చాలా కాలంగా కొత్త కార్ల పరిశ్రమ గురించి నాకు అర్థం కాలేదు. అది ఈ క్రింది విధంగా పని చేస్తుందని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. ఒక వ్యక్తికి కారు కావాలనుకున్నప్పుడు, అతను స్థానిక డీలర్‌షిప్ వద్దకు వెళ్లి, కారు మొత్తాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అప్పుడు అతను సేల్స్‌మ్యాన్‌తో మాట్లాడి, ధర విషయమై బేరమాడి, అతనికి ఇష్టమైన రంగును ఎంచుకుని, ఆర్డర్ చేస్తాడు. ప్రధాన కార్యాలయానికి వివరాలు అందినప్పుడు, వారు సరైన స్టీరింగ్ వీల్, క్రోమ్ స్ట్రిప్స్ మరియు టైరుక్యాప్‌లను కనుగొనడానికి దుకాణం చుట్టూ తిరుగుతారని, ఆపై షిప్పింగ్ చేయడానికి ముందు ఆ వస్తువులన్నీ సరిగ్గా బిగించబడ్డాయా లేవా అని నిర్ధారించుకుంటారని నేను గుర్తించాను. మీకు తెలుసా, వంటగదిలో చివరి నిమిషంలో భోజనం హడావిడిగా చేయటం లాంటిది.
కానీ అది అస్సలు అలా జరుగదు. ఆశ్చర్యకరముగా, కంప్యూటర్ కార్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డజన్ల కొద్దీ కాంటాక్ట్‌లను సంప్రదించడం ఆరంభిస్తుందని నేను కనుగొన్నాను. ఒక ప్రదేశం ఇంజిన్‌లను మాత్రమే తయారుచేస్తుంది. మరొకటి గాజు మరియు ప్లాస్టిక్ భాగాలను చేస్తుంది. ఇంకొక బృందం స్టీరింగ్ వీల్స్‌ను చేస్తుంది, అలాగే మరొకటి కార్పెట్ మరియు వినైల్‌ను తయారు చేస్తుంది. ఆర్డర్ చేసిన తర్వాత, ఇది ఈ సంబంధిత ప్రాంతాలన్నటిలో పనిని ప్రారంభిస్తుంది. మరియు-ఆశించిన విధంగా-బంపర్ బోల్ట్‌ల నుండి విండ్‌షీల్డ్ వైపర్‌ల వరకు అన్నీ-సరైన సమయంలో, ప్రతిదీ అసెంబ్లీ ప్లాంట్‌కు చేరుకుంటుంది. వెంటనే, అంతా పూర్తైన మెరిసే కొత్త కారు రవాణా లారీపైకి దూసుకెళ్లింది మరియు వెంటనే దాని సరైన గమ్యస్థానానికి అది పంపబడుతుంది.
తెలివిగల అమెరికన్లు ఎంత గొప్ప ఏర్పాటు చేశారు! అయితే ఏదీ రెండు వందల సంవత్సరాల క్రితం ఆలోచనలో కూడా లేదు.
అయితే ఇప్పుడు-ప్రజలు అన్నిటికంటే సంక్లిష్టమైన సంస్థాగత ప్రణాళికతో ముందుకు రాగలిగితే, దేవుని ఏర్పాటు ఎంత సమర్థవంతంగా ఉందో ఊహించండి . . . రెండు వేల సంవత్సరాల క్రితం. నేను మన రక్షకుని పుట్టుకకు సంబంధించి సంపూర్ణంగా సమకాలీకరించబడిన సంఘటనలను సూచిస్తున్నాను. ఖచ్చితంగా, ఇది తర్వాత వచ్చిన ఆలోచన కాదు. లేఖనం మనకు హామీ ఇస్తుంది
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. (గలతీయులకు 4:4)
అద్భుతమైన ప్రకటన!
