ఈ క్రిస్మస్‌కి నా సలహా

నేను చార్లెస్ డికెన్స్ యొక్క ప్రసిద్ధ ప్రారంభ వాక్యమును ఎరువు తీసుకుని, క్రిస్మస్ “అత్యుత్తమ సమయం మరియు మిక్కిలి చెడ్డ సమయం” కావచ్చు అని అనుకుంటున్నాను. ఈ రెండూ మనకు ఉన్నాయి, కాదా?

దుకాణాలు కృత్రిమ క్రిస్మస్ చెట్లను బయటకు లాగి వాటిని ప్రదర్శనలో ఉంచడంతో అక్టోబర్ ప్రారంభంలో ఎవరు పండ్లిగిలించలేదు? క్రిస్మస్‌తో సంబంధం లేని వస్తువులను కొనడానికి మీరు వెళ్లవలసి వచ్చినప్పుడు అదనపు ట్రాఫిక్ మరియు షాపింగ్ సెంటర్‌లలోని జనాల గగ్గోలు గురించి ఎవరు భయపడరు? మీకు తెలియని వ్యక్తులతో తప్పనిసరిగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం గురించి ఎవరు అసౌకర్యంగా భావించలేదు? లేదా మీరు పోయిన క్రిస్మస్‌కి పంపించిన కార్డ్ తర్వాత వారికి ఏమీ వ్రాయకుండా యిప్పుడు క్రిస్మస్ కార్డులను పంపడం? మీ ఇరుగుపొరుగున మీరు మాత్రమే దండలు వ్రేలాడదీయని వారుగా ఉన్నప్పుడు మీ ఇంట్లో మోదుగుకొమ్మలను వ్రేలాడదీయాల్సిన ఒత్తిడి ఎలా ఉంటుంది? ఆ వార్షిక అనుభవాలు మరియు బాధ్యతలను “మిక్కిలి చెడ్డ సమయం” గా మార్చేది ఏదో ఉన్నది.

అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, నేను క్రిస్మస్‌ను “ఉత్తమ సమయం” గా చూడాలనుకుంటున్నాను. మన వీధులను మెరుగుపరిచే రంగును ఆస్వాదించడానికి సంవత్సరంలో ఇంతకంటే మంచి సమయం లేదు. సంవత్సరంలో మరే ఇతర సమయాల్లోనూ చిన్న పిల్లల ముఖాలు ఇంత అద్భుతంగా వెలిగిపోవు. అలాగే క్రిస్మస్ సంగీతం వంటిది ఏదీ ఉండదు! వారు కిరాణా దుకాణాలు, లిఫ్ట్‌లు, షాపింగ్ సెంటర్‌లు మరియు ప్రతి రేడియో స్టేషన్‌లో మన పాటలనే ప్లే చేస్తున్నారు: “సంతోషమౌ దినం భువికి! ప్రభుండేతెంచెను.” వారు మన రక్షకుని గురించి మాట్లాడుతున్నారు. ఇది వారి పెదవులపై మన సందేశం. మీరు గమనించారా? దానిని మిస్ అవ్వవద్దు!

మరియు నేను ఇంకొకటి చెప్పాలి, యేసుక్రీస్తునందు మీ విశ్వాసాన్ని గూర్చి ఇతరులతో పంచుకోవడానికి సంవత్సరంలో ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? మరే ఇతర కాలము‌లోనూ అవిశ్వాసి హృదయం యేసు సందేశం పట్ల మృదువుగా ఉండదు. అది తెలుసుకోండి. దాని విషయమై సూక్ష్మగ్రాహకం కలిగి ఉండండి. మాట్లాడటానికి సిద్ధంగా ఉండండి. ఇది దాని కోసం “ఉత్తమ సమయం.”

ఇది మనకు దేవుని వార్షిక జ్ఞాపిక-ఫలితంగా, మనల్ని ఆకర్షించడం, లాగడం, ప్రోత్సహించడం చేస్తుంది: “ఆ బల్బులోని వెచ్చదనాన్ని అనుభవిస్తున్నారా? ఆ చెట్టు వాసన చూస్తున్నారా? ఆ బహుమతులు చూశారా? ఆ పాటలు విన్నారా? నా కుమారుడు వచ్చి నీ కోసం మరణించాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” తెలిసిన ఈ విషయాలన్నీ ముఖ్యమైన విషయాల జ్ఞాపిక‌లు.

“కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీక రించిన సత్యమందు స్థిరపరచబడియున్నను,” అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు, “వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను” (2 పేతురు 1:12). ఇది ముఖ్యమైనది కాదా? “అరే, మీరు ఇంతకు ముందు అది చెప్పారు, చక్” లేదా “మీరు మరచిపోయి ఉండవచ్చు, కానీ మీరు చెప్పిందే చెప్పుచున్నారు” అని కొన్నిసార్లు నాతో చెప్పే మనుష్యులు ఉన్నారు. మంచిది, అని నేను అనుకుంటాను! పదే పదే చెప్పడం, మళ్లీ చెప్పడం మరియు సత్యాన్ని పదే పదే సమీక్షించి నేర్చుకోవడం ఉత్తమ పద్ధతి. అపొస్తలుడైన పేతురు ఇలా కొనసాగించాడు: “నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను” (1:13, ఉద్ఘాటన జోడించబడింది). వారు క్రియలు చేయునట్లు రేపడానికి–వారికి ఇప్పటికే తెలిసినవాటిని వారికి జ్ఞాపకం చేయాలని పేతురు నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పీలోని క్రైస్తవులకు వ్రాస్తూ, పౌలు ఇలా ఒప్పుకున్నాడు: “అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము” (ఫిలిప్పీయులకు 3:1).

