితో, నిరుత్సాహానికి గురయ్యాను, ఒంటరిగా ఉన్నాను మరియు నిరుత్సాహపడ్డాను. పదిహేడు నెలల తర్వాత, నేను రూపాంతరం చెంది ఇంటికి తిరిగి వెళ్లాను . . . మరియు పరిచర్య పట్ల మక్కువ తగ్గి వెళ్లాను. వ్యత్యాసాన్ని సృష్టించినది ఎవరు? బాబ్ న్యూకిర్క్ అనే మార్గదర్శకుడు.
నా మార్గదర్శకుల్లో మరొకరు, డాక్టర్ హోవార్డ్ హెండ్రిక్స్, ప్రతి క్రైస్తవుని జీవితంలో కనీసం ముగ్గురు వ్యక్తులు అవసరమని చెప్పారు. మనకంటే ముందు వచ్చిన వ్యక్తి మనకు మార్గదర్శకత్వం వహించాలి. మన భారాన్ని పంచుకునే మన ప్రక్కన మరొకరు కావాలి. మరియు మనం మార్గనిర్దేశం చేస్తున్న మన తర్వాతి తరమువారు కావాలి. లేకపోతే, మనము స్తబ్ధుగా ఉండిపోతాము.
మీ సంగతి ఏమిటి? ఈరోజు తమ శ్రేష్ఠమైన స్థితి దూరమైపోయి పనికిరామని భావించే వారికి నేను వ్రాస్తున్నానా? ప్రభావితం చేయడానికి ఎవరూ మిగిలి లేని ముసలివారు ఎవరైనా ఉన్నారా? నేను మీకు భరోసా ఇస్తున్నాను: మీరు ఏమీ లేనిదాని కోసం ఇంత కాలం జీవించలేదు! దేవుని కుటుంబంలో మీ సమయం కోసం తహతహలాడే . . . జ్ఞానం అవసరమున్న . . . వారిపై వ్యక్తిత్వం యొక్క ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్న విశ్వసనీయ మార్గదర్శకుని కోసం ఆశపడే యువ తరం ఉంది.
ఇంత దృఢ నిశ్చయంతో ఇలా ఎందుకు చెప్తున్నాను? రెండు కారణాలు. మొదటిది, ఇది బైబిల్‌కి సంబంధించినది. తిమోతికి పౌలు వ్రాసిన చివరి లేఖలో, మనం ఈ మాటలు చదువుతాము: “నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము” (2 తిమోతికి 2:2). అప్పగింపుము అంటే “ఎవరికైనా ఏదోయొకటి . . . భద్రంగా కాపాడమని ఇవ్వటం.” నాకు ఈ భావన నచ్చింది. ఇతరుల జీవితాలపై నమ్మకంగా మనం సత్యాన్ని పెట్టుబడి పెడతాము. మనం ఇతరులకు అందించే విలువైన సందేశాన్ని కలిగి ఉన్నాము. అపొస్తలుడైన పౌలు తన హృదయాన్ని, ఆత్మను, సత్యాలను, ఘర్షణలను, ప్రోత్సాహాలను, ధృవీకరణలను—తన జీవితాన్ని—తిమోతికి అప్పగించాడు.
నేను మార్గదర్శకత్వాన్ని నమ్మడానికి రెండవ కారణం నేను దాని ఫలితాన్నే. నేను ప్రస్తావించిన ఈ వ్యక్తులు-అలాగే మరికొంతమంది-నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చారు. నేను చూడని చోట వారు నా సామర్థ్యాన్ని చూశారు. నేను ఎత్తు ఎదగాలని వారు నన్ను ప్రోత్సహించారు. వారు నన్ను మందలించారు మరియు సరిదిద్దారు. వారు నా “లోపముల” ను ఎత్తి చూపారు. నేను ఏమి అవ్వాలనుకున్నానో దాన్ని వారు ఆదర్శంగా చూపారు. నేనే మార్గదర్శకునిగా ఉండాలనే తపన నాలో తీసుకొచ్చారు. మార్గనిర్దేశం చేయబడిన ఫలితంగా, నేను గాయము పడదగిన వానిగా, నిష్కపటముగా, కావలిలేనివానిగా మరియు నిజాయితీగా–యథార్థతగల వ్యక్తిగా ఉండటం యొక్క విలువను నేర్చుకున్నాను.
ఇరవై సంవత్సరాల క్రితం రే స్టెడ్‌మాన్‌తో ఆ సాయంత్రాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రాత్రి రేకు వీడ్కోలు పలుకుతూ, కొంచెం నెమ్మదిగా నడిచాను. నాకు సూటిగా ఉపదేశించకుండా అతను నాకు నేర్పించిన విషయాలు, ఉద్దేశపూర్వకంగా నన్ను ప్రోత్సహించకుండా అతను నాకు ఇచ్చిన ధైర్యం గురించి ఆలోచించాను. నేను అతని కారు వద్దకు తిరిగి పరుగెత్తాలనుకున్నాను మరియు నేను అతనిని ఎంతగా ప్రేమిస్తున్నానో మరియు ఆరాధిస్తున్నానో మళ్లీ చెప్పాలనుకున్నాను-నా మార్గదర్శకుడు. నేను అలా చేసి ఉంటే బాగుండేది.
మరియు నేను ఆ చల్లని రాత్రి గాలిలో ఒంటరిగా నిలబడి ఉన్నప్పుడు, నేను పెద్దయ్యాక నేను ఏమవ్వాలనుకున్నానో అకస్మాత్తుగా గ్రహించాను.
Copyright © 2013 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.