సరైన సమయంలో, ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా, మనం “ఆపరేషన్ రాకడ” అని పేరు పెట్టుకున్న ఒక ప్రణాళిక ప్రకారం, మెస్సీయ ప్రవేశించాడు.
అది యూదాలోని బేత్లెహేములో జరుగుతుందని మీకా చెప్పాడు. అది అక్కడే జరిగింది. అయితే యోసేపు మరియలు గలిలయలోని నజరేతువారని నేను అనుకున్నాను. వారు అక్కడివారే. ఆ ప్రదేశాల మధ్య మైళ్ల దూరం లేదా? అవును, ఆ కాలాల్లో కొన్ని రోజుల దూరం ఉన్నది. మరి . . . ఎలా? సరే, చూడండి, ఇది ప్రణాళికలో ఒక చిన్న భాగం మాత్రమే, అయినప్పటికీ అద్భుతమైనది. ప్రత్యేకించి మరియ తన గర్భధారణలో “ప్రసవించే” సమయం సమీపిస్తోందని మీరు పరిగణించినప్పుడు. వారిని సకాలంలో దక్షిణం వైపుకు తీసుకురావడానికి చాలా మంచి రోడ్లు అవసరం-రోమా పరిపాలనకు ముందు వీటి గురించి వినలేదు. మరియు వారు ఖచ్చితంగా ప్రయాణం చేయవలసి వచ్చింది. . . అందువల్ల కైసరు ఔగుస్తు (లూకా 2:1) నుండి అవసరమైన జనాభా గణన వలన యోసేపు తన కుటుంబ మూలాలైన బేత్లెహేము (2:4) నగరంలో వ్యక్తిగతంగా నమోదు చేసుకోవలసి వచ్చింది.
కానీ రక్షకుడు పుట్టకముందే, ఈ వార్తను త్వరగా వ్యాప్తి చేయగల సుపరిచితమైన భాష-సాధారణ సంభాషణకు ఏదోయొక సహజమైన మార్గము కూడా ఉండాలి. ఏమీ ఫర్వాలేదు. కొయినె గ్రీకునకు పితామహుడైన అలెగ్జాండర్ ది గ్రేట్‌కు ధన్యవాదాలు, ఆ భాష పక్వానికి వచ్చి అప్పటి నుండి సువార్తికులు మరియు అపొస్తలుల కలం ద్వారా సువార్త సందేశాన్ని వేగంగా వ్యాప్తి చేయడానికి సిద్ధంగా ఉంది.
రోమాలో తీసుకోబడిన నిర్ణయం, మంచి రోడ్లు, మరియు ఇబ్బందికరమైన జనాభా గణనకు ధన్యవాదాలు, ఇది సరైన స్థలంలో జరిగింది. ఖచ్చితమైన మాటల వాహనంగా స్పష్టమైన భాషతో . . . సరైన సమయంలో జరిగింది. లోకం గమనించని చిన్న శిశువు ఏతెంచెను. రోమా నిర్మించడంలో మరియు జయించడంలో చాలా బిజీగా ఉన్నది. ఔగుస్తు ఆ గణనను కోరుతూ రాజభవనంలో చిందులు త్రొక్కాడు. వాస్తవానికి, అతను ప్రవచనాత్మక పేజీలో పొగవంటివాడై ఏమాత్రం యెంచదగినవాడు కాదు . . . “ఆపరేషన్ రాకడ” యొక్క సైన్యాధిపతి చేతిలో ఒక బంటు మాత్రమే.
ఇరవై ఒక్క శతాబ్దాల క్రితం తన కుమారుడిని సమయానికి అందించడానికి దేవుడు నెరవేర్చిన విషయాలతో, తెలివిగల అమెరికన్ యొక్క గర్వాన్ని పోల్చి చూస్తే ఇది సంస్థాగతమైన ఆలోచనగా కనిపిస్తుంది.
Excerpted from Come Before Winter and Share My Hope, Copyright © 1985, 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide. Used by permission.