ఆదికాండము 47:1-26 చదవండి.
యోసేపు దగ్గర ఒక వినూత్న ప్రణాళిక ఉంది, అది ఇంతకుమునుపెన్నడూ అమలు చేయనిది. “భూమి ఫలించాలంటే, మనం ఈ భూమిపై విస్తరించాలి,” అని అతను చెప్పాడు. దీనికి ముందు వారు కొన్ని బాగా జనాభా ఉన్న ప్రాంతాలలో మాత్రమే స్థిరపడ్డారు. ఆ స్థలాలు వారి గృహాలు, వారి పని, వారి పొలాలు మరియు వారి పరిసరాలను సూచించాయి. వాటన్నింటినీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కొంత అమ్మవలసి వచ్చింది–చాలామట్టుకు ఒప్పించాల్సి వచ్చింది. కానీ యోసేపు దానిని నడిపించాడు మరియు అతను ఐగుప్తు దేశమంతటా ప్రజలను విస్తరింపజేసాడు.
నాయకత్వం సృజనాత్మకతను వెలికితీయాలని పిలుస్తుంది. మీరు నాయకుడైతే, మీరు అప్పుడప్పుడు అభేద్యమైన అడ్డంకిని ఎదుర్కొని ఉంటారు. ఇది పెద్దగా భయపెట్టేదిగా మరియు సాధారణంగా పొడవుగా మృదువుగా ఉంటుంది. మీరు దాని గుండా వెళ్లలేరు, దానిపైకి ఎక్కలేరు లేదా దాని చుట్టూ తిరిగి మీ మార్గాన్ని చూడలేరు. అప్పుడే అది ఉద్రేకం కలిగించేదిగా ఉంటుంది! అప్పుడే వినూత్న రసాలు ప్రవహించడం మొదలవుతాయి మరియు మీరు ఆ అడ్డంకిని దాటి వెళ్ళడానికి సాధ్యమయ్యే మార్గాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. క్రొత్త ఆలోచన మరియు సృజనాత్మకత (ధైర్యాన్ని గురించి చెప్పనవసరం లేదు) జట్టుకడతాయి, సమాధానాన్ని మరియు మార్గాన్ని కనుగొనాలని నిశ్చయించుకుంటాయి.
యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి తెలిసిన అత్యంత వినూత్నమైన, సృజనాత్మక ప్రణాళికను అమలు చేశాడు. కన్య గర్భాన జన్మించడం నుండి మరణం మరియు పునరుత్థానం వరకు, అక్కడనుండి త్వరలో రాబోయే క్రీస్తు వరకు, సర్వశక్తిమంతుడైన దేవుని ప్రణాళిక నవీకరణ మరియు సృజనాత్మకతతో నిండి ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ జరుగలేదు. ఇది ఇంకెప్పుడూ జరుగదు. ఇది అందరికొరకు ఒక్కసారే సృష్టికర్త మాత్రమే ఊహించగలిగే గొప్ప ప్రణాళిక.
యోసేపుతో చేసినట్లే, తండ్రి మనతో కూడా చేస్తాడు. ఆయన గొప్పగా ఏర్పాటు చేసిన జీవితంలో, ఆయన మనిషి యొక్క పాపాన్ని ఉపేక్షించడు; ఆయన దానితో వ్యవహరిస్తాడు. ఆయన జీవితంలోని కఠినమైన ప్రశ్నలతో వ్యవహరిస్తాడు. నేను జీవనోపాధిని ఎలా సంపాదించాలి వంటి ప్రశ్నలు కాదు గానీ, నేను జయకరమైన జీవితాన్ని ఎలా పొందుకోవాలి? నేను నా సమయాన్ని ఎలా గడుపుతాననేది కాక, నేను నిత్యత్వాన్ని ఎలా గడుపుతాను? మరియు నా ప్రక్కన కూర్చున్న వ్యక్తితో నేను ఎలా కలిసిపోతాననేది కాక, అంతిమంగా, నేను దేవునితో ఎలా మంచి సంబంధం కలిగి ఉంటాను? మనము కఠినమైన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చినప్పుడు, మిగతావన్నీ అర్థమవుతాయి.
మనం శ్రద్ధ, నిజాయితీ, దయ మరియు సృజనాత్మకతకు నమూనాలుగా ఉందుముగాక. మన పని మన చిత్తశుద్ధికి పొడిగింపుగా ఉండునుగాక. మరియు క్రీస్తు నామాన్ని మన ప్రభువుగా పేర్కొనే మనలో ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఉన్నవారిపై సానుకూల ప్రభావం చూపుదుముగాక మరియు మనలను ప్రేమించి, మనకొరకు తన్ను తాను అర్పించుకున్న ఆయనకు నమ్మకమైన ప్రతినిధిగా మరియు రాయబారిగా ఉందుముగాక.