నాయకుల కొరకు ఏడు నిర్మాణాత్మక రాతిబండలు

నేను నెహెమ్యా కంటే నాయకత్వమునకు మంచి మాదిరి గురించి ఆలోచించలేను. నేను ఒకసారి కూర్చుని, రెండు గంటలు నెహెమ్యా గురించి చింతించాను, ఈ పురాతన యూదు నాయకుడు యెరూషలేము చుట్టూ గోడను పునర్నిర్మించేటప్పుడు నమోదు చేసిన విషయాలను సమీక్షించాను. నేను చదివినప్పుడు, అతని దినచర్య పత్రిక నాయకత్వ అంతర్దృష్టుల గని అని నాకు తెలిసింది. నెహెమ్యా యొక్క మొదటి ఆరు అధ్యాయాలు ప్రతి సంవత్సరం నాయకులందరూ, అలాగే నాయకులు అవ్వాలనుకున్న వారందరూ కూడా తప్పకుండా చదువవలసినదిగా నియమించాలి.

నేటి క్రైస్తవ నాయకులు నాయకత్వం కోసం వారి స్వంత వ్యూహాన్ని రూపొందించడానికి రాళ్లుగా ఉపయోగించగల ఏడు ముఖ్యమైన నైపుణ్యాలను ఆయన పుస్తకంలో నేను కనుగొన్నాను.

మొదటి పునాది రాయి ఏమిటంటే ప్రాజెక్టు పట్ల తీవ్రోత్సాహం. ముందుచూపు, ఉత్సాహం, శక్తి, సంకల్పం, సృజనాత్మక కలలు మరియు వినూత్న ఆలోచనలు ఈ తీవ్రోత్సాహంలో ఉన్నాయి. తీవ్రోత్సాహం ఉన్న నాయకులు అన్ని వివరాల్లో మునిగిపోకుండా, వాటిమీద ఆసక్తి లేకుండా పెద్ద చిత్రాన్ని గ్రహించగలుగుతారు. తాను దేవుని లక్ష్యాన్ని నెరవేర్చినట్లు ఊహిస్తూ ఉండగా నెహెమ్యాకు నిద్రపట్టి ఉండకపోవచ్చు. అతని తీవ్రోత్సాహం చాలా గొప్పది.

రెండవ నిర్మాణాత్మక రాతిబండ ఏమిటంటే ఇతరులను ప్రేరేపించే సామర్థ్యం. ఇతరులతో బాగా కలిసిపోవడం నాయకత్వంలో కీలకమైన భాగం. ఆలోచనలు, కలలు మరియు ఆందోళనలను మాటల్లో చెప్పడం; క్లుప్తంగా మరియు సరళంగా లక్ష్యాలను వ్యక్తీకరించడం; సంస్థాగత బలం మరియు అనంతమైన శక్తిని ప్రదర్శించటం వంటి నైపుణ్యాలు ఇందులో ఉంటాయి. ప్రేరేపించు నాయకులు ఇతరులను తమ వంతు కృషి చేయడానికి ఆసక్తిని ప్రేరేపిస్తారు. ఎక్కడ కీర్తించాలో అక్కడ కీర్తించడానికి వారు వేగమే ధృవీకరించి గుర్తిస్తారు. నెహెమ్యా ఆ విషయాలన్నిటిలోనూ బలంగా ఉన్నాడు.

మూడవ రాయి ఏమిటంటే దేవునిపై దృఢ నిశ్చయమైన విశ్వాసం. నెహెమ్యా దిన పత్రిక ప్రార్థనలతో నిండి ఉంది-నిశ్శబ్దమైనవి, చిన్నవి, ప్రత్యేకమైనవి. ప్రభువు యొక్క ఉనికిని మరియు రక్షణను ప్రజలకు గుర్తు చేయడంలో అతను ఎప్పుడూ విఫలమవ్వలేదు. నిజాయితీగా క్రైస్తవులైన నాయకులు ఇతరుల దృష్టిని బలం యొక్క మూలానికి-అసాధ్యమైన దాన్ని సాధించేవాడును, అద్భుతమైన పోషకుడునుయైన వానితట్టు స్థిరంగా త్రిప్పుదురు. ఆయనయందలి విశ్వాసం కదలదు. వారి విశ్వాసం వ్యాప్తిచెందుతుంది. వారు అప్పుడప్పుడు తమ సొంత సామర్థ్యాన్ని అనుమానించినప్పటికీ, దేవుని పని పట్ల దేవుని అజేయ నిబద్ధతను వారు అనుమానించరు.

ప్రతికూల పరిస్థితుల్లో స్థితిస్థాపకత మరియు సహనం నాల్గవ భాగాన్ని సూచిస్తాయి. నెహెమ్యా ఇవన్నీ సహించాడు: వ్యంగ్యం, అనుమానం, పుకార్లు, ఎగతాళి, బెదిరింపులు, అనామక వ్రాతలు, బహిరంగ లేఖలు, తప్పుడు ఆరోపణలు-చెప్పుకుంటూపోతే అనేకం ఉన్నాయి. అవేవీ అతన్ని కదిలించలేదు. అతను లేదా ఆమె విమర్శల గుండా ఓపికగా మరియు స్థితిస్థాపకంగా ఉండలేకపోతే ఏ నాయకుడూ తట్టుకొని నిలబడలేడు. అహంకారిగా, పగబట్టినవానిగా, లేదా హాని కలిగించేవానిగా మారకుండా ఉద్దేశ్యంలో దృఢముగా ఉండటం ముఖ్యం. సరైన కారణముతో సరైన సమయంలో వ్యక్తీకరించిన కోపం తగినదే మరియు ఆరోగ్యకరమైనదే, కానీ పగ పెంచుకోవడం మంచిది కాదు.

