ఎస్తేరు 2:10-20 చదవండి.
శక్తిగల నాయకుల కోసం దేవుడు భూమిని చూసినప్పుడు, శరీర రూపంలో ఉన్న దేవదూతల కోసం ఆయన అన్వేషణలో లేడు. పరిపూర్ణులు ఒక్కరునూ లేరు గనుక, ఆయన ఖచ్చితంగా పరిపూర్ణ వ్యక్తుల కోసం వెతకడం లేదు. ఆయన మీలాంటి, నాలాంటి స్త్రీపురుషుల కోసం, మాంసం, ఎముక మరియు రక్తంతో రూపించబడిన ప్రజల కోసం వెదకుచున్నాడు. కానీ ఆయన ఎస్తేరులో కనుగొన్న లక్షణాల మాదిరిగా ఆ ప్రజలలో కూడా కొన్ని లక్షణాల కోసం చూస్తున్నాడు.
దేవుడు ఎస్తేరులో ఏమి చూశాడు? ఎస్తేరు నిరంతరం నేర్చుకొననిష్టముగల ఆత్మను ధరించుకొన్నది. మనకు అత్యవసరమైనది ఏమిటంటే నేర్చుకోవటానికి ఇష్టము కలిగి ఉండాలి. అలాగే నేర్చుకొననిష్టము గలవారముగా మిగిలిపోవాలి. మీ పిల్లల నుండి నేర్చుకోవడం. మీ స్నేహితుల నుండి నేర్చుకోవడం. మన శత్రువుల నుండి కూడా నేర్చుకోవడం.
ఎస్తేరు ఈ రోజు మహిళలకు శ్రేష్ఠమైన ఉదాహరణగా నిలిచిపోయింది. కొంతమంది మహిళలు అద్భుతమైన ప్రతిభావంతులైన బోధకులై ఉన్నారు. మీరు ఒక సమూహం ముందు నిలబడి లేఖనమును బోధించే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. ఇతరులు ప్రజా సేవలో తమకు తామే గుర్తింపు తెచ్చుకొనియుండవచ్చు. మీరు బాగా ప్రయాణించి, అలాగే బాగా చదువుకొని ఉండవచ్చు. కానీ నన్ను ఒకటి అడగనివ్వండి, అది మీ నేర్చుకొనదగిన సామర్థ్యాన్ని మార్చివేసిందా? మీరు, ఎస్తేరు వలె, యితరులనుండి వినడానికి మరియు నేర్చుకోవడానికి ఇంకా ఇష్టపడుతున్నారా?
సకల్ అనే హీబ్రూ పదానికి “బోధింపబడిన” అని అర్ధం. సకల్ వ్యక్తి బోధింపదగినవాడునై ఉంటాడు. పదవోన్నతి ఎంత వేగంగా వచ్చినా, ఎంత గొప్పగా ఘనపరచబడినా, మన నేర్చుకొనదగిన అలవాటును మనం ఎప్పటికీ కోల్పోకూడదు. మనం విమర్శకు అందని లేదా ఇతరుల సలహా మనకు అవసరంలేని స్థాయికి ఎప్పటికీ చేరుకోలేము.
ఎస్తేరు మొర్దకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను (ఎస్తేరు 2:10, 20). ఒకేఒక్క కారణంతో ఆమె రాజు ముందు నిలబడింది: ఎందుకంటే దేవుని హస్తం తన జీవితంపై ఉందని ఆమెకు తెలుసు. అలాగే పరిస్థితుల ద్వారా మరియు మొర్దెకై యొక్క జ్ఞానం ద్వారా, ఒక కారణం కోసమే ఆమె ఈ ప్రదేశానికి తీసుకురాబడింది.
గుర్తుంచుకోండి, ఈ సమయానికి ఎస్తేరుకు ఇరవై ఏళ్ళు మించి ఉండవు, అలాగే ఆమె ఇంకా చిన్నదై ఉండవచ్చు. ఆమె కోరుకున్నది పొందుకోవటానికి ఆమెకు జీవితకాలములో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. బదులుగా, ఆమె బోధింపబడటానికి ఆమె నిజాయితీగా నిలబడింది. అలాగే ఆమెకు ఉత్తమమైనది ఏమిటో ఆయనకు తెలుసునని నమ్మి మొర్దెకై యొక్క బోధనకు కట్టుబడి ఉన్నది.
ఎస్తేరు తన చుట్టూ ఉన్న ప్రలోభాలకు లొంగలేదు-మిడిమిడి జ్ఞానం, స్వార్థం, వంచన మరియు స్వీయ-కేంద్రీకృతత. ఆమె ఎవరో ఆమెకు తెలుసు. ఆమె ఎక్కడి నుండి వచ్చినదో ఆమెకు తెలుసు. నా అభిమాన వ్యక్తీకరణలలో ఒకదాన్ని ఉపయోగిస్తే ఇలా ఉంటుంది, ఆమె తన వస్తువులతో సిద్ధముగా ఉంది.
స్పష్టముగా, ఎస్తేరుకు రాణిగా ఉండాలనే గొప్ప కోరిక లేనందున భయం లేకుండా రాజు వద్దకు వెళ్ళిందని నేను నమ్ముచున్నాను. దేవుని హస్తము తన జీవితంపై ఉందని ఆమెకు తెలుసు. ఆమె ఇక్కడ ఉండటం ఆయన ఆనందమైతే, అది ఆయన ప్రణాళికలో భాగమైతే, ఆమె దానిని ఇష్టపూర్వకంగా అంగీకరిస్తుంది. అలా కాకపోతే, ఆమె దానిని ఇష్టపూర్వకంగా వదిలివేస్తుంది. ఆమె తన సొంత స్వరూపం విషయమై అణకువగా ఉంది, ఆమె యథార్థవంతురాలు మరియు ఆమె నేర్చుకొనదగినది.
దేవుడు దేని కొరకు చూస్తున్నాడు? ఎవరి హృదయాలైతే పూర్తిగా ఆయనవై ఉంటాయో-పూర్తిగా, అటువంటి స్త్రీపురుషుల కోసం ఆయన చూస్తున్నాడు. దేవుడు తన విశ్వాస్యతను బయలుపరచడానికి సాధారణ ప్రజలకు అసాధారణమైన పనులను ఇస్తాడు. మీ క్రియల్లో ఆయనను సంతోషపెట్టాలని మీరు ఎంతో ఇష్టపడుతున్నారా? మీ క్రియల వెనుక ఉన్న ఉద్దేశ్యాల గురించి మీరు శ్రద్ధ వహిస్తున్నారా? దేవుని హృదయం మీరు కలిగియున్నారా? మీరు నేర్చుకొనదగినవారా?
Adapted from Charles R. Swindoll, Great Days with the Great Lives (Nashville, Tenn.: W Publishing Group, a division of Thomas Nelson Publishers, 2005), 102, 119, 196-197.