మీకు వర్తించే ఏడు నాయకత్వపు పాఠాలు

చాలా మంది వ్యక్తులు నాయకుడు అనే పదాన్ని విన్నప్పుడు వారు అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, పాస్టర్లు, ఉపాధ్యాయులు మరియు CEO లను గురించి ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ మంది తమ గురించి ఆలోచిస్తారు. అయితే, ఇది నిజం. నువ్వు ఒక నాయకుడవే. క్రైస్తవునిగా, నువ్వు క్రీస్తు కొరకు ప్రభావశీలునిగా, ప్రభువు కొరకు రాయబారిగా మరియు దేవుని కృపాసువార్త కొరకు మార్పు-ప్రతినిధిగా ఉన్నావు. నిజానికి, నెహెమ్యా గ్రంథంలో మీకు వర్తించే నాయకత్వానికి సంబంధించిన ఏడు సూత్రాలను నేను […]

Read More

మనందరికీ అవసరమైన ఒక వ్యక్తి (మరియు మనం ఆ వ్యక్తిలా ఉండాలి)

“చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, సూచనలను చదవండి.” ఆ చిన్న, ఐదు పదాల హెచ్చరిక ప్రతి ఎలక్ట్రిక్ రైలు సెట్‌మీద, ప్రతి ప్లాస్టిక్ మోడల్‌ మీద, రెండు-టన్నుల ప్యాకేజీలో అమర్చబడిన ప్రతి ఉయ్యాల మీద, ప్రతి హైటెక్ పరికరం మీద-విడదీయబడిన లేదా విద్యుత్ అవసరమయ్యే దేనిమీదనైనా కనిపిస్తుంది. ఇది మీకు వర్తించదని నటించే ప్రయత్నం చేయవద్దు! నాలాగే, మీరు కూడా ప్రమాదకరముకాని కిట్‌ని చూసి, కాసింత ఇంగితజ్ఞానం ఉంటే సరిపోతుందని అనుకొని, సూచనల పుస్తకా‌న్ని పక్కన పడేశారనడంలో నాకు […]

Read More

వినూత్న ప్రణాళిక

ఆదికాండము 47:1-26 చదవండి. యోసేపు దగ్గర ఒక వినూత్న ప్రణాళిక ఉంది, అది ఇంతకుమునుపెన్నడూ అమలు చేయనిది. “భూమి ఫలించాలంటే, మనం ఈ భూమిపై విస్తరించాలి,” అని అతను చెప్పాడు. దీనికి ముందు వారు కొన్ని బాగా జనాభా ఉన్న ప్రాంతాలలో మాత్రమే స్థిరపడ్డారు. ఆ స్థలాలు వారి గృహాలు, వారి పని, వారి పొలాలు మరియు వారి పరిసరాలను సూచించాయి. వాటన్నింటినీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కొంత అమ్మవలసి వచ్చింది–చాలామట్టుకు ఒప్పించాల్సి వచ్చింది. కానీ […]

Read More

తప్పిపోయిన పరిశుద్ధులను ఎలా దారిలోనికి తీసుకురావాలి

మీరు ఎప్పుడైనా మునిగిపోతున్న వ్యక్తిని రక్షించారా? అలా అయితే, అదుపు తప్పిన ఆ భయానక క్షణంలో బాధితులు తమను రక్షించువారితో తరచుగా ఎలా పోరాడతారో మీకు తెలుసు. తమ విశ్వాసపు నావ బద్దలైపోయి ఆత్మీయంగా తల్లడిల్లుతున్న వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అదే తరచుగా జరుగుతుంది. ప్రభువు నుండి దూరమయ్యి, చివరకు తనను నిజంగా ప్రేమించిన స్నేహితుడి సహాయంతో తిరిగి దారిలోకి తీసుకురాబడ్డ ఒక యువకుడి కథను రచయిత మరియు ఉపాధ్యాయుడైన హోవార్డ్ హెండ్రిక్స్ చెప్పారు. […]

Read More

నిజమైన జట్టుకృషి: అవసరమైన నైపుణ్యము మరియు వ్యక్తిత్వము

యు.ఎస్. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ యొక్క జీవితకాల ఆరాధకుడిగా, నేను ఆయన గురించి ఎన్నో జీవిత చరిత్రలను మ్రింగివేసాను. డోరిస్ కియర్స్ గుడ్‌విన్ రాసిన టీం ఆఫ్ రైవల్స్ వాటిల్లో అత్యుత్తమమైనది. ఈ పుస్తకంలో తనకు వ్యతిరేకంగా పోటీచేసిన వారిని లింకన్ తన మంత్రివర్గంలోకి చేర్చుకునే అద్భుతమైన రాజకీయ చర్యను కనబరచాడు. పదమూడవ సవరణ యొక్క సాధ్యతను విశ్వసించని ఒక బృందం తన చుట్టూ ఉన్ననూ మరియు యుద్ధాన్ని త్వరగా ముగించడానికి దక్షిణాదితో రాజీ పడమని తన […]