అక్కడ పెట్టవలసిన ఐదవ రాయి ఏమిటంటే వాస్తవికతపై ఆచరణాత్మక, సమతుల్య పట్టు. మంచి నాయకుడికి కలలు మరియు ఆలోచనలు ఉండవచ్చు, అయితే అతను లేదా ఆమె ఆదర్శవంతమైనవాటి గురించే ఆలోచిస్తూ కలల ప్రపంచం‌లో జీవించరు. అసలైన వాస్తవాలు-కఠినమైన సాక్ష్యాలు-స్పష్టమైన దృష్టిలో ఉన్నాయి. నెహెమ్యా తన ప్రారంభ ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు, అతను మూర్ఖుడైన చీర్లీడర్ కాదని బహు స్పష్టమైంది: “మనకు కలిగినశ్రమ మీకు తెలిసియున్నది” (నెహెమ్యా 2:17). అతను కార్మికులను వారి ఉద్యోగాల్లో ఉండమని చెప్పాడు, కాని గోడను దాడి నుండి రక్షించడానికి అతను తెలివిగా ఇతరులను నిలబెట్టాడు. చురుకైనవాడు. వివేకంగలవాడు. కఠినమైనవాడు. అతిగా స్పందించకుండా వ్యవహరించాడు. అతను దయ చూపించాడు, అయినను వంగకుండా స్థిరంగా ఉన్నాడు. మంచి నాయకులు సానుకూలంగా ఉండటం మరియు ప్రతికూలత గురించి తెలుసుకోవడం మధ్య అవసరమైన సమతుల్యతను కొనసాగిస్తారు.

ఆరవది ఏమిటంటే కష్టపడి పనిచేయడానికి మరియు నిస్వార్థంగా ఉండటానికి ఇష్టపడటం. క్రైస్తవ నాయకులందరిలో ఒకటి మాత్రం సామాన్యముగా ఉంటుంది: శ్రద్ధ. వారికి పని ఆపడం యొక్క విలువ కూడా తెలుసు (శ్రద్ధ మరియు మరో ధ్యాసలేకుండా పనిచేయటం రెండూ ఒకటి కాదు). తన కృషి మూలంగా, గోడ పూర్తవ్వక మునుపే నెహెమ్యా “యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడెను” (నెహెమ్యా 5:14). ప్రత్యేక ఉపచారమును నిరాకరిస్తూ, ప్రజల మంచి కోసం ఇష్టపూర్వకంగా త్యాగం చేస్తూ, అతను తన నియామకాన్ని వినయంగా అంగీకరించాడు. నాయకత్వ పరిచర్యపై నెహెమ్యా ఒక వైద్యశాల నడిపించాడు.

చివరగా, పని పూర్తిచేసే క్రమశిక్షణ నాయకుల్లో ఉండాలి. మంచి నాయకులు పూర్తిచేసేవారుగా ఉంటారు. పరిపూర్ణమైన వివరాలతో మార్గాన్ని నిరోధించడానికి అనుమతించకుండా అవసరమైన వాటిపై ఎలా దృష్టి పెట్టాలో వారికి తెలుసు. నెహెమ్యా యొక్క రాళ్ళు కొన్ని వంకరగా ఉన్నాయని మరియు కొన్ని కలుపబడిన రాళ్ళు వదులుగా ఉన్నాయని నాకు తెలుసు. బహుశా ఒక ద్వారము లేదా రెండు సంపూర్ణంగా ఉండకపోవచ్చు మరియు ఒకటి లేదా రెండు మొలలు నిస్సందేహముగా కీచుమని శబ్దం చేసి ఉంటాయి . . . కాని ఆ చిన్న పని కూడా అయిపోయింది. పని పూర్తైయ్యింది. శుభం. అయిపోయింది!

మరియు పని పూర్తయినప్పుడు, మంచి నాయకులు వేడుక జరుపుకుంటారు. . . వారు ఆనందిస్తారు! నెహెమ్యా విషయంలో, వారు గోడపై నడుస్తూ మంచి సమయం గడిపారు, కవాతు చేశారు మరియు నృత్యం చేశారు, అరవడం మరియు పాడటం జరిగింది – వారు రెండు గాయక బృందాలను కూడా ఆహ్వానించారు, వారి “స్తోత్రగీతములు పాటలు” (నెహెమ్యా 12:46) దూరం నుండి వినవచ్చు. ఎంత గొప్ప విందు!

మంచి స్వభావము ఉన్న క్రైస్తవ నాయకులను ఎంతోమంది కావాలనుకుంటారు. “బద్దలైన సందులలో నిలుచుటకు తగిన” నాయకుల కొరకు యెహెజ్కేలు దేవుని విజ్ఞప్తిని నమోదు చేశాడు, కాని, విషాదకరంగా, అతనికి “ఒకడైనను కనబడలేదు” (యెహెజ్కేలు 22:30). అతని శోధన నేటికీ కొనసాగుతోంది. బద్దలైన సందులను పూడ్చివేయడానికి దేవుడు శోధిస్తున్న పురుషులము మరియు మహిళలము అని నిశ్చయించుకుందాం. ఈ తరం యొక్క నెహెమ్యాలముగా ఉందాం-నాయకత్వ నిర్మాణ రాతిబండలపై బలంగా నిలబడుచూ, దేవుని మహిమ కోసం పనులు చేసే నాయకులుగా ఉందాము.

Taken from Charles R. Swindoll, “7 Building Blocks for Leaders,” Insights (February 2007): 1, 3. Copyright © 2007 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Leadership-Telugu, Pastors-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.