ఎస్తేరు 2:10-20 చదవండి.
ఎస్తేరు నిరంతరం నేర్చుకొననిష్టముగల ఆత్మను ధరించుకొన్నది. “మొర్దకై–నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను . . . ఎస్తేరు మొర్దకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక యుండెను” (ఎస్తేరు 2:10, 20).
ఈ ఆవేశపూరిత పోటీలో ఫైనలిస్ట్ అయినా, లేదా తరువాత, రాణి అయినా సరే, ఎస్తేరు తన స్వాతంత్ర్యాన్ని చాటుకోవటానికి మరియు ఆమె విషయాలను డంబముగా చెప్పటానికి కారణం అవ్వలేదు. ఈ అమ్మాయి అటువంటిది కాదు! మనోహరమైన, గౌరవప్రదమైన, జ్ఞానముగల స్త్రీ ఇప్పటికీ వినడానికి మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది.
ఆమె ఈ రోజు మహిళలకు శ్రేష్ఠమైన ఉదాహరణగా మిగిలిపోయింది. మీలో కొందరు అద్భుతమైన ప్రతిభావంతులైన బోధకులై ఉన్నారు. ఒక సమూహం ముందు నిలబడి లేఖనమును లేదా ఇతర నైపుణ్యం కలిగిన అంశమును బోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మీ అంతర్దృష్టి మరియు సృజనాత్మకతతో ప్రేక్షకులను శ్రద్ధగా నిమగ్నం చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. మీలో ఇతరులు ప్రజా సేవలో గుర్తింపు తెచ్చుకొనియుంటారు. మీరు సమాజంలో ప్రతిష్టాత్మక పాత్రలను మరియు పదవులను పోషించి ఉంటారు. మీరు బాగా ప్రయాణించి, మొదటి పేరు ప్రాతిపదికన మీకు తెలిసిన శక్తివంతమైన పురుషులు మరియు మహిళలతో ప్రత్యేకమైన వర్గముల్లో నమ్మకంగా వెళ్లవచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ నన్ను ఒకటి అడగనివ్వండి, అది మీ నేర్పదగిన సామర్థ్యాన్ని మార్చివేసిందా? మిమ్మల్ని మీరు ఇప్పుడు తుది అధికారంగా చూసుకుంటున్నారా? లేదా మీకు తెలియవలసినది యింకెంతో ఉన్నదనే అవగాహనను మీలో తీసుకువచ్చిందా? అవగాహన వచ్చియుంటుందని నేను నమ్ముతున్నాను.
“ఒకరి అజ్ఞానము విషయమై తెలియని స్థితినుండి జ్ఞానముగల స్థితికి చేరుకోవటమే విద్య,” అని ఎవరో అన్నారు. నేను ఒప్పుకొంటున్నాను. జ్ఞానం మీద ఏ ఒక్కరికీ గుత్తాధిపత్యం లేదు. ప్రపంచంలోని పేరొందిన వారందరూ మీకు తెలిసినను మీ స్వభావము యొక్క ప్రాముఖ్యతను పెంచదు. ఏదైనా ఉంటే, అది తగ్గిస్తుంది. మన తీవ్రమైన అవసరం ఏమిటంటే నేర్చుకోవటానికి ఇష్టము కలిగి ఉండాలి. అలాగే నేర్చుకొననిష్టము గలవారముగా మిగిలిపోవాలి. మీ పిల్లల నుండి నేర్చుకోవడం. మీ స్నేహితుల నుండి నేర్చుకోవడం. మన శత్రువుల నుండి కూడా నేర్చుకోవడం. అధికారం యొక్క ఉన్నత పదవులను అధిరోహించిన వారిలో పరిచారకుని-హృదయము, నేర్చుకొననిష్టముగల ఆత్మను కనుగొనడం ఎంత అందంగా ఉంటుంది.
మీరు, ఎస్తేరు వలె, వినడానికి మరియు నేర్చుకోవడానికి ఇంకా ఇష్టపడుతున్నారా?
Taken from Charles R. Swindoll, Great Days with the Great Lives: Daily Insight from Great Lives of the Bible (Nashville: W Publishing Group, 2005) 196. Copyright © 2005 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.