లారెన్స్ జె. పీటర్ మరియు నేను సన్నిహితులం. లేదు, వాస్తవానికి, మేము ఎప్పుడూ కలవలేదు, కాని మేము చాలాసార్లు కలిసి సందర్శించాము. మేము ఎప్పుడూ కరచాలనం చేయలేదు, కాని మేము తారసపడినప్పటి నుండి మేము సంఘీభావముతోనే ఉన్నాము. నేను ఆయనను ఎప్పుడూ చూడనప్పటికీ, నేను ఆయన వ్యాఖ్యలను చూసి నవ్వి, ఆయన తీర్మానాలకు తల ఊపాను . . . నా స్వంత జీవితం మరియు నా చుట్టూ ఉన్నవారి గురించి ఆయన అద్భుతమైన అంతర్దృష్టితో ఆశ్చర్యపోయాను.
ఈ చిక్కుకు సరళమైన మరియు స్పష్టమైన సమాధానం ఇది: నేను ఆయన పుస్తకం ది పీటర్ ప్రిస్క్రిప్షన్ యొక్క కాపీని కలిగి ఉన్నాను మరియు మీరు కూడా దాన్ని కలిగి ఉండాలి! ఇది ముఖ్యమైన, బలమైన సూత్రాలతో నిండిన చౌక పుస్తకంలా కనబడుతుంది. ఇది “సృజనాత్మకంగా, నమ్మకంగా మరియు సమర్థవంతంగా ఎలా ఉండాలి” అనే దాని గురించి మాట్లాడుతుందని ఆయన అన్నారు, కాని ఆయన మంచి పదాన్ని పట్టించుకోలేదని నేను భావిస్తున్నాను: సంతుష్టిగా ఎలా ఉండాలి.
సహజంగా రావాల్సిన వాటిని అనుభవించడంలో మనకు సహాయపడటానికి మనకు ఒక పుస్తకం అవసరమవటం వింతగా లేదూ? లేదు, నిజంగా లేదు . . . దాని ప్రధాన అంశం సంతుష్టి అయినప్పుడు కాదు . . . మనం పోటీపడి, సాధించి, ఎదిగి, పోరాడి, “విజయాల నిచ్చెన” (దీనిని కొంతమంది నిర్వచించగలరు) ఎక్కడానికి ఆందోళన చెందడానికి తయారుచేయబడినప్పుడు కాదు.
సంతృప్తి అనేది జీవిత సమీకరణంలో తెలియని “X.” అర్ధ చంద్రాకారపు గుడిసెలో నివసించడం లేదా వేయించిన పురుగులు తినడం లేదా మన పెరట్లో గొరిల్లాను పెంచడం వంటివి ఎంత వింతగా ఉంటాయో మనలో చాలా మందికి ఇది అంత వింతగా ఉంటుంది.
నిజాన్ని అంగీకరిద్దాం. మనము సంతుష్టి యొక్క తలుపు తెరిస్తే, ఆహ్వానించబడని ఇద్దరు అతిథులు లోపలికి వెళతారని మీరు మరియు నేను భయపడుతున్నాము: ప్రతిష్ట కోల్పోవడం మరియు సోమరితనం. “ఉన్నతస్థాయికి చేరుకోవడానికి” ఎటువంటి త్యాగమైనా విలువైనదేనని మనం నిజంగా నమ్ముతాము. గర్వించే అమెరికన్లకు, పుట్టుక మరియు కిండర్ గార్టెన్ మధ్య . . . పదవీ విరమణ మరియు వృద్ధాశ్రమం మధ్య . . . లేదా (ఇది బాధిస్తుంది) ఎటువంటి ఆశయం లేని వారి మధ్య సంతుష్టిని ఆస్వాదించాలి.
