మీరు ఇలాంటి ప్రకటనకు వ్యతిరేకంగా వాదించాలనుకున్నప్పటికీ, మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా అందులో ఒక ఉద్దేశం ఉన్నది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను పెంచడం, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న యౌవనస్థునికి మార్గదర్శకత్వం చేయడం లేదా వ్యక్తిగత దీర్ఘకాలిక బాధను భరించడం వంటివాటిలో చాలామంది ఏకాంత మార్గము గుండా వెళతారు, దీనిని నేను “గుహ” అని పిలుస్తాను.
“గుహ” ను ఒక దృశ్యముగా భావించండి. మీరు దానిని ఎలా వర్ణిస్తారు? నేను చుట్టూ పదునైన రాళ్లతో తడిగా, మురికిగా మరియు చీకటిగా ఉన్న ప్రదేశాన్ని చిత్రీకరిస్తున్నాను. భూమిపై ఎవరైనా అలాంటి ప్రదేశానికి వెళ్లడానికి ఎందుకు ఎంచుకుంటారు! మనలో చాలామంది ఎంచుకోరు. అయితే, మనలో కొందరు మనం రక్షించబడాలనే ఆశ లేకుండా చీకటిగా, దీర్ఘకాలంగా మరచిపోయిన గుహలోకి విసిరివేయబడినట్లుగా భావిస్తాము. ఒక గుహలో మనల్ని మనం కనుగొన్నప్పుడు మనం ఏమి చేయగలం?
క్రింద చెప్పబడిన మూడు కాలాతీత సత్యాలను చార్లెస్ ఆర్. స్విండాల్ రచించిన గ్రేట్ డేస్ విత్ ది గ్రేట్ లైవ్స్‌లో చూడవచ్చు. చక్ నుండి ఈ మాటలు ఒక గుహ వాస్తవానికి జన్మస్థలం కాగలదని చూడటానికి మనకు సహాయపడతాయి, ఇది మీ ఆత్మను బంధించినవాటి నుండి విముక్తిని ఇవ్వడానికి మరియు మీరు మారడానికి మీకు అవకాశాన్ని అందిస్తుంది. గుహలు ఏమై ఉన్నాయో తెలుసుకోండి, అలాగే ప్రతి గుహ ముఖద్వారం వద్ద మీరు వెలుగు మరియు ఉపశమనం పొందవచ్చని గుర్తుంచుకోండి. చక్ ఈ విధంగా వ్రాశారు:
మొదటిది, సమర్థవంతమైన పరిచర్య కోసం దేవుడు మనల్ని సిద్ధం చేసినప్పుడు, మనం విడిచిపెట్టేవాటిని ఆయన చేర్చుతాడు—నిరీక్షణ కాలం. అది సహనాన్ని పెంపొందిస్తుంది. నేను ఈ మాటలు వ్రాసేటప్పుడు, నేను లేతవయస్సుతో మరియు సహనంతో ఎవరినీ కలవలేదని నాకు స్ఫురిస్తుంది. (నిజాయితీగా చెప్పాలంటే, నేను అనేకమంది వృద్ధులను మరియు సహనము కలిగినవారిని కూడా కలవలేదు.) మనమందరం తొందరలో ఉన్నాము. గుండ్రంగా తిరిగే తలుపు యొక్క ఒక్క ఫలక కూడా కోల్పోవడం మనకు ఇష్టం లేదు. తొందరపాటుతో కూడిన సమాజంలో సహనం కష్టమవుతుంది. అయినప్పటికీ, ఇది ఒక ముఖ్యమైన లక్షణం, ఇది పొడిగించబడిన నిరీక్షణ కాలంలో మాత్రమే వృద్దిపొందించబడుతుంది.
రెండవది, దేవుడు మనలను నిరీక్షించేలా చేసి, మనలను తన నీడలో దాచిపెట్టినప్పుడు, మనం అనివార్యమైనవారము కాదని ఆయన మనకు తెలియజేస్తాడు. అది మనల్ని అణకువగా ఉండేటట్లు చేస్తుంది. మనం ప్రధాన ఆకర్షణ కాదని మనకు గుర్తు చేయడం కొరకు ప్రభువు మనలను నివారించి ఆయన నీడలో వేచి ఉండునట్లు చేయడానికి ఒక ప్రధానమైన కారణం. మనము అనివార్యమైనవారము కాదు. ఆ గ్రహింపు నిజమైన వినయాన్ని పెంపొందిస్తుంది. తనపై కాకుండా పేతురు మరియు బర్నబాపై తన హస్తము ఉంచినందుకు సౌలు దేవుడిని ఎన్నడూ ప్రశ్నించలేదని నేను నమ్ముతున్నాను. చాలామంది ప్రతిభావంతులైన వ్యక్తులు పునరుజ్జీవన ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛందంగా పని చేసే సమయంలో, సౌలు ఇష్టపూర్వకంగా తెర వెనుక ఉండిపోయాడు. ఆ సమయంలో అతని సమయం కొరకు–దిద్దుబాటు, దేవుని సమయం కొరకు వేచి ఉన్నాడు.
మూడవది, దేవుడు మనలను దాచిపెట్టినప్పుడు, ఆయన తన యొక్క క్రొత్త కోణాలను మరియు పరిచర్యకు సంబంధించిన క్రొత్త అంతర్దృష్టులను వెల్లడిస్తాడు. అది మనల్ని లోతైన ఆలోచనగలవారలనుగా చేస్తుంది. ఈ రోజు మనకు కావలసింది తెలివిగల వ్యక్తులు లేదా బిజీగా ఉన్న వ్యక్తులు కాదు. చాలా ఎక్కువ అవసరం లోతైన ఆలోచనగల వ్యక్తులు. లోతైన ఆలోచనగల వ్యక్తులకు ఎల్లప్పుడూ పరిచర్య ఉంటుంది. ఎల్లప్పుడూ. ఆయన కోసం వేచి ఉన్న సమయం ద్వారా దేవుడు మనలను వృద్ధిచేస్తాడు.1
- Charles R. Swindoll, Great Days with the Great Lives (Nashville: W, 2005), 309.