Read More

మూడు సెకన్ల విరామం

స్వీయ నియంత్రణ అని పిలువబడే ఈ క్రమశిక్షణను ఆచరిస్తే నియంత అవ్వాలనే కోరికను నిరోధిస్తుంది. క్రీస్తు లేని వ్యక్తి మీద కోరికలు ఆదేశిస్తాయి మరియు అతను లేదా ఆమె పాటిస్తారు. క్రీస్తులో ఉన్నవారు, ఆయన ఆత్మ యొక్క అధికారం క్రింద నివసిస్తూ, ఆయన చేత పాలించబడుతూ ఉన్నవారు, ఒకప్పటి శక్తివంతమైన ఈ నియంతను ధిక్కరించగలుగుతారు. తత్ఫలితంగా, ఇతరులు గమనించదగ్గ రూపాంతర మొందించు మార్పును మనం అనుభవిస్తాము. నాలుక విషయానికొస్తే, మనం నోటిమాట విషయమై సంయమనం పాటిస్తాము. మన […]

Read More

నాయకుల కొరకు ఏడు నిర్మాణాత్మక రాతిబండలు

నేను నెహెమ్యా కంటే నాయకత్వమునకు మంచి మాదిరి గురించి ఆలోచించలేను. నేను ఒకసారి కూర్చుని, రెండు గంటలు నెహెమ్యా గురించి చింతించాను, ఈ పురాతన యూదు నాయకుడు యెరూషలేము చుట్టూ గోడను పునర్నిర్మించేటప్పుడు నమోదు చేసిన విషయాలను సమీక్షించాను. నేను చదివినప్పుడు, అతని దినచర్య పత్రిక నాయకత్వ అంతర్దృష్టుల గని అని నాకు తెలిసింది. నెహెమ్యా యొక్క మొదటి ఆరు అధ్యాయాలు ప్రతి సంవత్సరం నాయకులందరూ, అలాగే నాయకులు అవ్వాలనుకున్న వారందరూ కూడా తప్పకుండా చదువవలసినదిగా నియమించాలి. […]

Read More

దేవుడు నమ్మదగినవాడు

ఎస్తేరు 2:10-20 చదవండి. శక్తిగల నాయకుల కోసం దేవుడు భూమిని చూసినప్పుడు, శరీర రూపంలో ఉన్న దేవదూతల కోసం ఆయన అన్వేషణలో లేడు. పరిపూర్ణులు ఒక్కరునూ లేరు గనుక, ఆయన ఖచ్చితంగా పరిపూర్ణ వ్యక్తుల కోసం వెతకడం లేదు. ఆయన మీలాంటి, నాలాంటి స్త్రీపురుషుల కోసం, మాంసం, ఎముక మరియు రక్తంతో రూపించబడిన ప్రజల కోసం వెదకుచున్నాడు. కానీ ఆయన ఎస్తేరులో కనుగొన్న లక్షణాల మాదిరిగా ఆ ప్రజలలో కూడా కొన్ని లక్షణాల కోసం చూస్తున్నాడు. దేవుడు […]

Read More

పరిచారకుని హృదయము కలిగిన నాయకులు

ఎస్తేరు 2:10-20 చదవండి. ఎస్తేరు నిరంతరం నేర్చుకొననిష్టముగల ఆత్మను ధరించుకొన్నది. “మొర్దకై–నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను . . . ఎస్తేరు మొర్దకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక యుండెను” (ఎస్తేరు 2:10, 20). ఈ ఆవేశపూరిత పోటీలో ఫైనలిస్ట్ అయినా, లేదా తరువాత, రాణి అయినా సరే, […]

Read More

సత్ప్రవర్తన: ఇది ఎప్పుడో భూస్థాపితమైపోయింది

సొలొమోను చెప్పిన మాటలను పరిశీలించండి: “యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, / కుటిలవర్తనుడు బయలుపడును” (సామెతలు 10:9). చదవడం కొనసాగించుటకు ముందు, ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ దీనిని చదవండి. యోబు తన కుటుంబాన్ని పెంచుకొని, వ్యాపార ప్రపంచంలో తనను తాను స్థాపించుకొని, వయస్సు మీదపడే సమయానికి, అతను “తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను” (యోబు 1:3). యోసేపు పోతీఫరు యొద్ద పరిచర్య చేయువాడాయెను, తరువాత పోతీఫరు కలిగినదంతటిమీదను విచారణకర్తగా నియమించబడెను (ఆదికాండము 39:5). […]

Read More