దృఢమైన, బైబిల్-బిలీవింగ్ (పరిశుద్ధ గ్రంథమునందు విశ్వాసముంచు) సంఘాలకు హాజరయ్యే మనలో చాలా మందికి బహుశా క్రీస్తు గురించి కొంతమంది తమ జీవితకాలంలో కనుగొనే దానికంటే ఎక్కువ తెలుసు. మనము దేవుని సత్యమును గూర్చి బాగా లోతుగా తెలుసుకున్నాము. మన సమస్య ఏమిటి? సత్యమును తెలుసుకోవడం కాదు; దాని ప్రకారం జీవించడం. మనం ఈ క్షణంలోనే క్రొత్త విషయాలను నేర్చుకోవడం మానేసి మనకు ఇప్పటికే ఉన్న జ్ఞానపు తొట్టిలోనుండి తోడుకుంటే, అది మనల్ని చాలా కాలం పాటు బిజీగా ఉంచుతుంది.

కానీ చర్య తీసుకునేలా మనల్ని ప్రేరేపించడానికి ఆ సత్యాల గురించి మనకు క్రమం తప్పకుండా జ్ఞాపిక‌లు అవసరం. పాత నిబంధనలో, దేవుడు తన ప్రజలను ప్రేరేపించడానికి ప్రత్యక్షమైన వస్తువులు మరియు చర్యలను జ్ఞాపకశక్తిని ప్రేరేపించేలా ఉపయోగించాడు–నుదిటిపై రక్షరేకులు, పస్కాలో ప్రత్యేక ఆహారం, నీటి వద్ద రాళ్లు, క్రొత్త సంవత్సరం కోసం బూరలు మరియు ఆలయంలో బలులు–అవసరమైన వాటిని గుర్తుంచుకోవడానికి తన ప్రజలను పురికొల్పటానికి ఇవన్నీ ఉపయోగించాడు. “యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు . . . నీకు సూచనగాను . . . జ్ఞాపకార్థముగా ఉండును” (నిర్గమకాండము 13:9). దృశ్యాలు, శబ్దాలు, వాసనలు, రుచులు-ఈ కాలానుగుణ సంప్రదాయాలు-దేవుని ప్రజల కోరికలను పునరుజ్జీవింపజేశాయి మరియు ఆయన ప్రేమ, ఆయన ఆజ్ఞలు మరియు ఆయన దయను వారికి గుర్తు చేశాయి.

ఈ సంవత్సరం క్రిస్మస్ మనకు కూడా అదే చేయగలదు.

మీరు లైట్లు తగిలిస్తారు. మీరు చెట్టును కత్తిరిస్తారు. మీరు బహుమతులు కొంటారు. మీరు బహుమతులను చుట్టి చెట్టు కింద ఉంచుతారు. మీరు క్రిస్మస్ ఈవ్ సేవతో సహా సంఘ సేవకు హాజరవుతారు. పాటలు మీకు నోటికి వచ్చేశాయి. ఇది అందరికీ తెలిసినదే. . . ఇది అంతా ఎప్పుడూ జరిగేదే. ఇది కేవలం మాటలు, కేవలం లైట్లు, కేవలం ఒక చెట్టు, కేవలం బహుమతులు, కేవలం పాటలు–ఒక్క నిమిషం ఆగండి!

క్రిస్మస్ సీజన్ గత సంవత్సరం నుండి అర్థజ్ఞానము లేకుండా పునరావృతం కానవసరం లేదు. ఈ సుపరిచితమైన సంప్రదాయాలను ముఖ్యమైన సత్యాలను జ్ఞాపకం చేసేవిగా ఉపయోగించాల్సిన సమయం ఇది కావచ్చు.

యేసు కన్యకు జన్మించాడని మర్చిపోవద్దు-ఆయన గర్భమందు పడడము, ఒక అద్భుతం! రక్షకుని పుట్టుకను ప్రకటిస్తూ, ఆ రాత్రి దేవదూతలు గొర్రెల కాపరుల పొలాన్ని దేవుని మహిమతో ఎలా వెలిగించారో గుర్తు చేసుకోండి. ఒక రక్షకుడు. మీకు మరియు నాకు–మన పాపాల కోసం చనిపోయేవాడు మరియు చనిపోదగినవాడునైన ఒక రక్షకుడు కావాలి.

ఈ క్రిస్మస్‌కి నా సలహా? జ్ఞపకం చేయడం ద్వారా మిమ్మల్ని కదిలించడానికి ఈ సీజన్ యొక్క సంప్రదాయాలను అనుమతించండి. ముఖ్యమైన విషయాలను మీకు సూచించడానికి తెలిసిన విషయాలను అనుమతించండి.

వాటిని మిస్ అవ్వవద్దు.

Taken from Charles R. Swindoll, “My Advice This Christmas,” Insights (December 2008): 1–2. Copyright © 2008 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Christmas-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.