“మీరు ఏదైనా చూడగలుగుతున్నారా?”
ఎలాంటి ప్రశ్న అడిగారు! అతని సహాయకుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు హోవార్డ్ కార్టర్ నోరు మరియు కళ్ళు పెద్దవిగా తెరుచుకున్నాయి. అతను కాలాతీతమైన సమాధిలో తలమునకలైనాడు. బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త యొక్క నుదుటిపై చెమట పట్టింది. వరుసగా ఆరు సంవత్సరాలుగా, అతను తవ్వుతున్నాడు. అంతులేని కందకాలు. టన్నుల శిథిలాలు, రాళ్లు మరియు ఇసుక. పనికిరాని శిధిలాల భారీ భాగాలు. మరియు అతను ఏమీ కనుగొనలేదు!
అది 1922. కొన్ని వందల సంవత్సరాల పాటు, పురావస్తు శాస్త్రవేత్తలు, పర్యాటకులు మరియు సమాధి దొంగలు ఐగుప్తు ఫరోల సమాధి స్థలాల కోసం శోధించారు. ప్రాచీన చక్రవర్తులు అయిదు వందల ఏళ్ళకంటే ఎక్కువ కాలం ఖననం చేయబడ్డ రాజుల లోయలో ఏదీ నిశ్చలముగా లేదని నమ్ముతారు. కనుగొనడానికి ఇంకా ఏదైనా మిగిలి ఉందని ఎవరూ భావించనప్పటికీ, కార్టర్ దానిని కొనసాగించడానికి కొన్ని లేశమాత్రమైన ఆధారాలతో ప్రైవేట్ ఫైనాన్స్‌తో తన అన్వేషణను కొనసాగించాడు. ఎక్కడో . . . ఏదో ఒకవిధంగా . . . ఒక సమాధి మిగిలి ఉందని అతనికి నమ్మకం కలిగింది. తన ఆరు సంవత్సరాల అన్వేషణలో రెండు సార్లు అతను కేవలం రెండు గజాల దూరంలో సమాధి గదికి వెళ్లే మొదటి రాతి మెట్టును కనుగొనలేకపోయాడు.
ఆ తర్వాత, మొత్తానికి-యురేకా!
మీరు ఏదైనా చూడగలుగుతున్నారా?
నిశ్శబ్దంగా చీకటిలోకి చూస్తూ, ఏ ఆధునిక మానవుడు ఎన్నడూ చూడనిది హోవార్డ్ కార్టర్ చూచాడు. చెక్క జంతువులు, విగ్రహాలు, భోషాణములు, పూతపూసిన రథాలు, చెక్కిన నాగుపాములు, లేపనము యొక్క పెట్టెలు, కుండీలు, బాకులు, ఆభరణాలు, ఒక సింహాసనం, దేవత సెల్కెట్ యొక్క చెక్క రూపం . . . అలాగే దాని బంగారు మూతపై టీనేజ్ రాజును వర్ణిస్తూ చేతితో చెక్కబడిన శవపేటిక. ప్రతిచోటా బంగారం మెరిసింది. ఇది ప్రపంచంలోని అత్యంత ఉత్తేజకరమైన పురావస్తు ఆవిష్కరణ: కింగ్ టుటన్ఖమెన్ యొక్క అమూల్యమైన సమాధి మరియు నిధి.
ఈ సమాధిలో 3,000 కంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయి, అలాగే తొలగించడానికి, జాబితా చేయడానికి మరియు పునరుద్ధరించడానికి కార్టర్‌కు దాదాపు పది సంవత్సరాలు పట్టింది. “సున్నితమైనది.” “నమ్మశక్యం కానిది.” “సుందరమైనది.” “అద్భుతమైనది.” “ఆహ్!” అని ఆ పురాతన, ఐగుప్తీయుని మృత గృహము గుండా వెళుతూ అతను మొదట గుసగుసలాడినప్పుడు పలుమార్లు తననోటి నుండి ఈ మాటలు వచ్చి ఉంటాయి.
ఆకస్మిక ఆవిష్కరణ యొక్క ఆనందం వంటి కొన్ని ఆనందాలు ఉన్నాయి. శోధించడం వలన కలిగే నొప్పి మరియు వ్యయం, అసౌకర్యాలు, గడిపిన గంటలు, త్యాగాలు తక్షణమే మర్చిపోబడతాయి. ఆవిష్కరణ యొక్క పారవశ్యంలో మునిగిపోయినప్పుడు, సమయం అలాగే నిలిచిపోతుంది. మరేదీ అంత ముఖ్యమైనదిగా అనిపించదు. ఆ క్షణంలో కలిగే పులకరింతలో కొట్టుకొనిపోయి, వికసించిన సీతాకోకచిలుకను చూస్తున్న చిన్న పిల్లవాడిలా వర్ణించలేని అనుభూతితో మనం ఆనందిస్తాము. ఇటువంటి ఆవిష్కరణలకు అనేక కోణాలు ఉన్నాయి:
- సుదీర్ఘ వివాదం యొక్క ముగింపు
- మీరు స్వయంగా సృష్టించినదానిపై అంతర్దృష్టి
- భయం వెనుక “కారణం”
- ఒక అనుభూతిని వివరించడానికి సరైన వ్యక్తీకరణ
- కొన్ని సందర్భాల్లో మీ కడుపు మండిపోవడానికి కారణం
- మీ పిల్లల యొక్క “వంకరతనము” ను గూర్చిన జ్ఞానం
- సమయం మరియు శక్తిని ఆదా చేసే సాంకేతిక పరిజ్ఞానం
- సంక్లిష్టమైనదాన్ని తెలియపరచడానికి ఒక సాధారణ మార్గం
- మీ పర్యవేక్షణలో పనిచేసే వారిని ప్రోత్సహించే పద్ధతి
- అనవసరమైన అపరాధం నుండి ఉపశమనం
సొలొమోను అన్నింటికన్నా గొప్ప ఆవిష్కరణ గురించి వ్రాసాడు: లేఖనము యొక్క నిధి. హోవార్డ్ కార్టర్ యొక్క ఓర్పుతో, నిశ్చయతతో కూడిన శోధనను గుర్తుచేసే విధంగా అతను మాటల్లో వ్రాశాడు:
నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి
నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల
జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా
వివేచన నభ్యసించినయెడల
తెలివికై మొఱ్ఱపెట్టినయెడల
వివేచనకై మనవి చేసినయెడల
వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల
దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు
దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. (సామెతలు 2:1-5)
ఒక ఆవిష్కరణ గురించి మాట్లాడదామా! లేఖనములో దాగి ఉన్న అమూల్యమైన వివేకం యొక్క ఖజానాలను మీరు అన్యమనస్కముగానో లేదా ఆతురుతలోనో ఉన్నట్లయితే కనుగొనడం కష్టం. కానీ దైవిక సత్యం ఉంది, ఆవిష్కరణ కోసం వేచి ఉంది.
లోతైన, లోతైన గని వంటి దేవుని వాక్యం, మీరు పరిశోధించుచున్నప్పుడు దాని సంపదను అందించడానికి సిద్ధంగా ఉంది, అందుకే ఆత్మ అడుగుచున్నాడు, “మీరు ఏదైనా చూడగలుగుతున్నారా?”
Copyright © 2012 by Charles R. Swindoll, Inc.