ఆగి ఆలోచించండి. గొప్ప యాంత్రిక నైపుణ్యాలు కలిగిన యువకుడు హైస్కూల్ తర్వాత “స్థిరపడటానికి” సంతుష్టి చెందకుండా తరచూ సలహా ఇవ్వబడతాడు. తరగతి గదిలో సమర్థురాలైన, సంతృప్తి చెందిన, మరియు సంతోషముగా ఉన్న ఉపాధ్యాయురాలు ప్రిన్సిపాల్ కావడానికి ఆమెకు వచ్చిన అవకాశమును తిరస్కరిస్తే ఆమెను కోపంగా చూస్తారు. ఆ మూలలో ఉన్న సూపర్-డూపర్ హాంబర్గర్స్ యజమాని ప్రతిరోజూ జనాలతో కిక్కిరిసిపోయిన స్టోరును కలిగి ఉన్నాడు మరియు సంతుష్టి కలిగి ఉన్నాడు. కానీ సంతుష్టిని పక్కన పడేసి-అతను మరో పది స్టోర్లు తెరిచి ధనవంతుడయ్యే వరకు స్వార్థపూరిత ఆశయం నుండి విశ్రాంతి తీసుకోడు. ఒక పురుషుడు లేదా స్త్రీ పరిచర్య, కంపెనీ, లేదా మిలిటరీలో సహాయకులుగా లేదా ఎలాంటి సహాయక హోదాలో పనిచేస్తున్నా సరే అతను లేదా ఆమె “అగ్రస్థానం” చేరే వరకు తరచుగా అసంతృప్తి భావాలతో కుస్తీ పడతారు. ఇది గృహిణులు మరియు అణు శాస్త్రవేత్తలకు . . . ప్లంబర్లు మరియు పోలీసులకు . . . ఇంజనీర్లు మరియు సెమినరీ విద్యార్థులకు . . . సంరక్షకులు మరియు దుప్పట్లు పరచేవారికి . . . కళాకారులు మరియు సేవకురాళ్ళకు వర్తిస్తుంది.
ప్రజలు తమకు నచ్చిన విధంగా చేయటానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు, వారు సాధారణంగా ఒకరినొకరు అనుకరిస్తారు అనేది ఒక ఆసక్తికరమైన వాస్తవం. తత్ఫలితంగా, మనం తోలుబొమ్మలను ఆడించే అదే తెలివితక్కువవానిచేత తారుమారు చేయబడిన తీగల నుండి వ్రేలాడబడుచూ వేగంగా అసంతృప్తి చెందిన, అసమర్థమైన కీలుబొమ్మల దేశంగా మారుతున్నాము.
ఇప్పుడు, బాప్తిస్మమిచ్చు యోహాను మాట వినండి: “మీ జీతములతో తృప్తిపొందియుండుడి” (లూకా 3:14). పౌలు మాటలు వినండి: “నాకు కలిగిన బలహీనతలలోను నేను సంతోషించుచున్నాను” మరియు “కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి . . . తృప్తిపొందియుందము” (2 కొరింథీయులకు 12:10; 1 తిమోతికి 6:8). ఇంకొక అపొస్తలుని మాటలు వినండి: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి” (హెబ్రీయులకు 13:5).
నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను: ఇది అమలు చేయడం అంత సులభం కాదు. సంతుష్టి నొందనివారు కోకొల్లలు మరియు మీరు ఓడిపోతారు. మీరు దానికి అనుగుణంగా ఉండాలనే కోరికతో పోరాడాలి. అపొస్తలులందరిలో గొప్పవాడు కూడా అంగీకరించాడు, “సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను” (ఫిలిప్పీయులకు 4:11, ప్రాముఖ్యత జోడించబడింది). ఇది అభ్యాస ప్రక్రియ. . . మరియు మీరు సరైన వాద్యకారుని వింటున్నారని మీకు నమ్మకం వచ్చేవరకు విఫలం చెందటం అంత ఆనందదాయకంగా ఉండదు.
మీకు పూర్తిగా నమ్మకం కలిగినప్పుడు, రెండు విషయాలు జరుగుతాయి: మీ కట్టుబాట్లు తెగిపోతాయి మరియు మీరు స్వేచ్ఛగా ఉంటారు, నిజంగా!
Adapted from Charles R. Swindoll, “Contentment,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 554-55. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.